ETV Bharat / state

పులస అ'ధర'హో - రూ.24 వేలకు అమ్మిన గంగపుత్రుడు - pulasa fish sold for rs 24 thousand

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 13, 2024, 11:50 AM IST

Pulasa Fish Rate in Godavari District: రాజుగారి కథలో మాదిరిగా 'చేపా చేపా నీకెందుకంత రేటు' అని ఎవరైనా అడిగారే అనుకుందాం. 'నా పేరు పులస అందుకే నాకంత గిరాకీ' అని సమాధానం ఇస్తుందేమో బాసూ. గోదావరి జిల్లాల్లో ఈ చేప కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తుంటారు. వర్షాకాలం ప్రారంభం కావడంతో కోనసీమ జిల్లాలోని వశిష్ట గోదావరిలో సుమారు కేజీన్నర బరువున్న పులస చేప పడింది. ఈ చేప రూ.24 వేలకు అమ్ముడుపోయంది.

Pulasa Fish Rate in Godavari District
Pulasa Fish Rate in Godavari District (ETV Bharat)

Pulasa Fish Rate in Godavari District : గోదావరి నదిలో దొరికే అత్యంత అరుదైన చేప, ఏటికి ఎదురీదుతూ ఏ చేపకూ లేని ప్రత్యేకతనూ, రుచిని సంతరించుకున్నదే పులస చేప. గోదావరి జిల్లాల్లో లభించే ఈ చేపను రూచి చూడటానికి మాంసాహార ప్రియులు అధిక ధర వెచ్చించి మరీ కొనుగోలు (Pulasa Fish Price 24 Thousand) చేస్తుంటారు. గోదావరి వరద నీటిలో ఈ చేప దొరికితే చాలు మత్స్యకారుల పంట పండినట్లే.

మీకు కూడా నోట్లో నీళ్లు ఊరుతున్నాయా? : మాంసాహారం అందులోనూ చేపల పులుసు అంటే నచ్చని వారుంటారా? ఇంకా గోదావరి నదిలో దొరికే పులస చేప పేరు వింటే నోరూరని వారంటూ ఉండరు. పులస కూర ఎప్పుడు రుచిచూడాలా అని మాంసాహార ప్రియులు ఎదురు చూస్తున్నారు. అందుకే 'పెళ్లాం పుస్తెలు అమ్మి అయినా సరే పులస కూర తినాలనేది' గోదావరి జిల్లాల్లో దశాబ్దాల కాలంగా ఓ నానుడి. అరుదుగా ఒకటీ రెండు లభించే ఈ జాతి చేపల కోసం మాంసాహార ప్రియులు వెంపర్లాడుతుంటారు. మత్స్యకారుల వద్ద పోటీపడి మరీ కొనుగోలు చేస్తుంటారు. ఇతర రాష్ట్రాల్లోని తమ బంధువులకు బహుమతిగా పంపుతుంటారు. ఇది చదువుతుంటే మీకు కూడా నోట్లో నీళ్లు ఊరుతున్నాయా? అలాగైతే గోదావరి జిల్లాల్లో పులస దొరికే సీజన్ ఇదే.

ఒక్క చేప రూ. 2 లక్షలు - పులస కూడా కాదండీ.. ఆయ్ ! - KACHIDI FISH COST 4 LAKH RUPEES

జాలర్ల గాలింపు : రుచిలో మేటిగా భావించే పులసంటే ఉభయ గోదావరి జిల్లాల వాసులకే కాదు, ఇతర ప్రాంతాల వారికీ సైతం అమితమైన ఇష్టం. గోదావరి జల్లాల్లో పులస చేపల ధరలు ఆకాశాన్ని తాకుతుంటాయి. ఈ సీజన్​లో రోజూ వేటకు వెళ్లే మత్స్యకారుడికి పులస చేప వలలో చిక్కితే పంట పడినట్లే. వేల రూపాయలు పలికే పులస కోసం జాలర్లు నిర్విరామంగా గాలిస్తుంటారు.

రుచి అమోఘం : మత్స్యకారులు ఏర్పాటు చేసే ప్రత్యేక వలలలో పులస చేపలు చిక్కుకుంటాయి. ఈ చేపల రుచి అమోఘంగా ఉండడంతో ధర కూడా భారీ స్థాయిలోనే ఉంటుంది. రెండు కిలోల బరువుండే చేప రూ.20వేలకు పైగా ధర పలికిందంటే ఈ చేపకు ఉన్న రేంజ్ అలాంటిది. ఈ పులస చేపను ఓ మాజీ సర్పంచి రూ.24 వేలకు కొనుగోలు చేశారు.

రూ.24 వేలకు కొనుగోలు : గోదావరికి వరదనీరు వచ్చిందంటే చాలు పులస చేపల సందడి మొదలవుతుంది. ఈ చేప ఎప్పుడొస్తుందా అని భోజన ప్రియులు ఆందులోనూ మాంసాహార ప్రియులు గుటకలేస్తుంటారు. ప్రస్తుతం గోదావరికి ఎర్రనీరు వస్తుండటంతో ఓ గంగపుత్రుడి పంట పండింది. పులస చేప వలకు చిక్కింది. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలోని వశిష్ట గోదావరిలో మలికిపురం మండలం రామరాజులంక మత్స్యకారుడి వలలో సుమారు కేజీన్నర బరువు ఉన్న పులస చేప చిక్కింది. ఈ చేపను మాజీ సర్పంచి బర్రే శ్రీను రూ.24 వేలు పెట్టి కొన్నారు.

Pulasa fishing: గోదావరికి వరద.. పులసల వేటకు వేళాయె!

Pulasa fish 2 కిలోల పులసకు వేలంపాట, ఎంతపలికిందో తెలుసా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.