ETV Bharat / state

ఎన్నికల నేపథ్యంలో పోలీసుల ముమ్మర తనిఖీలు - ఏలూరు జిల్లాలో భారీగా బంగారం, వెండి పట్టివేత - Police Seized Huge Gold - POLICE SEIZED HUGE GOLD

Police Seized Huge Gold and Silver Jewelery in Eluru District: భారీగా బంగారం, వెండి ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్న ఏలూరు జిల్లాలో జరిగింది. ఎన్నికల నేపథ్యంలో కలపర్రు టోల్‌గేట్‌ వద్ద అధికారులు తనిఖీలు నిర్వహించారు. సరైన పత్రాలు లేకుండా అభరణాలు తరలిస్తున్న వాహనాన్ని పోలీసులు పట్టుకున్నారు. పోలీసులతో కలసి పరిశీలించిన ఏలూరు జిల్లా సంయుక్త కలెక్టర్‌ లావణ్యవేణి వాహనాన్ని సీజ్‌ చేశారు.

police_seized_gold
police_seized_gold
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 8, 2024, 7:46 PM IST

Updated : Apr 8, 2024, 8:43 PM IST

Police Seized Huge Gold and Silver Jewelery in Eluru District: భారీగా బంగారం, వెండి ఆభరణాలతో వెళ్తున్న ఓ వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ అధికారులు, పోలీసులు ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో సరైన పత్రాలు లేకుండా బంగారం, వెండిని తరలిస్తున్న వాహనాన్ని పోలీసులు పట్టుకున్నారు. పోలీసులతో కలసి పరిశీలించిన సంయుక్త కలెక్టర్‌ సీజ్‌ చేశారు. ఈ ఘటన ఏలూరు జిల్లాలో చోటు చేసుకుంది.

ఏం ఐడియా సామీ - ప్లాస్టర్ సాయంతో గంజాయి దేహానికి అతికించుకుని - Police Seized 22 kilos Ganja

పూర్తి వివరాల్లోకి వెళ్తే సరైన పత్రాలు లేకుండా 16 కేజీల బంగారం, 31 కేజీల వెండి ఆభరణాలు తరలిస్తున్న వాహనాన్ని ఏలూరు జిల్లా పెదపాడు మండలం కలపర్రు టోల్ గేట్ (KalaParru Tollgate) వద్ద పోలీసులు పట్టుకున్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో వాహన తనిఖీల్లో భాగంగా పోలీసులు చేపట్టిన తనిఖీల్లో విజయవాడ నుంచి భీమవరం, నరసాపురం, అమలాపురం సహా పలు ప్రాంతాల్లోని దుకాణాలకు బంగారు, వెండి ఆభరణాలను తరలిస్తున్న వాహనాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

పోలీసులతో కలిసి వాహనాన్ని పరిశీలించిన ఏలూరు జిల్లా సంయుక్త కలెక్టర్ లావణ్యవేణి వాహనాన్ని (Eluru District Joint Collector Lavanyaveni) సీజ్ చేశారు. ఎన్నికల కోడ్ (Election Code in AP) అమల్లో భాగంగా ఈసీ ఆదేశాల మేరకు తనిఖీలు చేపట్టామని సరైన పత్రాలు చూపించిన తర్వాత వాహనాన్ని వదిలేస్తామని సంయుక్త కలెక్టర్ వెల్లడించారు. పరిమితికి మించి నగదు, బంగారు, వెండి లాంటి ఆభరణాలు తరలించాలంటే ఈసీ అనుమతి కావాలని జేసీ తెలిపారు. మరో వాహనంలో సరైన ఆధారాలు లేకుండా తరలిస్తున్న 15 లక్షల నగదును అధికారులు సీజ్ చేశారు.

పుష్ప సినిమా తరహాలో మద్యం తరలింపు -వీడి తెలివి చూసి సుకుమార్‌ మరో సినిమా తీయోచ్చు ! - SEB police seized Karnataka liquor

వాహనాలను తనిఖీ చేస్తున్న సమయంలో ఒక వాహనంలో ఉన్న 15 లక్షల నగదును సీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి సరైన పత్రాలు ఏమీ చూపించలేదు. అలాగే ఇంకో వాహనాన్ని సీజ్ చేయడం జరిగింది. అందులో బంగారం, వెండి ఉన్నట్లు గుర్తించాం. బంగారం 16 కేజీలు, వెండి 31 కేజీలు ఉన్నాయి. వీటన్నింటినీ వివిధ ప్రాంతాల జ్యూయలరీ దుకాణాలకు తీసుకువెళ్తున్నామని చెప్తున్నారు. కానీ దీనికి సంబంధించి ఎటువంటి పత్రాలు చూపించలేదు. అందువల్ల వీటన్నింటినీ సీజ్ చేయడం జరిగింది.- లావణ్యవేణి, ఏలూరు జేసీ

పవన్‌ని ఓడించేందుకు భారీగా నగదు బదిలీ చేస్తున్నారు: టీడీపీ నేత వర్మ - YCP Election Materials

Heavy Liquor Seized in YCP Leader House: అల్లూరి జిల్లా ముంచింగిపుట్టు మండలం జోలాపుట్లో వైసీపీ నాయకుడి అనుచరుడి ఇంట్లో భారీగా మద్యం పట్టుకున్నారు. ఎన్నికల కోసం ముందస్తుగా ఆంధ్రా ఒడిశా సరిహద్దులో మద్యం నిల్వ ఉంచారన్న సమాచారంతో పోలీసులు దాడులు చేశారు. వైసీపీ నాయకుడి ఇంట్లో భద్రపరిచిన 120 మద్యం బాక్సులను స్వాధీనం చేసుకున్నారు.

Last Updated : Apr 8, 2024, 8:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.