ETV Bharat / state

మండే ఎండలకు కరెంట్ మీటర్​ గిర్రున తిరుగుతోందా - ఇలా చేస్తే 'బిల్లు' మన కంట్రోల్​లోనే! - Electricity Bill In aP - ELECTRICITY BILL IN AP

Power Usage Increased in Telugu States: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. దీంతో విద్యుత్ డిమాండ్ ఊహించని రీతిలో పెరిగిపోతోంది. వేడి నుంచి ఉపశమనం కోసం ఇళ్లలో, కార్యాలయాలు, దుకాణాల్లో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీల వాడకమూ విపరీతంగా పెరిగింది. అదే స్థాయిలో వినియోగదారుల విద్యుత్తు బిల్లులూ పెరిగాయి.

Power Usage Increased in Telugu States
Power Usage Increased in Telugu States (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 16, 2024, 1:46 PM IST

Power Usage Increased in Telugu States : తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకూ ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 10 గంటలు కాకముందు నుంచే ఎండలు విజృంభిస్తుండటంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. వినియోగదారుల కరెంట్‌ వాడకం కూడా అదే రీతిలో పెరిగింది. ఫిబ్రవరి, మార్చి వినియోగంతో పోలిస్తే ఏప్రిల్‌లో అసాధారణంగా వాడకం కనిపిస్తోంది. దీంతో అదే స్థాయిలో వినియోగదారుల విద్యుత్తు బిల్లులు పెరిగాయి. చేతికందిన బిల్లులు చూసి వినియోగదారుల గుండెలు గు'బిల్లు'మంటున్నాయి. వాడనైతే వాడాము కానీ ఇప్పుడు కడుతుంటే ఆ భారం తెలుస్తుందని అంటున్నారు.

కరెంట్ బిల్‌ భారీగా వస్తోందా ? అయితే ఈ టిప్స్‌ పాటించండి!

హైదరాబాద్​ నగరంలోని తొమ్మిది విద్యుత్తు సర్కిళ్ల పరిధిలో ఎల్‌టీ వినియోగదారులు 60 లక్షల వరకు ఉన్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో గరిష్ఠంగా 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ పరిస్థితి నుంచి ఉపశమనం కోసం ఇళ్లలో, కార్యాలయాలు, దుకాణాల్లో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు ఎక్కువగా వాడుతున్నారు. భూగర్భ జలాలు అడుగంటడంతో నీళ్ల కోసం మోటార్లు సైతం ఎక్కువ గంటలు పని చేశాయి. ఎండాకాలం కావడంతో నీటి వాడకమూ పెరిగింది. ఫలితంగా గరిష్ఠ విద్యుత్తు డిమాండ్‌ 4300 మెగావాట్లకు చేరింది. ఒకరోజు గరిష్ఠ వినియోగం 90 మిలియన్‌ యూనిట్లు నమోదైంది.

సహజంగానే వాడకం పెరగడంతో వినియోగదారుల బిల్లులు పెరగడానికి కారణమైంది. ఫిబ్రవరిలో ఎల్‌టీ వినియోగదారుల మొత్తం బిల్లులు రూ.687 కోట్ల వరకు ఉంటే మార్చిలో ఎండల కారణంగా అది కాస్త రూ.903 కోట్లకు పెరిగింది. ఏప్రిల్‌లో రూ.1017 కోట్ల వరకు చేరింది. సర్కిళ్ల వారీగా చూస్తే ఒక్క రాజేంద్రనగర్‌లో తప్ప, మిగతా అన్నిచోట్ల బిల్లులు భారీగా పెరిగాయి.

ఇలా చేస్తే కరెంట్​ బిల్లు మన కంట్రోల్​లోనే!

  • పగటి పూట సహజ వెలుతురు ఉండేలా చూసుకోవాలి.
  • రాత్రిళ్లు అవసరమైన మేర లైట్లు వేసుకోవాలి.
  • ఏసీని సైతం 24 డిగ్రీల వద్ద ఉండేలా చూసుకోవాలి.
  • వేసవిలో అధిక బిల్లులకు ఏసీ వాడకమే కారణం.
  • దీన్ని పొదుపుగా ఏ సమయంలో అవసరమో అప్పుడే వాడుకోవాలి.
  • విద్యుత్తు ఆదాతో వినియోగాన్ని 200 యూనిట్లలోపు పరిమితం చేసుకోగల్గితే కరెంట్‌ బిల్లు భారం కాదు.
  • నాణ్యమైన, బ్రాండెడ్‌ ఉపకరణాలు వాడితే కరెంటు తక్కువగా కాలుతుంది. నాసిరకం వాటితో ఎప్పటికైనా ప్రమాదమే.

ఇదేందయ్యా ఇదీ.. ఒక్క నెలకే రూ. 7 లక్షల కరెంట్ బిల్లు

Electricity Charges Huge Increase in YSRCP Government: మాట తప్పి.. మడమ తిప్పేసిన జగన్.. విద్యుత్‌ ఛార్జీలను ఎడాపెడా పెంచి ప్రజలకే షాకిచ్చిన వైసీపీ ప్రభుత్వం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.