ETV Bharat / state

56 మంది ఎస్​వోటీ సిబ్బందితో - సుమారు 1200 మంది ఫోన్లు ట్యాప్​ చేశాం : ప్రణీత్​రావు - Praneeth Rao Phone Tapping Case - PRANEETH RAO PHONE TAPPING CASE

Phone Tapping Case Update : 56 మంది ఎస్​వోటీ సిబ్బందితో సుమారు 1200 మంది ఫోన్లు ట్యాప్​ చేశామని డీఎస్పీ(సస్పెండెండ్​) ప్రణీత్​రావు వాంగ్మూలంలో తెలిపారు. ప్రధానంగా ప్రతిపక్ష నేతలపై నిఘా పెట్టామని వాంగ్మూలంలో ఆయన చెప్పారు. ఈ ఫోన్​ ట్యాపింగ్​ పర్యవేక్షణ కోసం 17 కంప్యూటర్లు వినియోగించినట్లు వాంగ్మూలంలో పేర్కొన్నారు.

Phone Tapping Case Update
Phone Tapping Case Update (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : May 29, 2024, 3:02 PM IST

Updated : May 29, 2024, 6:48 PM IST

Praneeth Rao Statement in Phone Tapping Case : ఫోన్​ ట్యాపింగ్​ కేసులో తవ్వే కొద్దీ కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. తాజాగా బహిర్గతమైన మాజీ డీఎస్పీ ప్రణీత్​రావు వాగ్మూలంలో పలు కీలక విషయాలు పోలీసులకు వివరించాడు. ఎస్​ఐబీకి 2019లో బదిలీ అయ్యానని తెలిపారు. అక్కడ ఇద్దరు ఇన్​స్పెక్టర్లు, ఇద్దరు ఎస్​ఐలు, ఇద్దరు ఏఎస్​ఐలు, ముగ్గురు కానిస్టేబుళ్లతో ప్రత్యేక టాస్క్​ఫోర్స్​ను తనకు అందించారని చెప్పారు.

ఎస్​ఐబీలో రోజువారీ కార్యకలాపాలు కాకుండా ఎవరికీ చెప్పని పనులు తనకు చెప్పేవారని ఆయన పేర్కొన్నారు. ఎస్​ఐబీ కార్యాలయంలో మొదటి అంతస్తులో ప్రభాకర్​రావు ఛాంబర్​ పక్కనే తనకు రెండు గదులు కేటాయించారన్నారు. ఇందులో ఎస్​ఐబీ ఎన్నడూ లేని విధంగా ప్రత్యేక టాస్క్​ఫోర్స్​ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రెండు లాగర్​ రూమ్​లో సుమారు 56 మంది సిబ్బందితో పని చేసినట్లు పోలీసులకు వాంగ్మూలంలో వెల్లడించారు.

సన్నిహితులకు పోస్టింగ్​లు : ఆ రెండు గదుల్లోని సిబ్బందికి 17 కంప్యూటర్లు, ప్రత్యేక సర్వర్లు ఏర్పాటు చేసినట్లు వాంగ్మూలంలో ప్రణీత్​రావు తెలిపారు. ముఖ్యంగా ప్రభాకర్​రావు రాజకీయ సంబంధమైన ప్రొఫైల్స్​ను క్రియేట్​ చేసే పనిని తమకు అప్పగించారన్నారు. బీఆర్​ఎస్​కు వ్యతిరేకంగా ఉన్న ప్రతిపక్ష పార్టీల నాయకుల ప్రొఫైల్స్​ క్రియేట్​ చేయమని చెప్పేవారని తెలిపారు. ఇందుకోసం స్నేహితుడు, సామాజిక వర్గానికి చెందిన ఇన్​స్పెక్టర్​ గుండు వెంకట్రావు, చిన్ననాటి స్నేహితుడు బాలే రవి కిరణ్​ను కూడా ప్రభాకర్​రావు సాయంతో ఇంటిలిజెన్స్​కు బదిలీ చేసుకున్నట్లు చెప్పారు. హెడ్​ కానిస్టేబుళ్లు రఫీ, యాదయ్య. కానిస్టేబుళ్లు హరీశ్​, సందీప్, మధుకర్ రావు ఉన్నారన్నారు.

