ETV Bharat / state

చికున్‌ గన్యా సోకిన వారిలో డెంగీ లక్షణాలు - అసలేం జరుగుతోంది? - CHIKUNGUNYA CASES IN HYDERABAD

హైదరాబాద్​లో పెరుగుతున్న వైరల్​ జ్వరాలు - కొత్త లక్షణాలతో బెంబేలు - పిల్లలపై ఎక్కువ ప్రభావం - నిలోఫర్‌ ఓపీకి బాధితులు - అప్రమత్తత అవసరమంటున్న నిపుణులు

VIRAL FEVER CASES RISES IN HYD
Chikungunya and Dengue Cases Increases in Hyderabad (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 21, 2024, 1:18 PM IST

Dengue Symptoms in Chikungunya Patients : చికున్‌ గన్యా వచ్చిన వారిలో కొత్త లక్షణాలు కనిపిస్తుండడం ఒకింత ఆందోళనకు గురిచేస్తోంది. వీరిలోనూ ప్లేట్‌లెట్లు తగ్గిపోతుండటంతో డెంగీగా అనుమానిస్తున్న వైద్యులు ఎన్‌ఎస్‌1, ఐజీజీ ఎలీసా పరీక్షలు చేస్తున్నారు. డెంగీ లేదని నిర్ధారించుకున్న తర్వాత చికున్‌గన్యాకు చికిత్స అందిస్తున్నారు. దీని ప్రభావం చిన్న పిల్లలపైనే ఎక్కువగా కనిపిస్తోంది.

  • నిలోఫర్‌ ఆసుపత్రిలోని ఓపీకి ఈ తరహా కేసులు నిత్యం 5-6 వరకు వస్తున్నాయి. పిల్లల్లో సైతం కీళ్ల నొప్పులు తీవ్రంగా ఉంటున్నాయి.
  • చికున్‌ గన్యా బారినపడిన వారిలో కొత్తగా ముక్కు భాగంలో నల్లని ప్యాచ్​లు వస్తున్నాయని వైద్యులు తెలిపారు. దీన్ని నిర్ధారించడానికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీసం పీసీఆర్‌ టెస్టులు సైతం అందుబాటులో లేవు. లక్షణాలను పరిగణనలోకి తీసుకొని చికిత్స అందిస్తున్నారు.
  • నగరంలో చికున్‌గన్యా కేసులే ఎక్కువగా నమోదవుతున్నాయని వైద్యులు తెలిపారు.
  • జ్వరం తగ్గినా చాలామందిలో దాదాపు 3 నుంచి 4 వారాలపాటు తీవ్ర కీళ్ల నొప్పులు ఉంటున్నాయి. ఇందుకు టైగర్​ దోమ కారణం.
  • చికున్‌గన్యా, డెంగీ వైరల్‌కు సంబంధించినవే. అయితే దీని వల్ల వచ్చే నొప్పులు తగ్గడానికి కొందరు పెయిన్‌కిల్లర్లు వాడుతున్నారు. వైద్యుల సూచనలు లేకుండా ఇలాంటివి చెయ్యొద్దని సూచిస్తున్నారు.
  • తీవ్రమైన జర్వంతో శరీరం త్వరగా డీహైడ్రేషన్‌ బారిన పడుతుంది. పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల నిస్సత్తువ ఆవహించదు.

చికున్‌గన్యా లక్షణాలు

  • సడెన్​గా 102 డిగ్రీలకుపైగా జ్వరం వస్తుంది.
  • తీవ్ర కీళ్ల, కండరాల నొప్పులు వస్తాయి
  • చేతుల మణికట్టు, కాళ్లు, మడమలు, భుజాల్లో నొప్పి ఉంటుంది.
  • చర్మంపై దద్దుర్లే కాకుండా ముఖంపై నల్లటి ప్యాచ్​లు వస్తాయి.
  • జ్వరం తగ్గినా నెల రోజులపాటు కీళ్ల నొప్పులు ఉంటాయి.
  • కొందరిలో ప్లేట్‌లెట్లు తగ్గిపోతాయి.

డెంగీ లక్షణాలు ఇలా

  • హఠాత్తుగా 102 డిగ్రీలకుపైగా అధిక జ్వరం వస్తుంది.
  • తీవ్రమైన తల, కళ్ల వెనుక నొప్పు ఉంటుంది.
  • అలసట, వికారం, అతిసారం, వాంతులు చేసుకుంటారు.
  • జర్వం వచ్చిన రెండు రోజుల తర్వాత చర్మంపై దద్దుర్లు, తేలికపాటి రక్తస్రావం
  • ప్లాస్మా లీకేజీలు
  • కాళ్లు, కళ్ల కింద వాపులు

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

  • ఇంట్లో దోమలు రాకుండా దోమ తెరలు వాడాలి.
  • ఇంట్లోని కుండీల్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి. దానితోపాటు చెత్తాచెదారం కూడా ఎప్పటికప్పుడు తొలగించాలి.
  • పిల్లలను పాఠశాలలకు పంపిచేటప్పుడు వారి చేతులు, కాళ్లు కప్పి ఉంచేలా సాక్సులు, ఇతర వస్త్రాలు ధరింపజేయాలి.
  • ఇంటి చుట్టూ నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి.

ప్రస్తుతం నగరంలో చికున్‌గన్యా ఎక్కువగా కనిపిస్తోందని చిన్న పిల్లల వైద్యనిపుణులు ఉషారాణి తెలిపారు. పిల్లలు కూడా ఈ జ్వరం బారిన పడుతున్నారని చెప్పారు. 102 డిగ్రీలపైన జ్వరం ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. కొన్నిసార్లు చికున్‌గన్యాలో ప్లేట్‌లెట్ల తగ్గుదల ఉంటుందని వెల్లడించారు. అది అంత ముప్పు కాదని, కానీ డెంగీలో ప్లేట్‌లెట్లు తగ్గడం, ప్లాస్మా లీకేజీలతో రోగి పరిస్థితి విషమంగా మారే ప్రమాదం ఉంటుంది తెలిపారు. పిల్లల విషయంలో అయితే మరింత జాగ్రత్తగా ఉండాలని హెచ్చిరించారు.

ఎలా ఉన్నావు? అని అడగడం బదులు జ్వరం తగ్గిందా అని అడిగే పరిస్థితి వచ్చింది! - Viral Fevers In Telangana

విష జ్వరాలతో ఇబ్బందా? ఈ ఆయుర్వేద కషాయం తాగితే వెంటనే కంట్రోల్​ అవుతుందట! - Fever Treatment in Ayurveda

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.