ETV Bharat / state

అక్రమ మైనింగ్ కేసు - మధుసూదన్​ రెడ్డిని కస్టడీలోకి తీసుకున్న పోలీసులు - Madhusudhan Reddy in Police Custody - MADHUSUDHAN REDDY IN POLICE CUSTODY

Police Custody For Gudem Madhusudhan Reddy : అక్రమ మైనింగ్​ కేసులో అరెస్టైన మధుసూదన్​ రెడ్డిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. 3 రోజుల పాటు ఆయనను విచారించనున్నారు.

Madhusudhan Reddy
3 Days Police Custody for Madhusudhan Reddy
author img

By ETV Bharat Telangana Team

Published : Mar 21, 2024, 2:14 PM IST

Police Custody For Gudem Madhusudhan Reddy : అక్రమ మైనింగ్ కేసులో అరెస్టైన సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సోదరుడు మధుసూదన్ రెడ్డిని పోలీసులు 3 రోజుల కస్టడీకి తీసుకున్నారు. పటాన్​చెరు మండలం లక్డారం గ్రామ పరిధిలో మధుసూదన్‌ రెడ్డి సంతోశ్​ శాండ్ అండ్ గ్రానైట్ క్వారీని నడుపుతున్నారు. పరిమితికి మించడంతో పాటు గడువు ముగిసినా క్వారీ నిర్వహణ జరుగుతున్నందున ఈ నెల 15న పటాన్​చెరు పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. మధుసూదన్ రెడ్డిని కోర్టులో ప్రవేశపెట్టగా, 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. ఈ క్రమంలో పోలీసులు కస్టడీ పిటిషన్ వేయగా, న్యాయస్థానం 3 రోజులకు అనుమతించింది. దీంతో నేడు మధుసూదన్ రెడ్డిని కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు.

ఎమ్మార్వో ఫిర్యాదుతో అరెస్ట్ : లక్డారం గ్రామంలో మధుసూదన్‌ రెడ్డి సంతోశ్​ గ్రానైట్‌ మైనింగ్ పేరుతో క్రషర్‌ కంపెనీలు నిర్వహిస్తున్నారు. అయితే కేంద్ర పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించి, పరిమితికి మించి తవ్వకాలు జరిపారని, దాంతోపాటు అనుమతుల గడువు పూర్తయినా మైనింగ్ చేశారనే ఆరోపణల నేపథ్యంలో అధికారులు ఇటీవల ఆ క్వారీని సీజ్​ చేశారు. అనంతరం తహసీల్దార్​కు సమాచారం ఇవ్వగా, ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఈ నెల 15న మధుసూదన్‌ రెడ్డిపై అక్రమ మైనింగ్‌, చీటింగ్‌ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు, తెల్లవారుజామున ఆయనను అరెస్టు చేశారు.

అక్రమ మైనింగ్ కేసు - పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి సోదరుడు అరెస్ట్

హస్తం బెదిరింపులకు భయపడం : మధుసూదన్​ రెడ్డి అరెస్ట్​పై గతంలో స్పందించిన ఎమ్మెల్యే మహిపాల్​రెడ్డి, కాంగ్రెస్​ హయాంలోనే సంతోశ్​ గ్రానైట్ మైనింగ్​ క్వారీకి అనుమతులు ఇచ్చారని పేర్కొన్నారు. అన్ని అనుమతులతోనే క్రషర్లు నిర్వహిస్తున్నామని చెప్పారు ఏదైనా తప్పు చేస్తే నోటీసులు ఇవ్వాలి లేదా పెనాల్టీ వేయాలి కానీ తెల్లవారుజామున అరెస్టు చేయడం చట్ట విరుద్ధమని మండిపడ్డారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌ ఇబ్బంది పెడుతుందని ఆరోపించిన మహిపాల్​ రెడ్డి, హస్తం పార్టీ బెదిరింపులకు భయపడేది లేదని స్పష్టం చేశారు.

మంత్రి ఆదేశాలతోనే అరెస్ట్ : బీఆర్​ఎస్​ నేతలను కాంగ్రెస్​ పార్టీలో చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారని, ఆ పార్టీలో చేరని వారిపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్​రావు ఆరోపించారు. మంత్రి దామోదర రాజ నర్సింహ ఆదేశాలతోనే మధుసూదన్‌ రెడ్డిని అరెస్టు చేశారన్నారు. 10 ఏళ్ల పాలనలో భారత రాష్ట్ర సమితి ఏనాడూ ఇలా అధికార దుర్వినియోగం చేయలేదని పేర్కొన్నారు.

'అక్రమ మైనింగ్ చేస్తే ఉపేక్షించేది లేదు' - మంత్రి జూపల్లి స్ట్రాంగ్ వార్నింగ్

Illegal Mining In Gadwal District : 'మనల్ని ఎవడ్రా ఆపేది.. తవ్వేయండి.. తర్వాత చూసుకుందాం!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.