Phone Tapping Case in Telangana : స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (ఎస్‌బీఐ)లో ప్రణీత్‌రావు బృందం అనధికారికంగా సాగించిన ఫోన్‌ట్యాపింగ్‌కు వినియోగించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని హైదరాబాద్ నుంచే సమకూర్చుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. మాదాపూర్‌లోని ఓ ఇన్నోవేషన్ ల్యాబ్ దీనికి సంబంధించిన టెక్నాలజికల్ టూల్‌ను అందించే కన్సల్టెన్సీగా వ్యవహరించినట్లు వెల్లడైంది. టెలికమ్యూనికేషన్ రంగంలో అపార అనుభవనున్న ఆ కంపెనీ ద్వారానే సాఫ్ట్‌వేర్ సమకూర్చుకున్న ప్రణీత్‌రావు బృందం దాన్ని అక్రమ వ్యవహారాలకు ఉపయోగించినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు.
Phone Tapping Software From Hyderabad : ఎస్‌ఐబీ రెండు ప్రత్యేక గదులు ట్యాపింగ్ వ్యవహారానికి కేంద్రంగా ఉన్నాయని బయటి ప్రాంతాల్లో సర్వర్లు పెట్టి నిఘా ఉంచలేదని ఇప్పటివరకు జరిగిన దర్యాప్తులో వెల్లడైంది. 2023 శాసనసభ ఎన్నికల నియామవళి అమల్లో ఉన్న సమయంలో ప్రణీత్‌రావు బృందం సాంకేతిక నిఘాను విస్తృతంగా ఉపయోగించింది. బీఆర్ఎస్ ప్రత్యర్థులైన అభ్యర్థులకు వసరులు అందించే వ్యాపారుల ఫోన్లు ట్యాప్ చేసి ఆ సమాచారాన్ని హైదరాబాద్ సహా పలు జిల్లాల్లోని పోలీసులకు అందించారు. దాని ఆధారంగా సొమ్ము పట్టుకుని అది ఎన్నికల కమిషన్ ఆధీనంలోకి వెళ్లకుంటా పక్కా ప్రత్యేక ప్రణాళిక రచించి అమలు చేశారు. ఆ డబ్బుకు హవాల రంగు పులిమి పోలీసు కేసులు నమోదు చేయించి జప్తు చేయించినట్లు దర్యార్తులో ద్వారా పోలీసులు తేల్చారు.
పోలీసుల దర్యాప్తులో వెల్లడైన విషయాలు ఇవే : అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ పూర్తి కాగానే ఫోన్ ట్యాపింగ్ నిలిపేశారు. ఎస్‌ఐబీలోని 17 కంప్యూటర్లలోని 42 హార్డ్‌డిస్క్‌లను పూర్తిగా తీసేశారు. వాటి స్థానంలో కొత్తవి అమర్చారు. ఆ కారణంగా మావోయిస్టులకు సంబంధించిన సమాచారం సైతం లేకుండా పోయింది. తర్వాత ప్రణీత్ స్వయంగా ఎలక్ట్రీషియన్‌ను తీసుకెళ్లి ఎస్‌ఐబీలోనే హార్డ్‌డిస్క్‌లను ఎలక్ట్రిక్ కట్టర్లతో కట్ చేయించాడు. అనంతరం ఎవ్వరికీ తెలియకుండా ఉండడానికి తాను ఒక్కడే ద్విచక్ర వాహనంపై రెండు విడతలుగా మూసీ వద్దకు వెళ్లి ధ్వంసం చేసిన హార్డ్‌డిస్క్‌లను నదిలో పడేశాడు. పోలీసుల విచారణలో ప్రణీత్‌రావు నేరం అంగీరకరించడంతోపాటు ధ్వంసమైన హార్డ్‌డిస్క్‌ల గురించి చెప్పక తప్పలేదు. అతడిచ్చిన సమాచారం ఆధారంగానే నాగోలు బ్రిడ్జి కింద మూసి నదిలో హార్డ్‌డిస్క్‌ల శకలాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అరెస్టయిన నిందితులందరి వాంగ్మూలాల్లోనూ ఎస్‌ఐబీ మాజీ ఛీప్ ప్రభాకర్‌రావు ప్రస్తావవ వస్తున్న విషయం తెలిసిందే. ఆయన ప్రస్తుతం అమెరికాలో ఉన్నట్లు సమాచారం. ప్రణీత్‌రావుపై మార్చి 10వ తేదీనా ఎఫ్‌ఐఆర్ నమోదైన మరుసటి రోజే ప్రభాకర్ చెన్నై మీదుగా అమెరిగా వెళ్లడం, అదే సమయంలో టాస్క్‌ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్‌రావు బహ్రెయిన్‌కు పయనం, ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటు ఓ మీడియా సంస్థ నిర్వాహకులు సైతం అంతకు ఒకట్రెండు రోజుల ముందే విదేశాలకు వెళ్లడం చర్యనీయాంశంగా మారింది.
ప్రణీత్‌రావు నోట తన పేరు బహిర్గతమవుతుందనే ఉద్దేశంతోనే ప్రభాకర్‌రావు విదేశాలకు వెళ్లారనే ప్రచారం విస్తృతంగా సాగింది. కానీ ఆయన అమెరిగా వెళ్లేందుకు ఫిబ్రవరి 13నే టికెట్ బుక్ చేసుకున్నట్లు విచారణలో తేలింది. దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న ఆయన శస్త్రచికిత్స కోసం వెళ్లినట్లు ఇమిగ్రేషన్ నుంచి సేకరించిన వివరాల ఆధారంగా దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఈ కేసులో ప్రభాకర్‌రావును విచారించడం కీలకం కావడంతో అతడి కోసం చూస్తున్నారు.