Skill Training Center In Jagtial : ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా యువత స్వయం ఉపాధితో ఉచితంగా శిక్షణ పొందుతూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో ఐక్యూ మైండ్స్ 2017 లో శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించింది. ఈ శిక్షణ కేంద్రంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చి యువత వారికి నచ్చిన కోర్సులలో ప్రత్యేక శిక్షణ పొందుతున్నారు. ఇక్కడ నేర్చుకునే నైపుణ్యాల ద్వారా జీవితంలో రాణించగలుగుతామని వారు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
Self Employed Vocational Skill Training Center in Jagtial : మూడు నెలల పాటు ఉచితంగా శిక్షణ అందిస్తూ ఉపాధి పై ప్రత్యేక దృష్టి సారించి అండగా నిలుస్తున్నామని ఐక్యూ మైండ్ నిర్వాహకురాలు తెలిపారు. 18 ఏళ్ల నుంచి 45 ఏళ్ల లోపు వారికి కంప్యూటర్స్ , స్కిల్ డెవలప్మెంట్‌పై శిక్షణ ఇస్తున్నామన్నారు. కుట్టు, అల్లికలు, ఎంబ్రాయిడింగ్ తదితర వాటిని ప్రతి విద్యార్థికి నేర్పిస్తున్నట్లు పేర్కొన్నారు. పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన మహిళలు ఈ శిక్షణ పై ఎంతో ఆసక్తి పెంచుకుంటున్నారన్నారు. శిక్షణ పూర్తైన తర్వాత వీరికి ఉద్యోగాలకూ అవకాశం కల్పిస్తూ భరోసా కల్పిస్తున్నామని తెలిపారు.
600 జిల్లాల్లో పీఎం కౌశల్ వికాస్ యోజన మూడో విడత
"గత పది సంవత్సరాలుగా పీఎంకేవైసీ ద్వారా ఉచితంగా మూడు నెలల ఉచిత శిక్షణ ఇస్తున్నాము. ఇక్కడ పేదవారికి ఉచితంగా స్వయం ఉపాధి పనులు చేసుకునే విధంగా ప్రోత్సహిస్తాము. ఈ శిక్షణ ద్వారా మహిళలు సొంతంగా స్వయం ఉపాధి పొందుతున్నారు. ఇక్కడ కంప్యూటర్ కోర్సు, కుట్టు మిషన్, మగ్గం వర్క్స్‌పై శిక్షణ ఇస్తున్నాము. సొంతగా వ్యాపారం చేసుకోవడానికి బ్యాంక్ నుంచి లోన్లు మంజూరు అయ్యే విధంగా సహాయం చేస్తున్నాము." - బిస్మిల్లా యాస్మిన్, ఐక్యూ మైండ్స్ నిర్వాహకురాలు
"నేను పీజీడీసీఎ కోర్సు నేర్చుకుంటున్నాను. ఉద్యోగాలు లేక పేదవారు చాలా ఇబ్బందిపడుతున్నారు. సొంతంగా పని చేసుకోవడానికి ఈ సంస్థ వారు సహాయం చేస్తున్నారు. ఇక్కడ కంప్యూటర్స్ , స్కిల్ డెవలప్మెంట్‌పై శిక్షణ ఇస్తున్నామన్నారు. మూడు నెలల పాటు ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు' అంటూ ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన ఐక్యూ మైండ్స్ సంస్థకు, పీఎంకేవీవైకి విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు.
ఉద్యోగ నైపుణ్యాలున్న యువతలో తెలంగాణ టాప్ - నగరాల్లో పుణెకు తొలి స్థానం