ETV Bharat / state

ఇంటర్‌ అర్హతతో రైల్వేలో జాబ్స్ - మొదటి నెల నుంచే రూ.40 వేల శాలరీ - చివరి తేదీ ఎప్పుడంటే?

ఇంటర్మీడియట్​తో ఎన్‌టీపీసీ (యూజీ)లో 3693 పోస్టులు - అక్టోబరు 27 వరకు దరఖాస్తులకు అవకాశం - నోటిఫికేషన్​ పూర్తి వివరాలు మీ కోసం..

rrb ntpc latest Updates
rrb ntpc recruitment 2024 (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 14, 2024, 11:02 AM IST

Updated : Oct 14, 2024, 11:56 AM IST

RRB NTPC Recruitment 2024 : ఇంటర్మీడియట్‌ విద్యార్హతతో చిన్న వయసులోనే కేంద్రంలో ఉద్యోగం వచ్చే అవకాశం మీ ముందుకొచ్చింది. ఇందుకు భారతీయ రైల్వే వేదిక కానుంది. నాన్‌ టెక్నికల్‌ పాపులర్‌ కేటగిరీ (ఎన్‌టీపీసీ)లో 3693 పోస్టుల భర్తీకి ఆర్​ఆర్​బీ ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు పోస్టుల భర్తీకి రైల్వే నియామక బోర్డు ఆహ్వానం పలుకుతున్నాయి. పరీక్షలో ప్రతిభ చూపితే చాలు ఉద్యోగంలో చేరిపోవచ్చు. ఆ తర్వాత ఉన్నత స్థాయికి కూడా చేరుకోవచ్చు. ఇటీవల ఐటీఐ, ఇంటర్‌, డిగ్రీ ఇలా పలు విద్యార్హతలతో ఆర్‌ఆర్‌బీ దశలవారీగా ప్రకటనలు విడుదల చేసిన విషయం తెలిసిందే.

అలాగే వీటికి దరఖాస్తు చేసుకోవడానికి సైతం గడువు తేదీలను పొడిగించింది. ఎన్‌టీపీసీ ఇంటర్, డిగ్రీ పోస్టులకు పరీక్ష విధానం, సిలబస్‌ ఒకటే. దీంతో డిగ్రీ ఉన్నవారు రెండింటికీ పోటీ పడొచ్చు. పరీక్షలు మాత్రం వేర్వురుగా జరుగుతాయి. డిగ్రీతో పోలిస్తే ఇంటర్మీడియట్‌ పోస్టుల క్వశ్చన్స్​ కొంచెం తక్కువ కఠినంగా ఉంటాయి. అయినప్పటికీ పోటీ మాత్రం వీటికే ఎక్కువగా ఉంటుంది. డిగ్రీ, పీజీ అర్హతలు ఉన్నవారు సైతం దీనికి పోటీపడటమే ప్రధాన కారణం. ఇప్పటికే బ్యాంకులు, ఎస్​ఎస్​సీ, రైల్వే ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్నవారు రాణించగలరు. పరీక్ష కోసం తెలుగు మాధ్యమాన్ని కూడా ఎంచుకోవచ్చు. అభ్యర్థులు ఏదో ఒక ఆర్​ఆర్​బీలో ఖాళీలకు మాత్రమే పోటీ పడగలరు.

పోస్టులు : ఎన్‌టీపీసీ ఇంటర్మీడియట్‌ విద్యార్హతతో కమర్షియల్‌ కమ్ టికెట్‌ క్లర్క్‌-2022, జూనియర్‌ క్లర్క్‌ కమ్‌ టైపిస్ట్‌-990, అకౌంట్స్‌ క్లర్క్‌ కం టైపిస్ట్‌-361, ట్రెయిన్స్‌ క్లర్క్‌-72 ఖాళీలున్నాయి. దివ్యాంగుల కోసం 248 పోస్టులను చేర్చారు. వీటిలో కమర్షియల్‌ క్లర్క్‌ కమ్‌ టికెట్‌ క్లర్క్‌ ఉద్యోగాలకు లెవెల్​-3 జీతం చెల్లిస్తారు. వీరికి రూ.21,700 మూలవేతనం అందుతుంది. అన్నీ దాదాపు రూ.40 వేలు వీరు పొందుతారు. మిగిలినవి లెవల్​-2 ఉద్యోగాలకు రూ.19,900 మూల వేతనం చెల్లిస్తారు. అన్నీ కలిపి వీరు మొదటి నెల నుంచే సుమారు రూ.36 వేలు అందుకోవచ్చు.