ప్రత్యేక ఇంటర్నెట్​ కనెక్షన్​ తీసుకుని వాటి ద్వారా సుమారు 1000 నుంచి 1200 మంది ప్రొఫైల్​లను క్రియేట్​ చేశానని ప్రణీత్​రావు వెల్లడించారు. అధికారికంగా మూడు, వ్యక్తిగతంగా మరో ఐదు చరవాణులను ఉంచుకొని ప్రభాకర్​రావు చెప్పిన వారిని ట్రాక్​ చేసినట్లు చెప్పారు. 2022లో ప్రభాకర్​రావు పదవీకాలం ముగియగా తెలంగాణ ప్రభుత్వం అతనని జూన్​ 2023వరకు ఎస్​ఐబీ చీఫ్​గా మళ్లీ నియమించిందన్నారు. బీఆర్​ఎస్​కు వ్యతిరేకంగా ఉండే వారి ప్రొఫైల్​ను క్రియేట్​ చేసి వారిని ట్యాప్​ చేస్తూ మా బృందంతో కలిసి డబ్బులు సీజ్​ చేశామన్నారు.

ఎన్నికల కమిషన్​కు అనుమానం రాకుండా : అయితే ఎన్నికల కమిషన్​ నుంచి ఎటువంటి విమర్శలు రాకుండా వీటిని హవాలా డబ్బుగా రికార్డులో చూపించామని ప్రణీత్​రావు వివరించారు. భుజంగ రావు, రాధాకిషన్ రావు, తిరుపతన్నల కు సమాచారన్న అందించి కాంగ్రెస్ సహా ఇతర పార్టీల నేతలకు చెందిన డబ్బుపై ప్రధానంగా దృష్టి పెట్టినట్లు పేర్కొన్నాడు. ఇందుకు ఎంఎస్​ కన్వర్జెన్స్​ ఇన్నోవేషన్​ ల్యాబ్స్​ అందించిన సాఫ్ట్​వేర్​ వినియోగించినట్లు తెలిపారు. ఎవరినైతే టార్గెట్​ చేశామో వారి సీడీఆర్​, ఐపీడీఆర్​, లోకేషన్​ కోసం cat_usaer3idతో పాటు spsibintl-nodal@tspolice.gov.in ద్వారా రిక్వెస్ట్ పెట్టేవాళ్లమని తెలిపారు.

ఫోన్లు, పెన్​డ్రైవ్​లు బేగంపేట నాలాలో పడేశాం : అందుకే పాత వాటిని ధ్వంసం చేసి వాటి స్థానంలో కొత్త వాటిని అమర్చినట్లు వివరించారు. ధ్వంసం చేసిన వాటిని నాగోల్​, మూసారాంబాగ్​ వద్ద మూసీలో పడేసినట్లు వాంగ్మూమిచ్చారు. సీడీఆర్​, ఐడీపీఆర్​ డేటా మొత్తం కాల్చివేశామని చెప్పారు. ఫార్మేట్​ చేసిన ఫోన్లు, పెన్​డ్రైవ్​లను బేగంపేట నాలాలో పడేసినట్లు వాంగ్మూలంలో ప్రణీత్​రావు వెల్లడించారు.

జడ్జీలు, జర్నలిస్టుల ఫోన్లూ ట్యాపింగ్​ - పర్సనల్ డేటా సేకరించి అవసరమైనప్పుడు ప్రభావితం చేసేందుకు కుట్ర - JUDGES PHONE TAPPING IN TELANGANA

ప్రతిపక్ష నేతల డబ్బులపై ప్రత్యేక నిఘా - దాడుల కోసం తిరుపతన్న ప్రత్యేక టీమ్‌ - Tirupatanna ON PHONE TAPPING

Last Updated : May 29, 2024, 6:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.