ETV Bharat / state

హైదరాబాద్​లో రియల్ ఎస్టేట్ డల్ అయిందా? - రాబోయే 6 నెలల్లో ఏం జరగబోతోంది? - REAL ESTATE PRICE HIKE IN HYDERABAD - REAL ESTATE PRICE HIKE IN HYDERABAD

Real Estate Boom in Hyderabad in Coming Six Months : హైదరాబాద్​లో రియల్​ రంగం పుంజుకోనుందా? పడిపోతుందా?. రియల్​ ఎస్టేట్​ రంగం భవిష్యత్​పై పలు సంస్థలు నిర్వహించిన సర్వేలు ఏం చాటుతున్నాయి? రియల్​ రంగంపై బిల్డర్లు ఏమంటున్నారో ఈ కథనంలో తెలుసుకుందాం.

AMEERPET MARKET IN HYDERABAD
Real Estate in Hyderabad (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 21, 2024, 11:40 AM IST

Real Estate in Hyderabad : రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం స్థానికతపైనే ఎక్కువగా ఆధారపడినా ఈ రంగంపై రాష్ట్ర, దేశ ఆర్థిక, రాజకీయ నిర్ణయాలు అంతిమ ప్రభావం చూపుతున్నాయి. అంతర్జాతీయ భౌగోళిక, ఇతర పరిణామాల ప్రభావం కూడా రియల్​ రంగంపై అధికంగా ఉంటోంది. ప్రభుత్వ వర్గాల్లో మార్పులు, రాజకీయ, బడ్జెట్‌ సంబంధిత నిర్ణయాలతో ఏర్పడిన అనిశ్చితి నేపథ్యంలో రియల్​ ఎస్టేట్​ రంగం పయనమెటు అనే సందేహం సర్వత్రా వ్యక్తమవుతోంది. మరింత జాగ్రత్తతో కూడిన విధానాన్ని మార్కెట్‌ ప్రతిబింబించినట్లు నైట్‌ ఫ్రాంక్, నరెడ్కో సెంటిమెంట్‌ సర్వేలు వెల్లడించాయి.

రియల్‌ ఎస్టేట్‌ ఇండెక్స్‌ స్కోరు : రియల్‌ ఎస్టేట్‌ రంగాన్ని జాతీయ స్థాయిలో పోల్చి చూస్తే ప్రస్తుత సెంటిమెంట్‌ ఇండెక్స్‌ స్కోరు, భవిష్యత్తు సెంటిమెంట్‌ స్కోరు ఒకేలా నమోదయ్యాయి. ఈ రెండు ఫలితాలు ఈ ఏడాది రెండో త్రైమాసికంలో 65గా నమోదయ్యాయి. ఈ స్కోరు వందకు చేరువగా ఉంటే రియల్​ రంగం చాలా సానుకూలంగా ఉన్నట్లు చెప్పుకోవచ్చు. స్కోరు తగ్గుతున్నా కొద్దీ సెంటిమెంట్‌ అంత బలంగా లేనట్లు భావించాల్సి ఉంటుందంటున్నారు ఆ రంగానికి చెందిన నిపుణులు.

మొదటి త్రైమాసికంలో 72గా ఉన్న స్కోరు రెండో త్రైమాసికంలో 65కి తగ్గిపోవడంపై ఆందోళన చెందాల్సిన పనిలేదని, మరింత జాగ్రత్తగా ఉంటూ ఆశావాదం వైపు మారడాన్ని సూచిస్తున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. 65 స్కోరూ సానుకూలమే, 50 ఉంటే తటస్థం, అంతకంటే ఎక్కువ ఉంటే సానుకూల భావాన్ని తెలియజేస్తుందని చెబుతున్నారు. ఇదిలా ఉంటే ప్రపంచ భౌగోళిక, రాజకీయ పరిణామాల నేపథ్యంలో కీలక సూచీలన్నీ ఆర్థిక వ్యవస్థ స్థిరత్వం, సానుకూతను వెల్లడిస్తున్నాయి. దీంతో ఇళ్లు, అపార్ట్​మెంట్లు, ఆఫీస్​ స్పేస్​ మార్కెట్‌లలో స్థిరమైన వృద్ధిని సర్వే అంచనా వేస్తోంది.

