ETV Bharat / state

మీరు పెట్రోల్ బంక్​లో 0 మాత్రమే చూస్తున్నారా? - దోపిడీ ఇలా చేస్తుంటారు - ఈ 8 విషయాలు తెలుసా? - Petrol Pump Scams

author img

By ETV Bharat Telangana Team

Published : 2 hours ago

Petrol Pump Scams : పెట్రోల్ బంకుల్లో మోసాలు పెరిగిపోయాయి. తరచూ ఎక్కడో అక్కడ మోసాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అసలు పెట్రోలు బంకుల్లో ఎలాంటి మోసాలు జరుగుతుంటాయి? వాటిని ఏ విధంగా గుర్తించాలి? అనే ప్రశ్నలకు సమాధానాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

petrol pump fraud
petrol pump scam (ETV Bharat)

Petrol Pump Scams : పెట్రోల్ బంకుల్లో జరిగే మోసాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఇటీవల సిద్ధిపేటలోనూ ఓ పెట్రోల్ బంకులో ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. కానీ బయటకు రాని ఎన్నో మోసాలు ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలోనే పెట్రోల్ బంకుల్లో జరిగే మోసాలను గుర్తించడం ఎలా? వీటి నుంచి తప్పించుకునేందుకు వాహనదారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అన్న విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

జంప్ ట్రిక్ ఎలా పనిచేస్తుంది?

పెట్రోల్ బంక్​కు వెళ్లాక మీటర్ గమనిస్తే రీడింగ్ (0) సున్నా చేస్తారు. అది మనకు కనిపిస్తుంది. పెట్రోల్ నింపడం ప్రారంభించగానే.. అంతా బాగానే ఉంది అని వినియోగదారులు లైట్ తీసుకుంటారు. అప్పుడే మోసాలకు పాల్పడతారని నిపుణులు చెబుతున్నారు. పెట్రోల్ కొట్టడం ప్రారంభించగానే 1,2,3 రీడింగ్ కనిపించకుండా నేరుగా 5,6,7,8 కు జంప్ అవుతుందట. ఇలా చేయడం వల్ల మీకు రావాల్సిన పెట్రోల్ కన్నా తక్కువగా వస్తుందని అంటున్నారు. అందుకే జాగ్రత్తగా రీడింగ్ గమనించాలని నిపుణులు సూచిస్తున్నారు.

షార్ట్ ఫ్యూయలింగ్

పెట్రోల్ బంక్ వాళ్లు చేసే మోసాల్లో షార్ట్ ఫ్యూయలింగ్ ఎక్కువగా కనిపిస్తుంది. దీనిని సింపుల్​గా చెప్పాలంటే, మిమ్మల్ని మాటల్లో పెట్టి తక్కువ ఇంధనం నింపి, ఎక్కువ డబ్బులు వసూలు చేస్తుంటారు. ఉదాహరణకు మీరు రూ.100 విలువైన పెట్రోల్ అడిగినప్పుడు.. అటెండెంట్ మీటర్​ను జీరోకు సెట్ చేసి, ఫ్యూయెల్ నింపాల్సి ఉంటుంది. కానీ అతడు అంతకుమందు కొట్టిన రూ.50 రీడింగ్ వద్ద నుంచి ప్రారంభిస్తాడు. అప్పుడు మీరు రూ.100 చెల్లించి, కేవలం రూ.50 విలువైన ఇంధనాన్ని మాత్రమే పొందుతారు. ఇలా కాకుండా ఉండాలంటే ఇంధనం నింపే సమయంలో కచ్చితంగా మీటర్ జీరోకు సెట్ చేసిన తరువాత మాత్రమే పెట్రోల్ లేదా డీజిల్​ను నింపించుకోవాలి.

కార్ దిగి పెట్రోల్ కొట్టించుకోవాలి

కార్లలో ప్యూయల్ ఫిల్ చేసుకునే చాలా మంది వాహనం కిందకు దిగరు. లోపల నుంచి డబ్బులు చెల్లించి కొట్టించుకుంటారు. ఇలాంటి వారిని లక్ష్యంగా చేసుకుని మీటర్ రీడింగ్ మార్చకుండానే ఫిల్ చేస్తుంటారని నిపుణులు అంటున్నారు. కాబట్టి ఎప్పుడు పెట్రోల్ కొట్టించినా కారు దిగి మీటర్ దగ్గరు వెళ్లి పోయించుకోవాలని సూచిస్తున్నారు.

