Ponnam Prabhakar Traveled by RTC Bus : రాష్ట్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) ఆదివారం ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. పాలమూరు జిల్లాలో గౌడ సంఘ సమావేశానికి వెళ్తున్న సందర్భంగా ఆయన హైదరాబాద్ నుంచి షాద్‌నగర్ వరకు ఆర్టీసీలో ప్రయాణించారు. నారాయణపేట డిపోనకు చెందిన బస్సులో ఆయన ప్రయాణం చేస్తూ మహిళలు, ప్రయాణికులతో మాట్లాడారు. ఆయన కూర్చోకుండా, నిల్చునే ప్రయాణికులతో ఉచిత ప్రయాణం గురించి అడిగి తెలుసుకున్నారు. ఉచిత బస్సు ప్రయాణం ఎలా ఉందని వాకబు చేశారు. దీని పట్ల మహిళా ప్రయాణికులు ఎంతో సంతోషం వ్యక్తం చేయడంతో ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఘనత అని మంత్రి చెప్పారు.
హుస్నాబాద్ అభివృద్ధిపై మాట్లాడితే - నా తల్లినే అవమానిస్తారా? : మంత్రి పొన్నం
Minister Ponnam Prabhakar : షాద్‌నగర్ శివారు రాయికల్ గ్రామం వద్ద గల హోటల్ 44 దాబా వద్ద ఆయన బస్సు దిగారు. ఆ తర్వాత ఆయనకు స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి తదితరులు స్వాగతం పలికారు. బస్సు ప్రయాణం పట్ల మంత్రి సహచర మిత్రులతో తన అనుభవాలను పంచుకున్నారు. ఆయన బస్సు ప్రయాణాన్ని పలువురు నాయకులు ప్రశంసించారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
బండి సంజయ్ రాజకీయ డ్రామాలకు తెరలెేపుతున్నారు - బీజేపీ హైకమాండ్ ఆలోచించాలి : మంత్రి పొన్నం
Ponnam Comments On KCR : కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన 90 రోజుల్లోనే హామీ ఇచ్చిన 6 గ్యారంటీల్లో చాలా వరకు ప్రజలకు అత్యవసరమయ్యే గ్యారంటీలను అమలు చేశామని, మిగతా గ్యారంటీలను అతి త్వరలోనే అమలు చేస్తామని తెలిపారు. ఈ క్రమంలోనే బీజేపీని వ్యతిరేకించే వారిపై ఈడీ కేసులతో భయపెడుతున్న కేంద్రానికి కేసీఆర్ అవినీతిపై విచారణ చేసే దమ్ము లేదన్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్ రెండు ఒక్కటే అన్న మంత్రి, అందుకే కేసీఆర్ డైరెక్షన్‌లోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండిని మార్చి కిషన్ రెడ్డికి ఆ పదవి అప్పగించారని ఆరోపించారు.
కేంద్రం తెలంగాణకు ఏం చేసిందో చెప్పిన తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో (Parliament Elections) ఓట్లు అడగాలని మంత్రి పొన్నం సవాల్ చేశారు. కేసీఆర్ కుటుంబం, బీఆర్‌ఎస్ నాయకులు 2004లో ఉన్న ఆస్తులు ఎన్ని, 2024లో ఉన్న ఆస్తులెన్ని లెక్క చెప్పాలని డిమాండ్ చేశారు. నల్గొండ జిల్లా సభలో కేసీఆర్ మాట్లాడుతూ మేడిగడ్డ బొందల గడ్డ అన్నారని, మమ్మల్ని ఎందుకు వెళ్లారని ప్రశ్నించిన ఆయన, ఇప్పుడు బీఆర్‌ఎస్ నాయకులు ఎందుకు వెళ్లారో చెప్పాలన్నారు. ఒకప్పుడు మానస పుత్రిక అన్న ప్రాజెక్ట్, ఇప్పుడు బొందలగడ్డ ఎలా అయ్యిందని మంత్రి మండిపడ్డారు.
కరీంనగర్ పరిధిలో ఏం అభివృద్ధి చేశారో బండి సంజయ్ చెప్పాలి : పొన్నం ప్రభాకర్
పొన్నం ప్రభాకర్‌పై బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలు - ప్రజాహిత యాత్రలో టెన్షన్, టెన్షన్