Gun Firing At Nampally Today: తెలంగాణలోని హైదరాబాద్లో మరోసారి కాల్పుల కలకలం రేగింది. నాంపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో గురువారం అర్ధరాత్రి పోలీసులు కాల్పులు జరిపారు. అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తులను పోలీసులు ప్రశ్నించారు. ఈ క్రమంలోనే దుండగులు పోలీసులపై గొడ్డలితో దాడికి యత్నించారు. అనంతరం పరారవుతుండగా పోలీసులు వారిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒకరికి తీవ్ర గాయాలు కాగా అతడిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వారంతా దోపిడి దొంగలుగా అనుమానిస్తున్నారు.
నగరంలో గత కొన్ని రోజులుగా రాత్రి వేళల్లో పోలీసులు వాహన తనిఖీలతో పాటు గస్తీని పెంచిన విషయం తెలిసిందే. పటిష్ఠ నిఘా ఉంచిన అధికారులు కాస్త అనుమానాస్పదంగా ఎవరైనా కనిపించినా వారిని ఆపి ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలోనే నాంపల్లి రైల్వే స్టేషన్ వద్ద అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తులను ప్రశ్నిస్తుండగా వారు పోలీసులపై దాడికి యత్నించి పరారయ్యేందుకు ప్రయత్నించారు.
అమెరికాలో దుండగుడి కాల్పులు - బాపట్ల యువకుడి మృతి - AP Youth Killed Firing in America
ఇదీ జరిగింది : నాంపల్లి పోలీసులు, యాంటీ డెకాయిట్ టీమ్ సంయుక్తంగా హైదరాబాద్ సీపీ ఆదేశాల మేరకు తనిఖీలు చేపట్టారు. రాత్రి సమయంలో ప్రయాణీకులు నిద్రించినపుడు వారిపై దాడి చేసి నగదు, సెల్‌ఫోన్లు, బంగారు ఆభరణాలు దోచుకుంటున్నట్లు సమాచారంతో అర్ధరాత్రి సమయంలో పోలీసులు రైల్వే స్టేషన్ వద్ద తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు ప్రశ్నించారు. ఆ సమయంలో వారు పోలీసులపై గొడ్డలితో దాడి చేసి పారిపోవాలని యత్నించడంతో ఆత్మ రక్షణ కోసం పోలీసులు కాల్పులు జరిపారు. దీంతో ఓ వ్యక్తికి గాయాలు కావడంతో ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మరో వ్యక్తిని నాంపల్లి పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
రోజుకో మర్డర్ - పూటకో దోపిడీ - ఈ భాగ్యనగరానికి ఏమైంది? - Crime Rate Increasing in Hyderabad