ETV Bharat / state

రోజుకో మొక్క - ఇదీ రాజశేఖర్​ లెక్క - 'మన్‌ కీ బాత్‌'లో ప్రధాని మోదీ ప్రశంసలు - PM Praises TG Man Green Mission - PM PRAISES TG MAN GREEN MISSION

PM Modi Mann Ki Baat : మన్‌ కీ బాత్‌ సందర్భంగా ప్రధాని మోదీ కె.ఎన్‌.రాజశేఖర్‌ను ప్రశంసించారు. అమ్మ పేరుతో ఒక మొక్క నాటే కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రం సరికొత్త రికార్డులు సృష్టించిందన్నారు. తెలంగాణకు చెందిన రాజశేఖర్‌ ఎంతో చిత్తశుద్ధితో మొక్కలు నాటుతున్నారని, ఆయన చూపుతున్న నిబద్ధత ఆశ్చర్యచకితుల్ని చేస్తుందన్నారు. ప్రమాదం బారినపడినా రాజశేఖర్‌ తన సంకల్పాన్ని వీడలేదని ఆయన ప్రయత్నాన్ని తాను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా అని మోదీ పేర్కొన్నారు.

PM Modi Praises Telangana Man Green Mission
PM Modi Mann Ki Baat (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 30, 2024, 1:51 PM IST

PM Modi Praises Telangana Man Green Mission : తండ్రి స్ఫూర్తితో మొక్కలు నాటాలని నిర్ణయించుకున్న ఆయన ఆ దిశలో తిరుగులేని సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. వేలాది మొక్కలు నాటి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఏకంగా దేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీ నుంచి ప్రశంసలు అందుకున్నారు. ఆదివారం నిర్వహించిన 114వ మన్‌కీబాత్‌ కార్యక్రమంలో ప్రధాని మోదీ రాజశేఖర్‌ కృషిని ప్రత్యేకంగా ప్రస్తావించారు.

అమ్మ పేరుతో ఒక మొక్క : అలాగే తెలంగాణలో 'అమ్మ పేరుతో ఒక మొక్క' కార్యక్రమ నిర్వహణ చక్కని పనితీరు కనబరుస్తోందని ప్రధాని మోదీ అభినందించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రానికి చెందిన కొట్టూరు నుర్వి రాజశేఖర్‌ సింగరేణి సెంట్రల్‌ వర్క్‌షాప్‌లో ఫిట్టర్‌గా పనిచేస్తున్నారు. రాజశేఖర్‌ తండ్రి పాండు దర్జీ, మేకప్‌ ఆర్టిస్ట్‌. చెట్లపై ఇష్టంతో ఆయన మొక్కలు నాటుతుండేవారు. తండ్రి స్ఫూర్తితో పదకొండో ఏట నుంచే మొక్కలు నాటుతూ పచ్చదనం పెంచేందుకు కృషి చేస్తున్నారు రాజశేఖర్‌.

25 వేలకు పైగా మొక్కల్ని నాటిన రాజశేఖర్‌ : అలా ఇప్పటి వరకు స్వయంగా 25 వేలకు పైగా మొక్కల్ని నాటి అందరి మన్ననలు అందుకుంటున్నారు. ప్రత్యేకంగా 2020 జులై 1న ‘ప్రకృతి హరిత దీక్ష’ చేపట్టారు. అప్పటి నుంచి నుంచి రోజుకో మొక్క నాటుతూ, సెల్ఫీలు దిగుతూ ఇతరుల్లోనూ చైతన్యాన్ని పెంపొందిస్తున్నారు. ప్రముఖుల జయంతి, పండుగలు, బంధుమిత్రుల పెళ్లిళ్లు, పుట్టిన రోజులు ఇలా ప్రత్యేక రోజుల్లో మొక్కలు పంపిణీ చేస్తూ, వాటిని నాటుతూ ఇతరులనూ ప్రోత్సహిస్తున్నారు.

2020 జులై 1 నుంచి ఇప్పటి వరకు ఆయన రోజుకో మొక్క చొప్పున 1500కు పైగా మొక్కలు నాటారు. గత జూన్‌ 18న ఆయన ద్విచక్రవాహనంపై నుంచి పడి గాయాలపాలయ్యారు. ఆ క్లిష్ట సమయంలోనూ పట్టు వదలకుండా మొక్కలు నాటి ఆదర్శంగా నిలిచారు. కోటి విత్తనాలు చల్లడమే తన లక్ష్యమని, ఇప్పటి వరకు 10 లక్షల విత్తనాలు వెదజల్లానని రాజశేఖర్‌ తెలిపారు.

"అమ్మ పేరుతో ఒక మొక్క నాటే కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రం సరికొత్త రికార్డులు సృష్టించింది. తెలంగాణకు చెందిన రాజశేఖర్‌ ఎంతో చిత్తశుద్ధితో మొక్కలు నాటుతున్నారు. ఆయన చూపుతున్న నిబద్ధత ఆశ్చర్యచకితుల్ని చేస్తుంది. నాలుగేళ్ల క్రితం ఆయన రోజూ కనీసం ఒక మొక్కనైనా నాటాలని సంకల్పించారు. అలా ఇప్పటి వరకు 1500కు పైగా మొక్కలు నాటారు. ప్రమాదం బారినపడినా రాజశేఖర్‌ తన సంకల్పాన్ని వీడలేదు. ఆయన ప్రయత్నాన్ని తాను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా." అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

'తెలుగు అద్భుతమైన భాష'- 'మన్​ కీ బాత్​'లో తెలుగు ప్రజలకు ప్రధాని మోదీ విషెస్

'అమరవీరుల కోసం 'మేరీ మాటి మేరా దేశ్‌'.. 7500 ప్రాంతాల నుంచి మట్టి, మొక్కలు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.