ETV Bharat / state

డబ్బు కోసం కన్న కూతురినే అమ్మకానికి పెట్టిన తల్లి - స్ట్రింగ్ ఆపరేషన్​లో విస్తుపోయే నిజాలు - Parents who sold their daughter - PARENTS WHO SOLD THEIR DAUGHTER

Parents who sold their daughter For Money : తల్లి ప్రేమకు నోచుకోని దయనీయ స్థితి ఆ ముక్కుపచ్చలారని శిశువుది. తల్లి కడుపులో నవమాసాలు పెరిగిన ఆ పసికందు ఆడబిడ్డగా పుట్టడమే ఆమె చేసిన పాపం. ఆ పసిబిడ్డ ఆలనా పాలనా చూసుకోవాల్సిన తల్లిదండ్రులే ఆ చిన్నారి పుట్టడం భారంగా భావించారు. పోషించే స్థోమత లేక ఆ ఆడ శిశువును అమ్మకానికి పెట్టారు. ఈ అమానవీయ ఘటన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో జరిగింది.

Parents who sold their daughter For Money
Parents who sold their daughter For Money (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : May 22, 2024, 5:33 PM IST

Parents who Sold Their Daughter For Money : అమ్మ ప్రేమను అందుకోలేని దీనస్థితి, తండ్రి లాలనకు నోచుకోని దుస్థితి ఆ చిన్నారిది. తల్లిదండ్రుల సంరక్షణలో హాయిగా ఎదగాల్సిన ఆ పసిపాపను కన్న వాళ్లే అంగడిలో బొమ్మలా వేరేవారికి అమ్మకానికి పెట్టారు. ఆడపిల్ల జన్మించడంతో భారంగా ఆ తల్లితండ్రులు భావించారు. పిల్లల కోసం పరితపించి పోయే తల్లిదండ్రులను చూశాం. సంతానం కోసం కొందరు దేవుళ్లకు మొక్కులు, నోములు చేయడం చూశాం. కానీ మేడ్చల్ జిల్లాలో మాత్రం కంటికి రెప్పలా కాపాడాల్సిన ఆ తల్లిదండ్రులు పోషించే స్థోమత లేక ఆడ శిశువు అమ్మకానికి పెట్టారు. ఈ అమానవీయ ఘటనను ఓ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు స్ట్రింగ్ ఆపరేషన్ నిర్వహించి వెలుగులోకి తెచ్చారు అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

పరువు పోతుందని బిడ్డను అమ్ముకుంది..

ఇదీ జరిగింది : అక్షరజ్యోతి ఫౌండేషన్‌కు చెందిన మహిళలు తమకు ఆడపిల్ల కావాలని స్ట్రింగ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ క్రమంలోనే వీరు పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి రామకృష్ణనగర్‌లోని శోభారాణి ఫస్ట్ ఎయిడ్ సెంటర్‌లో ఆర్ఎంపీ వైద్యురాలు శోభారాణిని సంప్రదించారు. 3నెలల ఆడ శిశువును రూ.4.50 లక్షలకు ఇప్పిస్తానని ఒప్పందం ఆమె ఒప్పందం చేసుకుంది. అందులో భాగంగా ముందుగా రూ.10 వేలు అడ్వాన్స్‌గా తీసుకుంది.

ముందుగా ఒప్పందం చేసుకున్న ప్రకారం పాపకోసం అక్షరజ్యోతి ఫౌండేషన్ సభ్యులు క్లినిక్‌కు రాగా ఓ మహిళ అక్కడకు వచ్చి ఓ పాపను అప్పగించింది. దీంతో అక్షరజ్యోతి స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు ఈ వ్యవహారంపై పోలీసులకు సమాచారం అందించారు. ఫౌండేషన్ ప్రతినిధులిచ్చిన సమాచారంపై రంగంలోకి దిగిన పోలీసులు అనుమానితులను పోలీస్ స్టేషన్​కు తరలించి దర్యాప్తు చేపట్టారు. బిడ్డను పోషించడం కష్టంగా ఉందని ఆ పసికందు తల్లి చెప్పడంతో పిల్లలు లేనివారికి అమ్మినట్లుగా దర్యాప్తులో శోభారాణి అంగీకరించింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ముక్కు పచ్చలారని పసికందును అల్లారు ముద్దుగా పెంచుకోవాల్సింది పోయి డబ్బులకోసం కన్న కుమార్తెనే అమ్ముకోవడం అమ్మతనానికే మాయని మచ్చగా మిలిగింది. దీంతో ఒక్కసారిగా సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

డబ్బు కోసం చిన్నారిని అమ్మిన తండ్రి అరెస్టు!

బిడ్డను అమ్మిన ఐదు నెలలకు వెలుగులోకి...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.