ETV Bharat / state

వివాదాల సుడిగుండంలో హైదరాబాద్ సీసీఎస్ - అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? - HYDERABAD CCS CONTROVERSIES

Hyderabad CCS Controversies : హైదరాబాద్‌ సెంట్రల్ క్రైమ్ స్టేషన్‌ (సీసీఎస్) తరచూ వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. ఎన్నో కేసులను చేధించిన సీసీఎస్‌లో ఇప్పుడు తరచూ అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో అధికారులు అప్రత్తమై ఆరోపణలకు గురైన పోలీసు సిబ్బందిపై అంతర్గత విచారణ చేపట్టినట్లు సమాచారం.

Higher officials focus on Hyderabad CCS
Higher officials focus on Hyderabad CCS (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : May 27, 2024, 9:36 AM IST

Corruption Allegations Against Hyderabad CCS Officers : ఎన్నో సంచలన కేసులను ఛేదించిన హైదరాబాద్‌ సీసీఎస్‌ వివాదాలకు కేంద్రంగా మారింది. ఇక్కడ పనిచేస్తున్న కొందరు పోలీసు అధికారులపై అవినీతి ఆరోపణలు రావడం చర్చనీయాంశంగా మారాయి. ప్రతిష్ఠ దెబ్బతినకముందే దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. సీసీఎస్‌ను పూర్తి స్థాయి ప్రక్షాళన చేసేందుకు సిద్ధమయ్యారు.

Hyderabad CCS Controversies : మరోవైపు ప్రీ లాంచింగ్‌ ముసుగులో పలు రియల్‌ సంస్థలు పేద, మధ్యతరగతి కుటుంబాల నుంచి రూ.వేల కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేశాయి. వాటిలో సాహితీ ఇన్‌ఫ్రా సాగించిన మోసాల చిట్టాలో వేలాది మంది బాధితులున్నారు. నాలుగు సంవత్సరాల కిందట మొదలైన సాహితీ మోసాలపై 2022లో హైదరాబాద్‌ సీసీఎస్‌లో కేసు నమోదైంది. ఈ వ్యవధిలో నగరంలో ముగ్గురు పోలీసు కమిషనర్లు మారారు. సీసీఎస్‌లో ముగ్గురు డీసీపీలు బదిలీ అయ్యారు. అయితే బాధ్యతలు చేపట్టిన ప్రతి సీపీ, డీసీపీ సాహితీ కేసు పురోగతిని సమీక్షించారు. వీలైనంత త్వరితగతిన బాధితులకు న్యాయం చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలిచ్చారు.

ఉమామహేశ్వరరావును మార్చాలని సిఫార్సు : అయితే ఈ కేసులో దర్యాప్తు అధికారిగా వ్యవహరించిన ఏసీపీ ఉమామహేశ్వరరావు మాత్రం ఏకపక్షంగా వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఆయన నివాసంలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఆదాయాన్ని మించి ఆస్తులున్నట్టు గుర్తించి అరెస్టు చేశారు. అంత కీలకమైన కేసులో ఏసీపీ ఉమామహేశ్వరరావు వెనుక ఉన్న పోలీసు అధికారులు ఎవరనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇందులో పురోగతి లేదని గుర్తించిన ఒకరు దర్యాప్తు అధికారి, ఉమామహేశ్వరరావును మార్చాలని సిఫార్సు చేశారు.

Sahiti Infra case Updates : మరోవైపు సాహితీ కేసులో స్వాధీనం చేసుకున్న నగదు కోసం ప్రత్యేకంగా బ్యాంకు ఖాతా తెరవాలంటూ వచ్చిన ప్రతిపాదనను సీసీఎస్‌ సమీక్ష సమావేశంలో పోలీసు ఉన్నతాధికారి ఒకరు నిర్ధారించారు. దర్యాప్తులో భాగంగా తీసుకున్న నిర్ణయంలా పైకి కనిపించినా, దీని వెనుక దాగిన అంతరార్థం గుర్తించి, ఆ ప్రతిపాదన అమలు చేయకుండా ఆదేశాలు ఇచ్చారు.

ఇదే తరహాలో ఇద్దరు ఏసీపీలు, ఇద్దరు సీఐలు ఆర్ధిక నేరగాళ్లను కాపాడేందుకు చేసిన చీకటి వ్యవహారాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. కేటుగాళ్ల బారినపడి రూ.కోట్లు నష్టపోయిన బాధితులు ఒక్కొక్కరుగా ఉన్నతాధికారులను ఆశ్రయిస్తున్నారు. కేసుల నమోదు, దర్యాప్తు సమయంలో తమను వేధింపులకు గురిచేసిన వారిపై ఫిర్యాదులు చేస్తున్నారు. దీంతో అప్రమత్తమైన ఉన్నతాధికారులు అంతర్గత విచారణకు ఆదేశించినట్టు తెలుస్తోంది. అక్కడినుంచి వచ్చిన నివేదిక ఆధారంగా సీసీఎస్‌లో ఏసీపీ స్థాయి నుంచి కానిస్టేబుల్‌ వరకూ బదిలీలు తప్పవని సమాచారం.

సీసీఎస్ ఎదుట సాహితీ ఇన్​ఫ్రా బాధితుల ధర్నా - లక్ష్మీనారాయణను అరెస్ట్​ చేయాలని డిమాండ్ - Sahiti Infra Victims Protest At CCS

ఏసీపీ ఉమామహేశ్వరరావు ఆస్తుల చిట్టా - ల్యాప్​టాప్​లో కీలక సమాచారం! - ACP UMA MAHESHWAR RAO ASSETS

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.