హైదరాబాద్​లో రియల్ ఎస్టేట్ పరుగులు - స్థిరాస్తి, ఐటీ రంగం మధ్య ఎలాంటి సమన్వయం అవసరం? - Real Estate in Hyderabad

రియల్​ రంగం అభివృద్ధిపై డెవలపర్లు సానుకూల ధోరణితో ఉన్నారు. డెవలపర్లు కాని భాగస్వాములైన బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, పీఈ ఫండ్స్‌ సంస్థల అభిప్రాయం కూడా అనుకూలమే. వీరిచ్చిన స్కోరు 68ని పరిశీలిస్తే ఇంకా ఎక్కువ విశ్వాసంతో ఉన్నారని తెలుస్తోంది. ఈ స్కోరు తొలి త్రైమాసికం 73తో పోలిస్తే తగ్గినప్పటికీ ఆశావహ ఫలితాలను చూపుతోంది.

వచ్చే ఆరునెలల్లో స్థిరాస్తుల ధరలు పెరుగుతాయని బిల్డర్ల అంచనా. అత్యధికంగా 63 శాతం మంది బిల్డర్లు స్థిరాస్తుల ధరలు పెరుగుతాయని అంచనా వేశారు. ధరలు నిలకడగానే ఉంటాయని 36 శాతం మంది చెబితే.. తగ్గుతాయని చెప్పింది కేవలం ఒక్కశాతమే. విక్రయాలు పెరుగుతాయని 51 శాతం మంది, కొత్త ప్రాజెక్టుల ప్రారంభాలు ఉంటాయని 61 శాతం మంది తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. 2019 ఎన్నికల తర్వాత సరిగ్గా ఇలాంటి పరిస్థితే ఉన్నదని గుర్తు చేస్తూ భవిష్యత్తుపై ఆశావహ దృక్పథాన్ని వెల్లడించారు.

రాజకీయ, ఆర్థిక పరిణామాల నేపథ్యంలో మార్కెట్‌ మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. స్వల్పకాలిక సవాళ్లు ఎదుర్కొని అభివృద్ధి చెందడానికి ఉన్న అన్ని అవకాశాలను మార్కెట్​ గమనిస్తోంది. బ్యాంకులు, ఆర్థిక సంస్థలతో సహా డెవలపర్లు, కీలక భాగస్వాములు సానుకూల దృక్పథాన్ని కొనసాగిస్తున్న నేపథ్యంలో భవిష్యత్తుపై బలమైన విశ్వాసంతో ఉన్నాం. - జి.హరిబాబు, జాతీయ అధ్యక్షుడు, నరెడ్కో

కార్యాలయాల విషయంలో : ఆఫీస్​ స్పేస్​ విభాగంలో లీజింగ్‌ అవకాశాలు పెరుగుతాయనే సానుకూలతను 63 శాతం బిల్డర్లు వ్యక్తం చేశారు. కొత్త కార్యాలయాల రాక పెరుగుతుందని 47 శాతం మంది, అద్దెల్లోనూ పెరుగుదల ఉంటుందని అత్యధికంగా 67 శాతం మంది అంచనా వేశారు. తగ్గుతాయనే వారు 7 శాతమే నమోదు కాగా, ఎలాంటి మార్పు ఉండబోదని 27 శాతం మంది తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

అనుమతుల పరంగా అసంతృప్తి : హైదరాబాద్‌ మార్కెట్‌లో రియల్​ రంగం అభివృద్ధికి సానుకూలత ఉన్నా కొత్త ప్రాజెక్టులకు అనుమతుల మంజూరులో జాప్యం జరుగుతోందని బిల్డర్లు కొంత అసంతృప్తిగా ఉన్నారు. వాస్తవానికి ప్రస్తుత పరిస్థితులు అర్థం చేసుకునేందుకు కొత్త సర్కారు అధికారంలోకి వచ్చిన కొన్నాళ్లు అనుమతులపై నిర్ణయం తీసుకోలేదు. ఆ తర్వాత అనుమతులు ఇస్తున్నామని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నా తాత్సారం జరుగుతోందని బిల్డర్లు పేర్కొంటున్నారు. కొత్త ప్రభుత్వం అనుమతుల పరంగా ఉన్న అనిశ్చితిని తొలగించాల్సిన బాధ్యత తీసుకోవాలని బిల్డర్లు పేర్కొన్నారు.

హైద‌రాబాద్​లో తగ్గిన ఇళ్ల విక్రయాలు.. కారణమిదే..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.