మెషీన్ మధ్యలో ఆగకూడదు

పెట్రోల్ పోసే వ్యక్తి మెషీన్​ను తరచుగా నిలిపివేస్తుంటే మోసం చేస్తున్నట్లుగానే భావించాలని నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల పెట్రోల్ తక్కువగా వస్తుందని అంటున్నారు. ఇలా అనుమానం వచ్చిన సమయంలో అవసరమైతే పెట్రోల్​ను పరీక్షించమని బంక్ యజమానులను డిమాండ్ చేయాలని సూచిస్తున్నారు. ఇవే కాకుండా పెట్రోల్ మెషీన్ వేగంగా పనిచేస్తున్నా, పెట్రోల్ తక్కువగా వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

రౌండ్ ఫిగర్ వద్దు

మనలో చాలా మంది రూ.100, 200, 500, 1000 ఇలా రౌండ్ ఫిగర్​గా పెట్రోల్​ను కొట్టిస్తుంటారు. ఇలా పోయించుకోవడం వల్ల సులభంగా మోసం చేస్తారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముందుగానే పెట్రోల్ మెషీన్​లో చిప్స్​తో సెట్టింగ్ చేసి ఇంధనం తక్కువగా వచ్చేలా చేస్తారని వివరించారు. కాబట్టి వీలైనంత వరకు రౌండ్ ఫిగర్​గా పెట్రోల్ కొట్టించుకోకూడదని నిపుణులు సలహా ఇస్తున్నారు.

పాత మెషీన్లతో జాగ్రత్త!

ఇంకా కొన్ని ప్రాంతాల్లో పాత మెషీన్లనే వినియోగిస్తుంటారు. ఇలా పాత మెషీన్లు ఉన్న బంకుల్లో జాగ్రత్తగా ఉండాలని.. వీటిలో ఎక్కువగా మోసాలు జరుగుతున్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే డిజిటల్ మీటర్లు ఉన్న పెట్రోల్ బంకుల్లో కొట్టించుకోవడం ఉత్తమం.

నాజిల్​ను వెంటనే తీయకూడదు

ఇంకా చాలా మంది పెట్రోల్ బంక్ అటెండెట్స్ ట్యాంక్ నుంచి త్వరగా నాజిల్​ను బయటకు తీస్తుంటారు. ఇలాంటి సమయంలో అనుమానం వ్యక్తం చేయాలని నిపుణులు చెబుతున్నారు. మెషీన్, మీటర్ పూర్తిగా ఆగిన తర్వాతనే ట్యాంక్ నుంచి నాజిల్ బయటకు తీయాలని వారికి ముందుగానే చెప్పాలని సూచిస్తున్నారు.

ఇలా చేయండి

ఒకవేళ మీరు 5 లీటర్ల పెట్రోల్ నింపించుకుంటుంటే.. అప్పుడు అక్కడ ఉన్న కొలత పరికరాన్ని ఉపయోగించాలని సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల మోసపోకుండా ఉంటారని నిపుణులు చెబుతున్నారు. ఇదే సమయంలో కొలత పరికరం కూడా సరిగ్గా ఉందా లేదా అని చెక్ చేసుకోవాలని వివరించారు.

కల్తీ అనుమానం వస్తే

కొన్నిసార్లు కల్తీ పెట్రోల్ కూడా పోస్తుంటారు. ఒకవేళ పెట్రోల్ కల్తీ అయినట్లు అనుమానం వస్తే వెంటనే లిట్మస్ పేపర్​తో పరీక్షించాలని సూచిస్తున్నారు. వినియోగదారుల రక్షణ చట్టం 1986 ప్రకారం.. పెట్రోలు బంకు యాజమాన్యం లిట్మస్ పేపర్లను వినియోగదారులకు అందుబాటులో ఉంచాలి. లిట్మస్ పేపర్ పై కొన్ని చుక్కల పెట్రోల్ పోయాలి. అది పూర్తిగా ఆవిరైన తరువాత, పేపర్​పై ఎలాంటి మరకలూ కనిపించకపోతే అది స్వచ్ఛమైన పెట్రోల్ అని అర్థం చేసుకోవచ్చట. ఒక వేళ పెట్రోల్ ఆవిరైపోయిన తరువాత పేపర్​పై మరకలు ఉంటే అది కల్తీ పెట్రోల్ అని నిర్ధరించుకోవాలని అంటున్నారు.

పెట్రోల్ బంక్ వాళ్లు మోసం చేస్తే ఏం చేయాలి?

ఒకవేళ పెట్రోలు బంకుల్లో జరిగే మోసాలపై కంప్లైట్ ఇవ్వాలంటే.. పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ లేదా సంబంధిత ఆయిల్ కంపెనీ వెబ్​సైట్​లోనూ సదరు పెట్రోల్ బంక్​పై ఫిర్యాదు చేయవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఒకవేళ అలా కాకుంటే అక్కడ ఉండే కంప్లైంట్ బుక్​లోనూ ఫిర్యాదు రిజిస్టర్ చేయవచ్చు. ప్రతి ఆయిల్ కంపెనీ, ప్రతి పెట్రోల్ బంక్​లోనూ ఒక కంప్లైంట్ రిజిస్టర్ బుక్​ను అందుబాటులో ఉంచుతుంది. ఆడిట్, తనిఖీల సమయంలో వాటిని సమీక్షిస్తుంటుంది.

ఆయిల్ కంపెనీలకు లీటర్ పెట్రోల్​పై రూ.15, డీజిల్​పై రూ.12 లాభం! - OMCs Making Huge Margins

పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే ఛాన్స్​! ఇదే కారణం!! - Petrol Diesel Price Cut

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.