Protest on Water Supply Bills: తాగునీటి సరఫరా బిల్లులు చెల్లించాలని మరోసారి అధికార పార్టీ శ్రేణులు రోడ్డెక్కాయి. నీటి బిల్లులు చెల్లించాలని పలుమార్లు విన్నవించుకున్నా ఎలాంటి ఫలితం లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ శ్రేణులు నీటి సరఫరా కార్యాలయానికి తాళాలు వేశారు. చిత్తూరు జిల్లాలోని కుప్పం, పలమనేరు నియోజకవర్గంలోని మండలాల్లో నీటిసరఫరా బిల్లులు అందించాలని వైఎస్సార్సీపీ శ్రేణులు కుప్పంలోని గ్రామీణ నీటి సరఫరా కార్యాలయానికి తాళాలు వేశారు. నాలుగున్నర సంవత్సరాల క్రితం ప్రభుత్వం తరఫున, ట్యాంకర్లతో ప్రజలకు తాగునీటిని సరఫరా చేసినట్లు వారు వివరించారు.
అధికారుల నిర్లక్ష్యంతో నిలిచిన తాగునీటి సరఫరా - స్థానికులతో కలిసి మేయర్ భర్త నిరసన
టాక్ట్రర్లను అద్దెకు తీసుకుని నీటిని సరఫరా చేసినట్లు పేర్కొన్నారు. ఇలా సరఫరా చేసిన బిల్లుల బకాయిలు దాదాపు 30 కోట్ల వరకు ఉన్నాయని అన్నారు. వీటిని చెల్లించాలని అధికారులు, పాలకులకు విన్నవించుకున్నా ఫలితం లేదని వాపోయారు. ఈ నేపథ్యంలోనే నిరసన చేపట్టినట్లు వివరించారు. నీటి సరఫరా కార్యాలయానికి తాళాలు వేయడమే కాకుండా అధికార వైఎస్సార్సీపీకి చెందిన ఎమ్మెల్సీ భరత్ నివాసాన్ని ముట్టడించారు. అనతంరం అక్కడ కూడా నిరసన చేపట్టారు.
ప్రజలకు తాగునీటిని సరఫరా చేపట్టిన తమకు ప్రభుత్వం నుంచి కోట్ల రూపాయలు రావాల్సి ఉందని కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యపై విజయవాడకు 7 సార్లు వెళ్లి వచ్చామని వివరించారు. ఇదిగో వస్తాయి, అదిగో వస్తాయంటూ కాలం గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తాగునీటి సరఫరా నిలిపివేసిన గుత్తేదారులు - సమ్మెకు దిగిన ట్యాంకర్ల యజమానులు
తమ సమస్యను మంత్రి పెద్దిరెడ్డి దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు వారు వివరించారు. అంతేకాకుండా అధికార పార్టిలోని ఇతర నాయకులు, అధికారులకు పలుమార్లు విన్నవించుకున్నామని తెలిపారు. అయినప్పటికీ బిల్లులు అందలేదని వాపోయారు. ప్రభుత్వాన్ని నమ్మి ట్యాంకర్లతో నీటిని సరఫరా చేసి అప్పుల పాలయ్యామని ఆవేదన వ్యక్తం చేశారు. తీసుకువచ్చిన అప్పులకు వడ్డీలు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి స్పందించి తమ బిల్లులు మంజూరు చేయాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.
"2019 నుంచి 2022 వరకు నీళ్లు సరఫరా చేశాం. మాకు నీళ్ల బిల్లులు రాలేదు. విజయవాడకు 7సార్లు వెళ్లి వచ్చాము. మంత్రిని కలిశాం, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీని కలిశాం. ఇదిగో పడుతుంది, ఆదిగో పండుతుంది అన్నారు. రోజులు, వారాలు గడువు విధిస్తూ గడుపుతున్నారు. దయచేసి ముఖ్యమంత్రి బిల్లులు చెల్లించాలని కోరుతున్నాం." - బిల్లుల బకాయిల బాధితులు
'విగ్రహాల మీద ఉన్న దృష్టి.. తాగునీటి సరఫరా మీద లేదు'
ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేశాం. ఆ బిల్లులు ప్రభుత్వానికి చేరుకున్నాయి. ముఖ్యమంత్రి మాపై దయ ఉంచి ఆదుకోవాలి - బిల్లుల బకాయిల బాధితులు
ఎన్నికల ప్రచారంలో వాలంటీర్లు- వైసీపీ నేతలకు స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు