ETV Bharat / state

తాగునీటి మళ్లింపు- పుట్టపర్తి ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు - Police Complaint on Puttaparthi MLA - POLICE COMPLAINT ON PUTTAPARTHI MLA

Puttaparthi MLA Accused Stealing water in Satyasai district : తోటకు ఏర్పాటు చేసిన పైపులైన్‌ను తీసేస్తావా ఎంత ధైర్యం మీకు అంటూ పుట్టపర్తి ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి అధికారులపై రెచ్చిపోయిన సంగతి తెలిసిందే. ప్రజల దాహార్తిని తీర్చే సత్యసాయి తాగునీటి పథకం పైపులైన్‌ను ఎమ్మెల్యే తన తోటకు మళ్లించిన ఉదంతంపై చర్యలు తీసుకున్న వారిపై ఎమ్మెల్యే నిప్పులు చెరిగారు.

puttaparthi_mla_accused_stealing_water_in_satyasai

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 10, 2024, 5:28 PM IST

Puttaparthi MLA Accused Stealing water in Satyasai district : శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలో ప్రజలకు తాగునీటి సరఫరా చేసే పైప్‌లైన్‌ను సొంత పొలాలకు మళ్లించుకున్న స్థానిక వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేపై నీటిపారుదలశాఖ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నల్లమడ మండలం నల్ల సింగరాయపల్లిలో సత్యసాయి వాటర్ సప్లైకి సంబంధించిన పైప్‌లైన్‌ను ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి తన పొలానికి మళ్లించారు. నీళ్లు లేక ఎగువన ఉన్న గ్రామాల ప్రజలు పడుతున్న ఇబ్బందులపై ఈనాడులో వచ్చిన కథనానికి అధికారులు స్పందించారు. తోటకు మళ్లించిన పైప్‌లైన్‌ను కట్ చేశారు.

తాగునీటి పైప్​లైన్ తోటకు మళ్లించుకున్న ఎమ్మెల్యే- అడ్డుకున్నఅధికారులపై అనుచరుల వీరంగం - Puttaparthi MLA Sridhar Reddy

Complaint On Puttaparty MLA : దీనిపై ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి అధికారులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ బెదిరింపులకు దిగారు. ఈ విషయంపై సత్యసాయి జిల్లా నీటిపారుదల శాఖ అధికారులు నల్లమడ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఉద్దేశపూర్వకంగా అధికారులను, సత్యసాయి వాటర్‌ సప్లై సిబ్బందిని ఎమ్మెల్యే భయపెడుతున్నారని ఫిర్యాదులో తెలిపారు. నాలుగున్నర సంవత్సరాలుగా సత్యసాయి పైప్‌లైన్‌ నీటిని ఎమ్మెల్యే తరలిస్తున్నా అధికారులు పట్టించుకోలేదని ప్రజలు వాపోతున్నారు.

తోటకు ఏర్పాటు చేసిన పైపులైన్‌ను తీసేస్తావా ఎంత ధైర్యం మీకు అంటూ పుట్టపర్తి ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి అధికారులపై రెచ్చిపోయిన సంగతి తెలిసిందే. ప్రజల దాహార్తిని తీర్చే సత్యసాయి తాగునీటి పథకం పైపులైన్‌ను ఎమ్మెల్యే తన తోటకు మళ్లించిన ఉదంతంపై సోమవారం చర్యలు తీసుకున్న వారిపై ఎమ్మెల్యే నిప్పులు చెరిగారు.

పార్టీ మారిన కాంట్రాక్టర్​ - బిల్లులు చెల్లించకుండా ఎమ్మెల్యే పీఏ వేధింపులు - Problem with YCP MLA PA Murali

Irrigation Officials Filed Complaint On MLA : ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు నల్లమాడ మండలం నల్లసింగయ్యగారిపల్లిలోని ఎమ్మెల్యే తోటకు వెళ్లి పైప్​లైన్​ ను పరిశీలించారు. అది తాగునీటి పథకం ప్రధాన పైపులైన్‌ నుంచి ఎమ్మెల్యే తోటకు అక్రమంగా వేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలోనే పైపులైన్​ను తొలగించేందుకు సిద్ధం అయ్యారు. కానీ ఎమ్మెల్యే అక్కడికి తన అనుచరులను పంపించి వీరంగం సృష్టించారు. అధికారం అండతో ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారిని ఫోన్‌లో బూతులు తిట్టారు. అంతటితో ఆగకుండా పైపులైన్‌ను తొలగిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని బెదిరించారు. తాగునీటిని తోటకు వాడుకునేందుకు అప్పటి కలెక్టరే అనుమతి ఇచ్చారంటూ బుకాయించారు. అయినా అధికారులు వెల్డింగ్‌ చేసి, పైప్‌లైన్‌ను తీసేశారు. అయితే, నాలుగున్నరేళ్లుగా సాగుతున్న నీటిచౌర్యంపై అధికారులు కేసు పెట్టలేదు. నీటి మళ్లింపులో కొందరు ఉద్యోగుల ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. వారిపైనా ఎలాంటి విచారణకు ఆదేశించలేదు.

తాగునీటి మళ్లింపు- పుట్టపర్తి ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు

ఇవి వైసీపీ ఏలుబడిలోని నీతిపాఠాలు- పిల్లి పిల్లి కొట్టుకుంటే కోతి లాక్కుపోయింది!

అక్రమమైన సక్రమమైన ఆ వైఎస్సార్సీపీ నేతకు కప్పం కట్టాల్సిందే! - YCP leader irregularities in AP

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.