Lok Sabha Elections 2024 : రాష్ట్రవ్యాప్తంగా ఓటింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. వికారాబాద్ జిల్లా కొడంగల్‌లో సీఎం రేవంత్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇదిలా ఉండగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మెదక్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ఈసీకి ఫిర్యాదు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఈసీ నిబంధనలను ఉల్లంఘించారని, తక్షణమే సీఎంపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
కొడంగల్‌లో ఓటు వేసిన అనంతరం సీఎం రేవంత్ ప్రెస్‌మీట్ పెట్టడంపై రఘునందన్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటు వేసిన తర్వాత రాజకీయపరమైన అంశాలపై సీఎం ప్రెస్‌మీట్ పెట్టారంటూ మండిపడ్డారు. ప్రెస్‌మీట్‌లో మోదీ, బీజేపీపై సీఎం రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. ఓటమి భయంతోనే నిబంధనలు ఉల్లంఘించి ప్రచారం చేశారని విమర్శించారు. తక్షణమే ఈసీ స్పందించి సీఎంను గృహ నిర్భందంలో ఉంచాలని పేర్కొన్నారు.
అసలేం జరిగిందంటే? సీఎం రేవంత్‌రెడ్డి తన సొంత నియోజకవర్గం కొడంగల్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం ప్రెస్‌మీట్ నిర్వహించారు. పలు అంశాలను కీలకంగా ప్రస్తావించారు. ఈ ఎన్నికల్లో కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పంద్రాగస్టులోగా రైతు రుణమాఫీ చేసి తీరుతామని పునరుద్ఘాటించారు. రైతు రుణమాఫీ ఏమీ అసాధ్యమైన టాస్క్ కాదన్న సీఎం రేవంత్ రెడ్డి, పార్లమెంట్ ఎన్నికలు తమ 100 రోజుల పాలనకు రెఫరెండమన్నారు. పై వ్యాఖ్యలు ఓటర్లను ప్రభావితం చేసేలా ఉన్నాయని రఘునందన్ రావు పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డిపై తక్షణనమే ఈసీ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
కొడంగల్‌లో ఓటేసిన సీఎం రేవంత్ రెడ్డి - మంత్రులు ఎక్కడెక్కడ వేశారంటే? - CM Revanth Reddy Casted Vote
ఓటెత్తిన అధికారులు - ఎవరెవరు ఎక్కడెక్కడ ఓటు వేశారంటే? - OFFICERS CASTED VOTE IN TELANGANA