Rabi Paddy Procurement in Telangana 2024 : రాష్ట్రంలో ధాన్యం సేకరణ కార్యకలాపాలు చురుకుగా సాగుతున్నాయి. ఈ ఏడాది యాసంగి మార్కెటింగ్ సీజన్ సంబంధించి ఏప్రిల్ 1వ తేదీ నుంచి ధాన్యం కొనుగోళ్ల(Grain Purchase Centres) ప్రక్రియ ప్రారంభించిన దృష్ట్యా సేకరణ ప్రశాంతంగా జరుగుతోంది. తాజా రబీ పంట కాలం ముగింపు దశకు చేరుతున్న వేళ వరి కోతలు ఆరంభమైన నేపథ్యంలో ఖమ్మం, నల్గొండ, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ తదితర ఐదు ఉమ్మడి జిల్లాల్లో కొనుగోళ్ల ప్రక్రియ మొదలైంది.
రాష్ట్రంలో రైతులకు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం అన్ని ప్రాంతాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు నెలకొల్పుతోంది. గత ఏడాది యాసంగిలో ఈ సమయానికి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కూడా కాలేదు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది ధాన్యం కొనుగోళ్లను ప్రభుత్వం ముందుగానే ప్రారంభించింది. మార్చి చివరి వారం 25వ తేదీ నుంచే సెంటర్లు ప్రారంభమయ్యాయి.
Yasangi Grain Purchase in Telangana : ఈ సీజన్లో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 7,149 ధాన్యం కొనుగోలు కేంద్రాలను తెరిచేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసిన పౌరసరఫరాల శాఖ ఇప్పటికే 5,422 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించింది. మిగతా 1,727 కొనుగోలు కేంద్రాలు మరో రెండు రోజుల్లో తెరిచేందుకు సన్నద్ధమైంది. వేసవి ఎండలు తీవ్రత ప్రభావం దృష్టిలో పెట్టుకుని రైతులకు(Paddy Farmers) ఇబ్బందులు తలెత్తకుండా ఇప్పటి దాకా పౌరసరఫరాల సంస్థ ద్వారా 443 కొనుగోలు కేంద్రాల్లో 4,345 మంది రైతులు నుంచి 31,215 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లు జరిగాయి.
అకాల వర్షాలతో అపార పంట నష్టం - ఆదుకోమంటూ రైతన్నల వేడుకోలు
ఈ ఏడాది యాసంగిలో దాదాపు 75.40 లక్షల మెట్రిక్ టన్నుల వడ్ల కొనుగోళ్లు జరుగుతాయని అంచనా. ధాన్యం సేకరణకు 18.85 కోట్ల గన్నీ సంచులు అవసరమవుతాయి. ఇప్పటికే 14 కోట్ల గన్నీ సంచులు అందుబాటులో ఉన్నాయి. దాదాపు 56 లక్షల మెట్రిక్ టన్నుల వడ్ల కొనుగోళ్లకు ఇవి సరిపోతాయి. మిగతావి కూడా వీలైనంత తొందరగా కొనుగోలు చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
ఫిర్యాదులకు టోల్ ఫ్రీ, హెల్ప్ లైన్ నంబర్లు : రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా కేంద్ర, భారత ఆహార సంస్థ(Food Corporation of India) నుంచి ప్రత్యేక అనుమతి తీసుకుని ముందస్తుగా కొనుగోలు కేంద్రాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. క్షేత్రస్థాయిలో ఏదైనా సమస్యలు లేదా ఫిర్యాదులు ఉన్నట్లైతే రైతులు టోల్ ఫ్రీ, హెల్ప్‌లైన్(Toll Free Number) నంబర్లు 1967 లేదా 180042500333కు కాల్ చేయవచ్చని పౌరసరఫరాల శాఖ సూచించింది.
రాష్ట్రమంతా పంటలు ఎండుతున్నా - ఆ ఊర్లో మాత్రం ఎక్కడ చూసినా పచ్చని పొలాలే - కారణం ఏంటంటే?
రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లకు సర్కార్ సిద్ధం - అయినా ప్రైవేట్ వైపే రైతుల మొగ్గు