ఎంపిక ఇలా : అన్ని పోస్టులకు రెండు దశల్లో కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్టు (సీబీటీ) నిర్వహిస్తారు. వీటిలో ప్రావీణ్యం తప్పనిసరి. అకౌంట్స్‌ క్లర్క్, జూనియర్‌ క్లర్క్ పోస్టులకు టైపింగ్‌ స్కిల్‌ టెస్టు నిర్వహిస్తారు. తర్వాత ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. స్టేజ్​ -1లో మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి. వీటికి 90 నిమిషాల పరీక్ష సమయం. అందులో జనరల్‌ అవేర్‌నెస్‌ నుంచి 40, మ్యాథమెటిక్స్‌ 30, జనరల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్‌ నుంచి 30 ప్రశ్నలు వస్తాయి. స్టేజ్​-1లో అర్హత పొందినవారి నుంచి, కేటగిరీల వారీగా ఉన్న ఖాళీలకు మెరిట్​ ప్రకారం 15 రెట్ల మందిని స్టేజ్​-2కు ఎంపిక చేస్తారు. స్టేజ్​-2లో 120 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష వ్యవధి 90 నిమిషాలు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు. జనరల్‌ అవేర్‌నెస్‌ 50, మ్యాథమెటిక్స్‌ 35, జనరల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్‌ నుంచి 35 ప్రశ్నలు వస్తాయి.

అర్హత : ఆర్​ఆర్​బీ నిర్వహించే స్టేజ్‌-1, స్టేజ్‌-2లలో అన్‌ రిజర్వ్‌డ్, ఈడబ్ల్యుఎస్‌ 40, ఓబీసీ ఎన్‌సీఎల్, ఎస్సీ 30, ఎస్టీ 25 శాతం మార్కులు పొందాలి. పీడబ్ల్యూడీలైతే వారి కేటగిరీ ప్రకారం అదనంగా మరో 2 శాతం మినహాయింపు దక్కుతుంది. ప్రతి తప్పు సమాధానానికీ రెండు దశల్లోనూ 1/3 మార్కు తగ్గిస్తారు. టైపిస్ట్​ పోటీలకు పోటీ పడే వారికి స్టేజ్‌-2లో అర్హుల జాబితా నుంచి మెరిట్‌ ప్రకారం కేటగిరీల వారీ ఖాళీలకు 8 రెట్ల సంఖ్యలో టైపింగ్‌ స్కిల్‌ టెస్టు నిర్వహిస్తారు. ఇందులో వారు అర్హత సాధిస్తే చాలు. ఇంగ్లీష్​లో నిమిషానికి 30 పదాలు టైప్​ చేయాలి.

ముఖ్య వివరాలు : ఆర్​ఆర్​బీ ప్రకటించిన ఎన్‌టీపీసీ పోస్టులకు అర్హత ఇంటర్మీడియట్‌ లేదా తత్సమానం. జనవరి 1, 2025 నాటికి 18 నుంచి 33 ఏళ్లలోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు కేటగిరీ ప్రకారం 10 నుంచి 15 ఏళ్లు గరిష్ఠ వయసులో సడలింపు ఉంటుంది.

ఆన్​లైన్​ దరఖాస్తు చివరి తేదీ : అక్టోబరు 27, 2024.

దరఖాస్తు ఫీజు : మహిళలు, ఎస్సీ, ఎస్టీ, ట్రాన్స్‌జండర్, ఈబీసీలకు రూ.250 మాత్రమే. వీరు సీబీటీకి హాజరైతే బ్యాంకు ఛార్జీలు మినహాయించి, మిగిలిన ఫీజు వెనక్కి చెల్లిస్తారు. ఇతర వర్గాల వారికి రూ.500 ఫీజు. వీరు సీబీటీకి హాజరైతే రూ.400ల్లో బ్యాంకు ఛార్జీలు మినహాయించి మిగిలినవి వెనక్కి చెల్లిస్తారు.

పరీక్ష తేదీలు : ఇంకా వెల్లడించలేదు. త్వరలో ప్రకటిస్తారు.

వెబ్‌సైట్‌ : www.rrbapply.gov.in/#/auth/landing

నోట్​ : ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ గ్రాడ్యుయేట్‌ పోస్టులకు దరఖాస్తు గడువు అక్టోబరు 20 వరకు పొడిగించారు. డిగ్రీ అర్హతతో వీటికి పోటీపడొచ్చు. ఐటీఐ లేదా అప్రెంటీస్‌ అర్హతతో 13,206 గ్రేడ్‌-3 టెక్నీషియన్‌ పోస్టులకు అక్టోబరు 16లోగా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇంటర్వ్యూ లేకుండానే రైల్వే జాబ్స్ - డిగ్రీ ఉంటే చాలు - నెలకు రూ.65 వేల శాలరీ - RRB NTPC Recruitment 2024

ఇంటర్​ అర్హతతో - రైల్వేలో 3,445 క్లర్క్​ & టైపిస్ట్​ పోస్టులు - దరఖాస్తు చేసుకోండిలా! - Railway Jobs 2024

Last Updated : Oct 14, 2024, 11:56 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.