ETV Bharat / state

లోన్​యాప్ బెదిరింపులా? - ఇలా రక్షించుకోండి! - LOAN APPS PHOTO MORPHING THREATS

రుణయాప్‌ ఏజెంట్ల వేధింపులకు బలవుతున్న సామాన్యులు - సైబర్‌ దాడి నుంచి రక్షించుకునేందుకు అందుబాటులోకి వెబ్‌సైట్‌

Loan_Apps_Morphing_Threats
Loan_Apps_Morphing_Threats (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 16, 2024, 4:34 PM IST

Police Advices on Loan Apps Photo Morphing Threats: ఇటీవల కాలంలో రుణయాప్‌ ఏజెంట్ల వేధింపులకు బలవుతున్న ఘటనలు తరచూ వెలుగు చూస్తున్నాయి. ఈ విషయమై ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు ఉమ్మడి ప్రకాశంలోనూ కేసులు నమోదవుతున్నాయి. బాధితుల్లో యువత, విద్యార్థులు, మహిళలే ఎక్కువగా ఉంటున్నారు. పూర్తిగా తిరిగి చెల్లించినా ఇంకా బాకీ ఉందంటూ ఫొటోలు మార్ఫింగ్‌ చేసి బెదిరించడం సైబర్‌ నేరగాళ్ల బరితెగింపునకు పరాకాష్ఠగా నిలుస్తోంది. దీంతో బాధితులు మనస్తాపానికి గురై ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ఆ సైబర్‌ దాడి నుంచి రక్షించుకునేందుకు ఓ వెబ్‌సైట్‌ అందుబాటులో ఉంది. దీనిపై అవగాహన పెంచుకుంటే ఏ సందర్భంలోనైనా ఉపయోగపడుతుందని పోలీసులు చెప్తున్నారు. ఆ వివరాలు మీ కోసం.

వేధింపుల ఘటనలు

  • లోన్‌ యాప్‌ నిర్వాహకుల వేధింపులు భరించలేక ఓ యువకుడు పెళ్లైన 40 రోజులకే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కేవలం రూ.2000 కోసం భార్యాభర్తల ఫొటోలను మార్ఫింగ్‌ చేసి బంధువులకు పంపడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ నెల 10వ తేదీన విశాఖలో ఈ ఘటన చోటుచేసుకుంది.
  • నంద్యాల జిల్లాలోని శ్రీశైలానికి చెందిన ఓ యువతి రూ.15,000 రుణం తీర్చే క్రమంలో వేధింపులకు గురైంది. ఈ నెల 9న శ్రీశైలంలోని శిఖరేశ్వరం నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అటవీశాఖ సిబ్బంది సకాలంలో స్పందించడంతో ప్రాణాపాయం తప్పింది.
  • కనిగిరి మండలం శంఖవరానికి చెందిన 19 ఏళ్ల యువకుడు లోన్‌ యాప్‌ ద్వారా రుణం తీసుకుని రికవరీ ఏజెంట్ల బారినపడ్డాడు. కుటుంబ సభ్యులకు విషయం తెలియడంతో రూ.1.60 లక్షల మొత్తం చెల్లించారు. అయినప్పటికీ మరికొంత చెల్లించాలని డిమాండ్‌ చేసి ఫొటోలు మార్ఫింగ్‌ చేసి బెదిరించడంతో తనువు చాలించాడు.

'పోలవరం పూర్తయ్యేది అప్పుడే - టార్గెట్ ప్రకటించిన సీఎం చంద్రబాబు

పూర్తిగా సురక్షితం: ఈ సైట్‌ పేరు www.stopncii.org అంతర్జాతీయంగా నిర్వహించే ఈ వెబ్‌సైట్‌ పూర్తిగా భద్రమైనదని పోలీసులు అంటున్నారు. మనం అప్‌లోడ్‌ చేసిన ఫొటోలను డౌన్‌లోడ్‌ చేయడం, ఇతరులకు షేర్‌ చేయడం లాంటివి ఉండవు. డిజిటల్‌ ఫింగర్‌ ప్రింట్‌ తరహాలో మన చిత్రంతో ప్రత్యేక గుర్తింపు ఇస్తుంది. దాని ఆధారంగా సోషల్ మీడియాలో మన ఫోటోలు అప్‌లోడ్‌ అయితే అధునాతన సాంకేతిక ఆధారంగా గుర్తించి క్షణాల్లో తొలగిస్తుంది. 2015లోనే అందుబాటులోకి వచ్చిన ఈ వెబ్​సైట్‌ ఇప్పటివరకు అంతర్జాతీయంగా 2 లక్షల మందికి పైగా బాధితుల మార్ఫింగ్‌ చిత్రాలను తొలగించి వారికి వ్యక్తిగత రక్షణ కల్పించింది.

నేరుగా ఫిర్యాదు చేయవచ్చు: మీ ఫొటోలతో అశ్లీల చిత్రాలు తయారుచేసి ఎవరైనా బ్లాక్‌మెయిల్‌ చేస్తుంటే నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. ఇందుకోసం మీ ఫోన్​కు వచ్చిన ఫొటోలను ఈ సైట్‌కు పంపాలి. ఇందులో 9 రకాల ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. ఆ మేరకు వివరాలు నమోదవుతాయి. తర్వాత ఫొటోలు అప్‌లోడ్‌ చేస్తే వాటిపై ఈ సైట్‌ నిఘా పెడుతుంది. ఎవరైనా వాటిని సోషల్ మీడియాలో పెడితే వెంటనే గుర్తించి తొలగిస్తుంది. ఆ వివరాలను నోటిఫికేషన్‌ రూపంలో మీకు తెలియపరుస్తుంది.

జాగ్రత్తలు పాటించాలి: సోషల్ మీడియా విషయంలో యువత అప్రత్తంగా ఉండాలని పోలీసులు చెప్తున్నారు. ముఖ్యంగా ఫొటోలు అప్‌లోడ్‌ చేయకపోవడమే మంచిదని ఒక వేళ చేసినా ఇతరులకు వాటి యాక్సెస్‌ లేకుండా జాగ్రత్త వహించాలని సూచిస్తున్నారు. ప్రొఫైల్‌ ఫోటోలను ఇతరులకు డౌన్‌లోడ్‌ కాకుండా ప్రైవసీ లాక్‌ వేయాలి. అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే రిక్వెస్టులు, లింకులను ఎట్టి పరిస్థితిలోనూ ఆమోదించరాదు. ఎవరైనా అనుచితంగా ప్రవర్తిస్తే వారిని బ్లాక్‌ లిస్ట్‌లో పెట్టడం మంచిదని చెప్తున్నారు.

పోలీసుల సూచనలు: ఫొటోల మార్ఫింగ్, రుణ యాప్‌ వేధింపులు ఎదురైతే భయపడకుండా పోలీసులకు ఫిర్యాదు చేయాలని కంభం సీఐ మల్లికార్జున సూచించారు. తద్వారా వారికి అండగా నిలిచి అవసరమైన చర్యలు తీసుకునేందుకు వీలుంటుందని వివరించారు. ఈ విషయమై అప్రమత్తం చేసేందుకు కళాశాలలు, పాఠశాలల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేశామని తెలిపారు. సైబర్‌ నేరగాళ్ల ఆట కట్టించేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.

AI నైపుణ్యాలకు పదును - VVITలో గూగూల్ పైలెట్ ప్రాజెక్ట్

ఆర్మీ యూనిఫాం ధరించాలని కలలుకంటున్నారా? - ఇదే సువర్ణావకాశం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.