ETV Bharat / state

'వస్తారు - కొట్టేస్తారు - మహారాష్ట్రకు వెళ్లిపోతారు' - ఇదీ పార్థీ గ్యాంగ్​ స్టైల్ : నల్గొండ ఎస్పీ - Nalgonda sp On Pardhi gang Arrest - NALGONDA SP ON PARDHI GANG ARREST

Maharashtra Pardhin Gang Arrested in Hyderabad : గత కొంతకాలంగా జాతీయ రహదారులపై చోరీలకు పాల్పడుతున్న పార్థి గ్యాంగ్​ను ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్నారు. వారి వివరాలను నల్గొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ వెల్లడించారు.

Pardhi Gang Arrested In Hyderabad
Pardhi Gang Arrested In Hyderabad (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jul 6, 2024, 1:24 PM IST

Pardhi Gang Arrested In Hyderabad : హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై చోరీలకు పాల్పడుతున్న పార్థీ ముఠాను శుక్రవారం నల్గొండ సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వివరాలను నల్గొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ వివరించారు. నల్గొండ, సైబరాబాద్, రాచకొండ, సంగారెడ్డి జిల్లాలో జాతీయ రహదారిలపై ఆగిన వాహనాలను లక్ష్యంగా చేసుకుని చోరీలకు, హత్యలకు పాల్పడ్డట్టు వివరించారు. నిందితుల నుంచి రూ.17 వేలు, స్క్రూ డ్రైవర్, రెండు కత్తెరలు, వెండి పట్టీలు, ఒక టార్చ్ లైట్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వీరిపై రాష్ట్రవ్యాప్తంగా 32 కేసులు ఉన్నాయని చెప్పారు. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు.

"మేము చేసిన విచారణ ప్రకారం నిందితులు మొత్తం నలుగురు. అందులో ఇద్దరిని పట్టుకున్నాం. వీళ్ల దగ్గర నుంచి స్క్రూ డ్రైవర్, కత్తెర, రూ.17 వేలు, పట్టీలు స్వాధీనం చేసుకున్నాం. శుక్రవారం మేము వీరిని పట్టుకునే ముందు రోజు రాత్రి చౌటుప్పల్​లో చోరీ చేశారు. బాధితుల నుంచి పట్టీలు దొంగిలించారు. అక్కడి నుంచి సిటీ వైపు వెళ్తుంటే మేము పట్టుకోవడం జరిగింది. వీళ్లు అడిగింది ఇచ్చేస్తే, ఏమీ అనకుండా తీసుకుని రెండు మూడు దెబ్బలు కొట్టి పోతారు. లేదు అని వారితో వాదిస్తే చంపేస్తారు. ఇటీవల డ్రైవర్​ను అలాగే హత్య చేశారు." - శరత్ చంద్ర పవార్, నల్గొండ ఎస్పీ

రిచ్ కిడ్స్ లక్ష్యంగా 'ఓజీ డ్రగ్‌' గ్యాంగ్ దందా - సమాచారం ఇస్తే రూ.2లక్షల రివార్డ్ - Reward on Drugs Information in Hyd

కట్టంగుర్ పీఎస్ పరిధిలో మే నెలలో డబ్బుల కోసం లారీ డ్రైవర్​ను హత్య చేసినట్లు వెల్లడించారు. కాగా శుక్రవారం వీరిని పట్టుకునే క్రమంలో పోలీస్ సిబ్బందిపై దాడులకు పాల్పడ్డారని, ఆత్మరక్షణ కోసం పోలీసులు గాల్లోకి రెండు రౌండ్లు కాల్పులు జరిపినట్లు వివరించారు. డబ్బుల కోసం ఈ గ్యాంగ్ ఎంతకైనా తెగిస్తారని చెప్పారు. మహారాష్ట్రకు చెందిన ఈ పార్థీ గ్యాంగ్ టార్గెట్ ఫినిష్ చేసే క్రమంలో ఎక్కడా షెల్టర్ తీసుకోరని తెలిపారు. దొంగిలించిన అభరణాలను మహారాష్ట్రలో విక్రయిస్తుంటారని చెప్పారు. మిగిలిన వారిని త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు.

నేపాలీ దొంగల ముఠా - నమ్మారో ఇల్లు గుల్ల! - Nepali thieves

గోల్డ్ స్కామ్‌ను బట్టబయలు చేసిన రాచకొండ పోలీసులు - నలుగురు సభ్యుల ముఠా అరెస్ట్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.