ETV Bharat / state

'కాళేశ్వరంలో 2019 నుంచే సమస్యలు మొదలయ్యాయి'

కాఫర్ డ్యాం వరదలో మునిగిపోవడంతో బ్యారేజీ ఎత్తు పెంచామన్న విశ్రాంత ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు - డిజైన్ల తయారీలో ఆలస్యం, అదనపు పనులతో పెరిగిన ప్రాజెక్ట్ వ్యయం

KALESHWARAM COMMISSION
JUSTICE PC GHOSH IN HYDERABAD (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : 2 hours ago

Kaleshwaram Commission Investigation: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టల్లో 2019 నుంచే సమస్యలు ఉత్పన్నమయ్యాయని, వాటిపై నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి, ఈఎన్సీ జనరల్ సమావేశాలు కూడా నిర్వహించారని విశ్రాంత ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు విచారణలో భాగంగా కమిషన్​కు తెలిపారు. వరుసగా రెండో రోజు ఆయన కాళేశ్వరం కమిషన్ ముందు హాజరయ్యారు. మూడు ఆనకట్టలకు సంబంధించిన పలు అంశాలపై వెంకటేశ్వర్లును జస్టిస్ పీసీ ఘోష్ ప్రశ్నించారు.

మొదట కట్టిన కాఫర్ డ్యాం వరదలో మునిగిపోవడంతో ఎత్తు పెంచాల్సి వచ్చిందని వెంకటేశ్వర్లు తెలిపారు. డిజైన్ల తయారీలో ఆలస్యం జరిగిందని తెలిపారు. డిజైన్ల ఖరారులో ఆలస్యం, అదనపు పనులు, పనుల్లో మార్పుల వల్ల అంచనా వ్యయం పెరిగిందని కమిషన్​కు వివరించారు. మార్పులు, చేర్పులతో అంచనా వ్యయం అంత భారీగా పెరుగుతుందా అని కమిషన్ ప్రశ్నించింది. ఈ దశలో వెంకటేశ్వర్లుపై జస్టిస్ ఘోష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరానికి ముందు ప్రాణహిత - చేవెళ్ల కోసం రూ. 14వేల కోట్లకు పైగా విలువైన పనులు చేశారని, అందులో రూ. 750 కోట్ల విలువైన పనులు ఫలితం లేకుండా పోయాయని వెంకటేశ్వర్లు తెలిపారు.

పూర్తి సర్టిఫికెట్​ ఎలా ఇచ్చారు?: బ్యారేజీల సవరించిన అంచనా వ్యయాన్ని అప్పటి నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆమోదించారని చెప్పారు. మేడిగడ్డ విషయంలో సబ్ స్టాన్షియల్ సర్టిఫికెట్, మిగతా రెండు బ్యారేజీలకు పూర్తి సర్టిఫికెట్ ఇచ్చామన్నారు. స్థానిక అంశాలు, భూసేకరణ వల్లే బ్యారేజీల పనుల్లో ఆలస్యం అయినట్లు వివరించారు. పనులు ఆలస్యం అవుతున్నపుడు మౌఖిక ఆదేశాలు ఇచ్చామని, అత్యవసరం కాబట్టే డ్రాయింగ్స్ ఆలస్యమైనా పనులు చేయాలని చెప్పామని పేర్కొన్నారు.

కొవిడ్ సమయంలో ప్రభుత్వం నిబంధనలకు మినహాయింపు ఇవ్వడంతో బ్యాంకు గ్యారంటీల్లో సగానికి పైగా వెనక్కి ఇచ్చినట్లు వెంకటేశ్వర్లు తెలిపారు. అఫిడవిట్​లో ఇచ్చిన సమాచారానికి, చెప్తున్న సమాధానాలకు పొంతన లేదని కమిషన్ మరోమారు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎవరో చెబితే వారిని సంతృప్తి పరిచేందుకు పనులు చేశారని, వేరే వాళ్లు చేసిన తప్పులు మీ మీద వేసుకునే ప్రయత్నం చేయవద్దని కమిషన్​ వెంకటేశ్వర్లుకు సూచించింది. సాధారణం అంటూ సమాధానాలు ఇవ్వొద్దని మూడు బ్యారేజీలపై స్పష్టంగా సమాధానాలు ఇవ్వాలని ఘోష్​ కోరారు. కొన్ని ప్రశ్నలకు సమాధానాలు, వాటికి ఆధారాలను సోమవారం సమర్పిస్తానని వెంకటేశ్వర్లు తెలిపారు. అందుకు కమిషన్ అనుమతి ఇచ్చింది.

'కేసీఆర్ చెప్పిన విధంగానే 'కాళేశ్వరం' నిర్మాణం - ఆయన ఎలా చెబితే అలా చేశాం'

కాళేశ్వరం పేరుతో బీఆర్‌ఎస్‌ అవినీతి చేస్తే - కాంగ్రెస్‌ మూసీ పేరుతో చేస్తుంది : బండి సంజయ్ - Bandi Sanjay On Hydra Demolitions

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.