ETV Bharat / state

చిన్నారులను విక్రయిస్తున్న ముఠా అరెస్ట్​ - 16 మందిని కాపాడిన పోలీసులు - Child Kidnap Gang Arrest in TS - CHILD KIDNAP GANG ARREST IN TS

Police Caught Inter-State Child Selling Gang : రాష్ట్రంలో చిన్నారులను విక్రయిస్తున్న అంతరాష్ట్ర ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ముఠాలో ఉన్న 8 మందిని అరెస్ట్​ చేశామని రాచకొండ సీపీ తరుణ్​ జోషి తెలిపారు. 16 మంది పిల్లలను రక్షించామని పేర్కొన్నారు. దిల్లీ, పుణెల నుంచి పిల్లలను తీసుకొచ్చి అమ్ముతున్నట్లు గుర్తించామని వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందం వెళ్లిందని వివరించారు.

Child Kidnap Gang Arrest in Telangana
Police Caught Inter-State Child Selling Gang (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : May 28, 2024, 2:56 PM IST

Updated : May 28, 2024, 3:45 PM IST

Police Caught Inter-State Child Selling Gang : చిన్నారులను విక్రయిస్తున్న అంతరాష్ట్ర ముఠాను రాచకొండ కమిషనరేట్‌ పరిధిలోని మేడిపల్లి పోలీసులు అరెస్టు చేశారు. ముఠాను అరెస్ట్ చేసి 16మంది చిన్నారులను కాపాడారు. బాలబాలికల్లో కొందరు ఇతర రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇటీవల మేడిపల్లిలోని చిన్నారి విక్రయంతో ముఠా వ్యవహారం బయటపడింది. నాలుగు రోజుల క్రితం ఫిర్జాదిగూడలో రూ.4.50 లక్షలకు ఆర్‌ఎంపీ డాక్టర్ శోభారాణి శిశువును విక్రయించారు. ఆమెతో పాటు సహకరించిన మరో ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు దర్యాప్తు జరపడంతో ముఠా గుట్టురట్టయింది. మొత్తం 16 మంది చిన్నారులను ముఠాకు విక్రయించినట్లు నిర్ధారించారు. ఈ ఘటనపై రాచకొండ సీపీ తరుణ్​ జోషి పలు విషయాలను తెలిపారు.

Rachakonda CP on Child Selling Gang : నెల నుంచి రెండేళ్ల వయసు పిల్లలను అమ్ముతున్నట్లు తెలిసిందని సీపీ పేర్కొన్నారు. పిల్లలు లేనివారికి అమ్ముతున్నట్లు సమాచారం వచ్చిందని వివరించారు. ఇటీవల మేడిపల్లిలో శోభారాణి, సలీం, స్వప్నను అరెస్టు చేశామని గుర్తు చేశారు. వారిని అరెస్టు చేసిన సమయంలో ఇద్దరు చిన్నారులను రక్షించామని అన్నారు. ఈ విషయంలో మరింత లోతుగా దర్యాప్తు చేసి విక్రయ ముఠాతో సంబంధమున్న ఏజెంట్లను పట్టుకున్నామని పేర్కొన్నారు. మొత్తం 8 మందిని అరెస్టు చేశామని వెల్లడించారు. ముఠాతో సంబంధమున్న నిందితులు దిల్లీ, పుణెల నుంచి పిల్లలను తీసుకొచ్చి అమ్ముతున్నట్లు గుర్తించామని సీపీ తెలిపారు. ఆయా నగరాల్లో ఉన్న వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందం వెళ్లిందని తెలిపారు. ఈ కేసులో మొత్తం 16 మంది మంది చిన్నారులను రక్షించామని చెప్పారు.

"పిల్లలను విక్రయించే ముఠాతో సంబంధమున్న ఏజెంట్లను పట్టుకున్నాం. మొత్తం 8 మందిని అరెస్టు చేశాం. దిల్లీ, పుణెల నుంచి పిల్లలను తీసుకొచ్చి అమ్ముతున్నట్లు గుర్తించాం. ఈ కేసులో మొత్తం 16 మంది మంది చిన్నారులను రక్షించాం. దిల్లీ, పుణెలో ఉన్నవారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందం వెళ్లింది." - తరుణ్‌జోషి, రాచకొండ సీపీ

చిన్నారులను విక్రయిస్తున్న ముఠా అరెస్ట్​ 16 మందిని కాపాడిన పోలీసులు (ETV Bharat)

'మీ బాబును కిడ్నాప్ చేశాం మేమడిగినంత డబ్బివ్వకపోతే చంపేస్తాం' - ఇలాంటి ఫోన్​కాల్స్ మీకూ వస్తున్నాయా? - CYBER CRIMINALS FAKE KIDNAP CALLS

చంచల్​గూడలో చిన్నారి కిడ్నాప్ - గంటల వ్యవధిలోనే రెస్క్యూ చేసిన పోలీసులు

Last Updated : May 28, 2024, 3:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.