ETV Bharat / state

ఆదిలాబాద్ రైల్వే అండర్‌ - ఓవర్‌ వంతెన నిర్మాణ పనులకు బ్రేక్ - కారణం అదేనా? - Break To Adilabad Railway - BREAK TO ADILABAD RAILWAY

Break To Adilabad Railway : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో చేపట్టిన ఆదిలాబాద్‌ రైల్వే అండర్‌, ఓవర్‌ బ్రిడ్జిల నిర్మాణ పనులకు బ్రేక్‌ పడింది. భూసేకరణ కోసం అవసరమైన నిధులను ప్రభుత్వం విడుదల చేయకపోవటంతో పనుల నిర్వహణకు ఆటంకం ఏర్పడింది. గుత్తేదారు సైతం చేతులెత్తేయడంతో ఆర్భాటంగా ప్రారంభమైన పనులు అర్ధాంతరంగా నిలిచిపోవడం కలకలం సృష్టిస్తోంది.

Break To Adilabad Railway
Adilabad Railway Works Stopped (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : May 19, 2024, 10:02 AM IST

ఆదిలాబాద్ రైల్వే ఓవర్‌ అండర్‌ వంతెనల పనులు నిలిపివేత నిధుల కోసం నిరీక్షణ (ETV Bharat)

Adilabad Railway Works Stopped : ఇన్నాళ్లూ నిరాధరణకు గురైన ఆదిలాబాద్‌ పట్టణంలోని రైల్వే ఓవర్‌, అండర్‌ బ్రిడ్జిల నిర్మాణం ఇప్పటికీ అవరోధాలను ఎదుర్కొంటూనే ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యం కింద రూ.97 కోట్ల 20 లక్షలు మంజూరుకు వచ్చింది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం రూ.57 కోట్ల 71 లక్షలు, కేంద్ర ప్రభుత్వం రూ.39 కోట్ల 49 లక్షలు పనుల కోసం వెచ్చించాల్సి ఉంది. నోడల్‌ ఏజెన్సీగా ఆర్‌ అండ్‌ బీ యంత్రాంగం హైదరాబాద్‌కు చెందిన తనిష్క్‌ కన్​స్ట్రక్షన్స్ కంపెనీ పనులను దక్కించుకుంది.

ఆదిలాబాద్‌లోని సంజయ్‌నగర్‌ పరిధిలోకి వచ్చే ఎల్​ఐసీ భవనం నుంచి మొదలుకొని మార్కెట్‌ యార్డు వరకు ఓవర్‌ బ్రిడ్జి, తాంసి బస్టాండ్‌ ప్రాంతంలో అండర్‌ బ్రిడ్జి పనులను 2024 నవంబర్‌ 23లోగా పూర్తి చేయాల్సి ఉంది. శాసనసభ ఎన్నికల ముందు 2023 మే నాలుగో తారీఖున ఆదిలాబాద్‌ ఎంపీ సోయం బాపురావు, ఇప్పటి ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌, అప్పటి ఎమ్మెల్యే జోగు రామన్న పనులను ప్రారంభించడం రాజకీయాలకతీతంగా అందరిలోనూ ఆశలను రేకెత్తించింది.

"తమ ప్రభుత్వం రాగానే వచ్చి చేస్తాం అని చెప్పడమే కానీ వచ్చి చేసేది ఏమీ లేదు. వాళ్ల పనులు వారు చేసుకోవడం తప్ప ప్రజలను పట్టించుకునే నేతే లేరు. రాష్ట్ర ప్రభుత్వమేమో ఆ పని కేంద్ర ప్రభుత్వానిది అని చెబుతుంది. కానీ పనులు మాత్రం ముందుకు సాగడం లేదు. మాకు బ్రిడ్జి అనుమతులు రాగానే పనులు మొదలు పెట్టారు. కానీ నిధులు లేక ఆపేశారు. ప్రభుత్వం ఏదైనా సరే వీలైనంత త్వరగా బ్రిడ్జి పనులు పూర్తి చేయాలని మేము కోరుకుంటున్నాం." - స్థానికులు

ప్రభుత్వం నయాపైసా నిధులు చెల్లించకపోవటంతో పనులు దక్కించుకున్న గుత్తేదారు ప్రభుత్వ స్థలాల్లో పిల్లర్ల నిర్మాణం చేపట్టి ప్రైవేటు స్థలాల్లో పనులు ప్రారంభించలేదు. భూ నిర్వాసితులకు చెల్లించాల్సిన రూ.27 కోట్ల పరిహారాన్ని ప్రభుత్వం ఇప్పటికీ విడుదల చేయలేదు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పోయి కాంగ్రెస్‌ ప్రభుత్వం కొలువుదీరింది. అంతేకాకుండా పార్లమెంటు ఎన్నికల ఘట్టం సైతం ముగిసింది. నేతలు మారినా, ప్రభుత్వాలు మారినా ఈ రైల్వే పనుల్లో మాత్రం మార్పు కనపించటం లేదు. పనులు అర్ధంతరంగా ఆగటం స్థానికుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. మరోపక్క ప్రభుత్వం నిధులు విడుదల చేయనిది తామేం చేయలేమనే మాట అధికారవర్గాల్లోంచి వస్తోంది.

ఇందూరు వాసులకు తొలగనున్న ఇబ్బందులు - చకచకా సాగుతున్న ఆర్వోబీ పనులు - ROB WORKS IN NIZAMABAD

Nizamabad: మాధవనగర్​ రైల్వే ఓవర్​ బ్రిడ్జి పనులు వేగవంతం.. ఇంకా కొన్ని రోజుల్లోనే..!

Budget under SCR:ఈ ఏడాదికి ద.మ రైల్వేకు నిధుల కేటాయింపులు ఇవే..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.