Sri Krishna Janmashtami Celebartions 2024 : కృష్ణం వందే జగద్గురుమ్. శ్రీకృష్ణుడు అంటే దేవుడు మాత్రమే కాదు ఓ మంచి స్నేహితుడు, అంతకు మించి మార్గనిర్దేశనం చేసే గురువు కూడా అని చెబుతారు. అనాది మనం వింటోన్న మాట ఇది. అయితే ఆ కృష్ణ పరమాత్ముడిని జగద్గురువు అని ఎందుకు పిలుస్తారో తెలుసా? మిగిలిన ఏ అవతారాల్లోనూ లేని రీతిలో రాముడు, కృష్ణుడి రూపాలను మాత్రమే పరిపూర్ణ అవతారాలు ఎందుకు చెబుతారు?
కర్మలను ఆచరించుటయందే నీకు అధికారం కలదు కానీ, వాటి ఫలితముపై లేదు అనే బోధను చాలామంది తప్పుగా అన్వయించుకుంటూంటారు. అసలు దాని అర్థం ఏంటి? శ్రీకృష్ణుడు కర్మలను ఎలా ఆచరించాలని చెప్పాడు? సింపుల్‌గా కనిపించే కనిపించే కృష్ణతత్వాన్ని తరచిచూస్తే వాళ్లకు అనంతం అని ఎందుకు అంటారు? ఒక మనిషిగా మం ఎలా జీవించాలో, ఎలా జీవించ కూడదో అని కృష్ణతత్వం ఏం చెబుతోంది? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.