Police Arrest Thieves Gang for Attempted Theft in Bhimavaram : ఓ వ్యక్తి వ్యాపారంలో భారీగా నష్టపోయాడు. దీంతో వ్యాపారాన్ని వదిలేసి ఎలాగైనా కోటిశ్వరుడిని అయిపోవాలని మాస్టర్ ప్లాన్ వేశాడు. ఈ క్రమంలో ఓ ధనవంతుడి ఇంట్లో చోరీ చేయాలని అనుకున్నాడు. దీనికి మరి కొంతమందిని కలుపుకొని చోరీ చేద్దామని బయలుదేరారు. వారంతా ఎలాగైనా రాత్రికి రాత్రి కోటేశ్వరులు అయి పోదాం అనుకున్నారు. ఈ క్రమంలో వారు ఆ ధనవంతుని ఇంట్లో భారీ చోరీకి ప్రయత్నించి కటకటాల పాలయ్యారు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో జరిగింది. ఇందుకు సంబంధించిన వివరాలు జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ(SP Adnan Naeem Azmi) తెలిపారు.
ఇదీ జరిగింది : కాకినాడ జిల్లా పెదపూడి మండలం రాజుపూడి గ్రామానికి చెందిన గంపల ఆనందబాబు అనే వ్యక్తి ఇంటర్నేషనల్ కార్పొరేషన్ నేచురల్ ప్రొడక్ట్ వ్యాపారం చేస్తూ నష్టాల పాలయ్యాడు. వ్యాపారం వల్ల లాభం లేదని భావించి ధనవంతులు ఇళ్లను దోచుకోవాలని నిర్ణయించుకున్నాడు. దీనిలో భాగంగా భీమవరంలో వ్యాపారవేత్త అయిన వేగేసిన బడా వ్యాపారవేత్త ఇంటిని ఎంచుకున్నారు. రాజమండ్రి, కాకినాడకు చెందిన మరో 11 మందిని ముఠాగా ఏర్పాటు చేసుకుని ఈ నెల 23న రెండు కార్లలో భీమవరం వచ్చి ఇంట్లో చోరీకి ప్రయత్నించారు.
ఇంటి వాచ్మెన్, యజమాని గమనించి కేకలు వేయడంతో పరారయ్యారు. అదే రాత్రి డ్యూటీలో ఉన్న భీమవరం టూ టౌన్ సీఐ కాళీ చరణ్ తమ సిబ్బందితో దొంగల ముఠా కారును వెంబడించి అదుపులోకి తీసుకుని విచారించగా దొంగతనం ప్రణాళిక బయటపడింది. ఈ కేసులో 9 మందిని అరెస్టు చేయగా మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. చోరీకి ప్రయత్నించిన వారిలో 8 మంది 25 సంవత్సరాల లోపు యువకులే ఉన్నారు. వీరంతా తొలిసారి దోపిడీకి ప్రయత్నించి చిక్కారని జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి తెలిపారు. ముఠాను పట్టుకున్న సీఐ, కానిస్టేబుల్కు ఎస్పీ నగదు రివార్డు అందజేసి అభినందించారు.
ఆ సౌండ్ వినిపిస్తే చాలు - సీసాలు, గ్లాసులు వదిలేసి మందుబాబులు పరార్
వైఎస్సార్సీపీ నేత ధర్మాన కృష్ణదాస్ మాజీ పీఏ నివాసాల్లో ఏసీబీ తనిఖీలు