People Suffer Due to Heavy Traffic in Vijayawada City : విజయవాడ నగరంలో పెరిగిన ట్రాఫిక్ సమస్యతో వాహనదారులు, ప్రయాణికులు నరకం చూస్తున్నారు. నగరంలో ట్రాఫిక్ సమస్య అస్తవ్యస్థంగా తయారైంది. రోడ్లపైనే వాహనాలు పార్కింగ్ చేసి గంటల తరబడి షాపింగ్‌కు వెళ్తున్నారు. ఈ సమయంలో రోడ్లపై వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలుచోట్ల చిరువ్యాపారులు రోడ్లపైనే దుకాణాలు పెట్టేశారు. కొనుగోలు చేయడానికి వచ్చేవారితో రోడ్లన్నీ చాలా వరకు బ్లాక్ అవుతున్నాయి.
భారీగా పెరిగిన ట్రాఫిక్ : పెరిగిన ట్రాఫిక్‌కు అనుగుణంగా రోడ్ల విస్తరణ జరగకపోవడం, రోడ్లపై చిరువ్యాపారులు దుకాణాలు పెట్టడం, వాహనాదారులు అక్కడే పార్కింగ్ చేయడం వంటి సమస్యలతో బెజవాడ ప్రజలు నరకం చూస్తున్నారు. గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకొని తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఉదయం, సాయంత్రం సమయాల్లో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి నగరానికి రాకపోకలు సాగించే వారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది.
ఆ రెండు రోడ్లు పూర్తయితే దూసుకుపోవడమే! - విజయవాడ తూర్పు బైపాస్ ఎక్కడినుంచి వెళ్తుందంటే!
అస్తవ్యస్థంగా మారిన ట్రాఫిక్ సమస్య : విజయవాడకు నిత్యం విద్యార్థులు, కార్మికులు, వ్యాపారులు, ఉద్యోగులు రాకపోకలు సాగిస్తుంటారు. పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్‌కు వచ్చే వారు సైతం వాహనాలు రోడ్లపైనే గంటల తరబడి నిలిపివేస్తున్నారు. చాలా ప్రాంతాల్లో షాపింగ్ మాల్స్‌కు పార్కింగ్ స్థలాలు లేవు. అడిగే వారు లేకపోవడంతో రోడ్లపై అడ్డంగా వాహనాలు నిలిపేస్తున్నారు. రహదారులపై చిరు వ్యాపారులు దుకాణాలు ఏర్పాటు చేస్తుండటంతో కొనుగోలుదారులు రోడ్లకు అడ్డంగా వాహనాలు నిలిపివేస్తున్నారు. దీంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ట్రాఫిక్ సమస్యకు చెక్! - ఇంజినీరింగ్ విద్యార్థుల సరికొత్త ఆవిష్కరణ - Traffic Management System
రోడ్లపైనే దుకాణాలు ఏర్పాటు : పటమట రైతుబజారు రోడ్డు, బందరు రోడ్డు, పాలీక్లినిక్ రోడ్డు వంటి చోట్ల రోడ్లపైనే అనేక మంది చిరువ్యాపారులు దుకాణాలు ఏర్పాటు చేశారు. కార్లు, ఆటోలు ప్రధాన రహదారులపై నిలిపివేయడంతో రాకపోకలు సాగించేందుకు వాహనదారులకు కష్ట తరంగా మారింది. ఇంత జరుగుతున్నా ట్రాఫిక్ పోలీసులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో 3 కిలోమీటర్లు ప్రయాణం చేయాలన్నా 20 నుంచి 30 నిమిషాల సమయం పడుతోందన్నారు. రోడ్లపై అడ్డదిడ్డంగా వాహనాలు నిలిపివేయడంతో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని వాహనాదారులు వాపోతున్నారు. ప్రభుత్వం స్పందించి ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలని వాహనదారులు, ప్రజలు కోరుతున్నారు.
పద్మవ్యూహంలా విజయవాడ ట్రాఫిక్ - సమస్య పరిష్కారానికి అధికారుల చొరవ - Traffic Problem in Vijayawada