ETV Bharat / offbeat

"మహారాష్ట్ర స్టైల్​ పచ్చిమిర్చి రోటి పచ్చడి" - ఇలా చేస్తే వేడివేడి అన్నంలోకి అద్దిరిపోతుంది! - GREEN CHILLI CHUTNEY RECIPE

-రొటీన్​ పచ్చళ్లకు బదులుగా.. ఈ రోటి పచ్చడి టేస్ట్​ చేయండి! -ఒక్కసారి తిన్నారంటే ఎవరైనా ఫిదా!

How to Make Green Chilli Chutney
How to Make Green Chilli Chutney (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 14, 2024, 11:04 AM IST

How to Make pachimirchi pachadi: కొంతమంది కర్రీల కంటే రోటి పచ్చళ్లను ఎంతో ఇష్టంగా తింటుంటారు. అలాంటి వారికోసం ఒక సూపర్ టేస్టీ పచ్చడి రెసిపీ తీసుకొచ్చాం. అదే "మహారాష్ట్ర స్టైల్​ థెచా". మనకు అర్థమయ్యేలా చెప్పాలంటే.. పచ్చిమిర్చి రోటి పచ్చడి. రొటీన్ కూరలు, పచ్చళ్లు తిని తిని బోర్ కొడితే.. ఒక్కసారి ఈ పచ్చిమిర్చి పచ్చడిని ట్రై చేసి చూడండి. వేడివేడి అన్నంలో ఈ పచ్చిమిర్చి పచ్చడి టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. పైగా ఈ పచ్చడి తాలింపు అవసరం లేకుండా చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. మరి, పచ్చిమిర్చి పచ్చడికి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? అన్నది ఈ స్టోరీలో చూద్దాం.

థెచా రెసిపీకి కావాల్సిన పదార్థాలు :

  • బజ్జీ మిర్చి - 8
  • చిన్న మిర్చి- 50 గ్రాములు (మీడియం కారం ఉన్నవి)
  • జీలకర్ర - 1 చెంచా
  • వెల్లుల్లి రెబ్బలు - 25 (పొట్టు తీసినవి)
  • ఉప్పు - రుచికి సరిపడా
  • నూనె
  • పల్లీలు-పావుకప్పు
  • కొత్తిమీర తరుగు-కొద్దిగా

తయారీ విధానం :

  • ఇందుకోసం ముందుగా బజ్జీ మిర్చిని తొడిమలు తీసి శుభ్రంగా కడగాలి. ఆపై ఒక అంగుళం పరిమాణంలో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
  • అలాగే చిన్న మిర్చిల తొడిమలు తీసి శుభ్రంగా కడగాలి. వీటిని కూడా రెండు ముక్కలుగా కట్​ చేసుకోండి.
  • ఇప్పుడు స్టౌపై ఇనుప పెనం పెట్టండి. ఇందులో బజ్జీ మిర్చి, చిన్నమిర్చి ముక్కలు వేసి సన్నని సెగ మీద వేపండి.
  • మిర్చిలపై నల్లటి మచ్చలు వచ్చేవరకు వేపుకోండి.
  • ఇలా మిర్చిలు రంగు మారాక.. ఇందులో కొద్దిగా నూనె వేసి ఫ్రై చేయండి.
  • అనంతరం జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, పల్లీలు వేసి వేపండి. స్టౌ లో ఫ్లేమ్​లో అడ్జస్ట్​ చేసి దోరగా వేపుకోండి.
  • పల్లీలు దోరగా వేగాక రుచికి సరిపడా ఉప్పు వేసి మిక్స్​ చేయండి.
  • ఆపై కొత్తిమీర తరుగు చల్లి కలిపి స్టౌ ఆఫ్​ చేయండి.
  • ఇప్పుడు రోటిలోకి మిశ్రమాన్ని పూర్తిగా తీసుకుని కచ్చాపచ్చాగా రుబ్బుకోండి. రుబ్బుకున్న పచ్చడిని ఒక గిన్నెలోకి తీసుకోండి.
  • రుబ్బుకునేటప్పుడు నీళ్లు పోయకూడదు. మీరు మిక్సీ జార్లో గ్రైండ్​ చేసుకుంటే కాస్త బరకగా గ్రైండ్​ చేసుకోండి.
  • అంతే ఇలా సింపుల్​గా చేసుకుంటే ఎంతో రుచికరమైన మహారాష్ట్ర స్టైల్​ పచ్చిమిర్చి పచ్చడి తయారైపోతుంది.
  • నచ్చితే ఈ విధంగా పచ్చడి ఓ సారి ట్రై చేయండి.

"గుంట పొంగనాలు + పచ్చిమిర్చి పచ్చడి" డెడ్లీ కాంబినేషన్ - ఈజీగా ప్రిపేర్ చేసుకోండిలా - టేస్ట్ అద్దిరిపోతుంది!

పదే పది నిమిషాల్లో - పసందైన "పచ్చికొబ్బరి పచ్చిమిర్చి పచ్చడి" - టేస్ట్ వేరే లెవల్ అంతే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.