ETV Bharat / state

సంస్కృతి, పురాణాలు, ఇతిహాసాలు మరచిపోకుండా 'ఉగాండా'లో రామాయణ కావ్యంపై క్విజ్​ పోటీలు - Quiz on Ramayana in Uganda

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 6, 2024, 10:24 PM IST

Quiz on Ramayana Kavyam : ఉగాండా రాజధాని కంపాలా నగరంలో ఉన్న హిందూ పిల్లలు సంస్కృతి, వారసత్వం, పురాణాలు, ఇతిహాసాలు మరచిపోకుండా రామాయణ కావ్యంపై క్విజ్​ ప్రోగ్రాం ప్రారంభించారు. సుమారు 216 మంది పిల్లలు 54 టీమ్​లుగా పాల్గొన్నారు. క్వాలిఫైయింగ్ రౌండులో పోటీ పడి ద్వితీయ రౌండ్​కు 22 టీమ్​లు చేరుకున్నాయి.

Quiz on Ramayana Kavyam
Quiz on Ramayana Kavyam in Uganda (ETV Bharat)

Quiz on Ramayana Kavyam in Uganda : భారతదేశానికి దూరంగా ఉన్న హిందూ పిల్లలు సంస్కృతి, వారసత్వము, పురాణాలు, ఇతిహాసాలు మరచిపోకుండా ఉగాండా రాజధాని కంపాలాలో కిటెన్టే ప్రాంతంలో రామాయణ కావ్యంపై క్విజ్​ ప్రోగ్రాం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో 54 టీమ్​లు పాల్గొనగా సుమారు 216 పిల్లలు ఉన్నారు. రామాయణ కావ్యంపై క్వాలిఫైయింగ్ రౌండులో పోటీ పడి 22 టీమ్​లు ద్వితీయ రౌండ్​కు చేరుకున్నాయి.

2011 మేలో కంపాలా నగరము కిటెన్టే ప్రాంతంలో సప్తగిరి శ్రీ వెంకటేశ్వర ఆలయం భక్తులకు కొంగు బంగారమై కొలువుతీరింది. 13 సంవత్సరాలుగా భక్తులందరి కోరికలు తీరుస్తూ ఎన్నో వైభవోపేతమైన కార్యక్రమాలతో భక్తుల మదిలో చిరస్థాయిగా కొలువుదీరి ఉన్నాడు ఆ శ్రీనివాసుడు. ఆలయ ధర్మకర్తలు, పూజారులు, భక్తుల మొక్కులతో యథావిధిగా స్వామివారిని కలియుగ ప్రత్యక్ష దైవంలా భాసిల్లుచున్నారు. ఈ నేపథ్యంలో అద్వైత గీత మండలి స్వామివారి కీర్తనలు, పాటలు, భగవద్గీత శ్లోకాలు నేర్పే మహిళా సమూహం ఏర్పడింది.

ఇతిహాసాలు, కథలు తెలియజేయాలని : తరువాతి తరాలకు హిందూ ఇతిహాసాలు, కథలు తెలియజేయాలన్న ఆలోచనలతో సఫలీకృతం అవ్వడమే కాకుండా ఎంతో మందిలో ఆధ్యాత్మికత మేల్కొన్నదని అక్కడున్న హిందూ భక్తులు చెబుతున్నారు. ఈ జ్యోతి ఇలానే వెలుగుతూ భారతీయులు ఎక్కడ ఉన్నా ఒక్కటే అన్నట్టు వంటి భావన ప్రతి మదిలోను వెల్లివిరియాలని ఆక్షాంక్షిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.