ETV Bharat / state

కోట్లు కొల్లగొట్టిన 'డాయ్ యాప్' - కేటుగాళ్లకు చెక్ పెట్టిన పోలీసులు - police arrested Daai App accused - POLICE ARRESTED DAAI APP ACCUSED

Police Arrested One Person in Daai APP Scam : రాష్ట్రంలో సంచలనం సృస్టించిన 'డాయ్ యాప్' స్కాంను పోలీసుల చేధించారు. డబ్బులు ఆశచూపి దాదాపు రూ. 6 కోట్లు కొల్లగొట్టిన నిందితుల్లో ఒకరిని పోలీసులు అరెస్టు చేశారు. మిగిలిన ఇద్దర్ని త్వరలోనే అరెస్ట్ చేస్తామని పోలీసులు వెల్లడించారు. ఈ స్కాం కేవలం రాష్ట్రంలోనేగాక దేశంలోని అనేక ప్రాంతాల్లో జరిగినట్లు అనుమానిస్తున్నారు.

Police Arrested One Person in Daai APP Scam
Police Arrested One Person in Daai APP Scam (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 8, 2024, 7:23 PM IST

Police Arrested One Person in Daai APP Scam : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన 'డాయ్ యాప్' స్కాంను (DAAI APP SCAM)ను పోలీసుల చేధించారు. డబ్బులు ఆశచూపి దాదాపు రూ. 6 కోట్లు కొల్లగొట్టిన నిందితుల్లో ఒకరిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను డీఎస్పీ విష్ణు రఘువీర్ మీడియాకు వెల్లడించారు. "పలమనేరు మెప్మా కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్​గా పనిచేస్తున్న రాజేశ్(A3)​కు వాట్సప్ ద్వారా డాయ్ యాప్ పేరుతో అపరిచితుల నుంచి మెసేజ్ వచ్చింది. అందులో బాల సుబ్రహ్మణ్యన్(A1), టీనా(A2) అనే ఇద్దరు వ్యక్తులు పరిచయమయ్యారు. డాయ్ యాప్ ద్వారా రెట్టింపు డబ్బులు సంపాదించవచ్చని రాజేశ్​ను నమ్మించారు. మెుదట్లో పెట్టిన పెట్టుబడికి అదనంగా డబ్బులు వేస్తూ లాభాలు వస్తున్నట్లు నమ్మించారు. దీంతో కనీసం బాల సుబ్రహ్మణ్యన్, టీనాలను చూడకుండానే రాజేశ్ వారిని గుడ్డిగా నమ్మాడు.

ఫేక్​ యాప్​తో రూ.20కోట్ల భారీ మోసం- లబోదిబోమంటున్న బాధితులు - Fake APP 20 Crores Rupees Fraud

అనంతరం తన కార్యాలయంలో పనిచేసే వారితో పాటు మరికొందరికి ఈ డాయ్ యాప్ గురించి చెప్పాడు. ఇందులో డబ్బులు పెట్టుబడిగా పెడితే రెట్టింపు అవుతాయని నమ్మించి దాదాపు రూ. 6కోట్ల పెట్టుబడులు పెట్టించాడు. అయితే రాత్రికి రాత్రే యాప్ పనిచేయటం ఆగిపోవటంతో బాధితులు ఒక్కొక్కరుగా రోడ్డెక్కారు. చేసేదేం లేక తమ డబ్బును ఇప్పించాలని పోలీసులను ఆశ్రయించారు. "దీనిపై దర్యాప్తు చేపట్టి రాజేశ్(A3)ను అరెస్ట్ చేశాం. మిగిలిన బాల సుబ్రహ్మణ్యన్(A1), టీనా(A2)లను త్వరలోనే అరెస్ట్ చేస్తాం" అని డీఎస్పీ విష్ణు రఘువీర్ తెలిపారు. డాయ్ యాప్ స్కామ్​లో​ తాము మోసపోవడమేగాక చాలా మందికి డబ్బు ఆశ చూపి పెట్టుబడులు పెట్టించిన 19మంది మెప్మా సిబ్బందిని జిల్లా కలెక్టర్ బుధవారం విధుల నుంచి తొలగించారు. ఈ స్కాం కేవలం రాష్ట్రంలోనేగాక దేశంలోని అనేక ప్రాంతాల్లో జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

రూ.6 కోట్లు స్వాహా : డీఏఏఐ అనే ట్రేడింగ్ యాప్​ (DAAI APP)ను డ్వాక్రా పర్సన్లు పలమనేరుతో పాటు చుట్టూ పక్కల వ్యాప్తి చేశారు. ఈ యాప్​లో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయని ఆశచూపించారు. దీంతో అనేక మంది సుమారు 6 కోట్ల రూపాయలను పెట్టుబడులుగా ఈ యాప్​లో పెట్టారు. డబ్బుపై ఆశతో ద్విచక్ర వాహనాలను అమ్మి, బంగారాన్ని తాకట్టి పెట్టి వడ్డీలకు నగదు తెచ్చిమరీ యాప్​లో పెట్టి నిండా మునిగిపోయామని బాధితులు వాపోతున్నారు.

పోలీసుల ఎదుట బాధితుల గోడు : రాత్రికి రాత్రే యాప్ పనిచేయటం ఆగిపోవటంతో బాధితులు ఒక్కొక్కరుగా రోడ్డెక్కారు. చేసేదేం లేక తమ డబ్బును ఇప్పించాలని పోలీసులను ఆశ్రయించారు. డ్వాక్రా రిసోర్స్ పర్సన్లు తమ కొంపముంచారని పోలీసుల ఎదుట బాధితులు తమ గోడును వెళ్లగక్కారు. ఈ నేపథ్యంలో బాధితుల నుంచి వివరాలు సేకరించిన పోలీసులు విచారణ చేపట్టారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఈరోజు(గురువారం) మూడో నిందితుడు రాజేశ్(A3)​ను అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించారు. మిగిలిన బాల సుబ్రహ్మణ్యన్(A1), టీనా(A2)లను త్వరలోనే అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు.

Online Loan Scams : ఆన్​లైన్​ లోన్​ యాప్‌ల మోసాలకు కళ్లెం వేయాల్సిందే!

అడక్కుండానే మన ఖాతాల్లో డబ్బు వేస్తున్న చైనా గ్యాంగ్.. ఎందుకో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.