ETV Bharat / state

ఇటు దీపావళి, అటు పెళ్లిళ్ల సీజన్ - షాపింగ్​లో అంతా బిజీబిజీ

రాష్ట్రంలో వచ్చే 3 నెలలు భారీ సంఖ్యలో పెళ్లిళ్లతో పాటు వరుసగా పండగలు - బట్టలు​, బంగారం, వివాహ సామాగ్రి అమ్మే షాపుల్లో మొదలైన షాపింగ్ సందడి - డిసెంబర్ చివరి దాకా ముహుర్తాలు

WEDDING SEASON SHOPPING
People Started Shopping for Festival & Wedding in Telangana (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : 2 hours ago

People Started Shopping for Festival & Wedding in Telangana : పెళ్లి అంటే నూరేళ్ల పంట అంటారు. అందుకే మనిషి జీవితంలో మూడు ముఖ్య ఘట్టాల్లో దీనికి ఉన్నంత ప్రాధాన్యం మరేదానికీ లేదు. స్థాయికి మించి ఖర్చు చేయడానికి వెనకాడకుండా ఆడంబరంగా చేసుకుంటారు పెళ్లిని. ముహూర్తాలు పెట్టుకున్నప్పటి నుంచి బట్టలు, బంగారం, పెళ్లి వేడుక, డెకరేషన్, క్యాటరింగ్, ఫొటో, వీడియోగ్రఫీ, అతిథులకు బస, బ్యాండు, పురోహితుని వరకు ఇలా అన్ని ఏర్పాట్లు తమకు నచ్చినట్లు ముందుగా సిద్ధం చేసుకుంటారు. వివాహం అంటేనే ప్రతి మనిషి జీవితంలో పెట్టే అతిపెద్ద ఖర్చు. ఏటేటా దీని బడ్జెట్ పెరుగుతోంది తప్ప తగ్గడం లేదు.

సౌకర్యాలు పెరిగేకొద్దీ సంతోషం పెరగాలంటే ఖర్చుకు ఏమాత్రం వెనకాడటం లేదు. అందరి ముందు గొప్ప అనిపించుకోవడానికి అప్పులు చేసేందుకు కూడా సంశయించడం లేదు మరి. దేశవ్యాప్తంగా 48 లక్షల పెళ్లిళ్లు జరుగుతాయని అంచనా. వీటి కోసం రూ.6 లక్షల కోట్లు ఖర్చు చేయనున్నట్టు కాన్ఫడరేషన్‌ ఆఫ్‌ ఆల్‌ ఇండియా ట్రేడర్స్‌ సర్వేలో వెల్లడించింది. ఇందులోని వివరాల ప్రకారం గ్రేటర్‌లో ఈ సీజన్‌లో ఐదు వేలకు పైగా పెళ్లిళ్లు జరుగుతుండగా రూ.625 కోట్లకు పైగా వ్యాపారం జరగనుంది. అక్టోబర్ రెండో వారం నుంచి డిసెంబర్ చివరి దాకా బ్రహ్మండమైన ముహుర్తాలున్నాయని అర్చకులు చెబుతున్నారు.

ముందుగానే బుక్ అయిపోతున్న ఫంక్షన్ హాల్స్ : ముహుర్తాలు లేకపోవటంతో ఈవెంట్లపైనే ఆధారపడిన డెకరేషన్, క్యాటరింగ్, ఫంక్షన్ హాల్స్, ఫొటోగ్రఫీ రంగాలు కాస్త చతికిల పడ్డాయి. ఇప్పుడు సీజన్ రావడంతో మళ్లీ వారంతా పనుల్లో తలమునకలైపోయారు. ముందుగానే ఆర్డర్లు చేజిక్కించుకుని పనులకు సమాయత్తమవుతున్నారు. దుస్తుల దుకాణాలు, నగల షాపులు కొనుగోలుదారులతో నిండిపోతున్నాయి. శ్రావణం తర్వాత ముహూర్తాలు రావడంతో ఫంక్షన్ హాల్స్ అన్నీ ముందుగానే బుక్ అయిపోయాయి.

ఈ కొద్ది రోజులే తమకు కాస్త డబ్బులు లభిస్తాయని, కానీ ఈ ఏడాది వ్యాపారం కాస్త తక్కువగానే జరుగుతోందని ఫంక్షన్ హాల్ నిర్వాహకులు అంటున్నారు. వేడుక ఏదైనా సరే పూలకు చాలా ప్రత్యేక స్థానం ఉంటుంది. వివాహంలో జరిపే పూజల నుంచి పెళ్లి కుమార్తె పూల జడ వరకు కూడా వాటి అవసరం అధికంగా ఉంటుంది. నగరంలో సాధారణ సమయాల్లో కంటే పెళ్లిళ్ల సమయంలో ఆర్డర్లు కాస్త ఎక్కువగా వస్తాయని వ్యాపారులు అంటున్నారు. పెళ్లి అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేవి కొత్త బట్టలు, బంగారు నగలు.

మార్కెట్​లో రోజూ ప్రత్యేక పూలు : బడ్జెట్​లో బంగారంపై సుంకాన్ని తగ్గించినప్పటికీ ప్రస్తుతం పసిడి రేటు ఏ మాత్రం తగ్గకుండా కొండెక్కి కూర్చుంది. ధర ఎంత ఉన్నా సరే తప్పనిసరి అవసరం కావటంతో కొనుగోళ్లు చేస్తున్నారని వ్యాపారులు అంటున్నారు. ధర కాస్త తగ్గి ఉంటే అమ్మకాలు మరింత పెరిగేవని వారు అంటున్నారు. పెళ్లిళ్ల సీజన్​కు తోడు కార్తికం కూడా కావడంతో ఈ మాసంలో పూజలు, వ్రతాలు ఎక్కువగా చేస్తారు. ఇందుకోసం ఈ సమయానికి వచ్చేలా అలంకరణ కోసం రైతులు ప్రత్యేక పూలను రోజూ మార్కెట్​కు తెస్తున్నారు.

ఓ మై గాడ్‌ షాపింగ్‌ ఇంత ఈజీనా? - ఇంటి ముందుకే ‘ఫ్యాషన్‌ ట్రక్స్‌’ - ఫీచర్స్​ మామూలుగా లేవుగా!

దీపావళి షాపింగ్ చేయాలా? ఈ 6 స్మార్ట్‌ టిప్స్‌తో - బోలెడు డబ్బులు ఆదా చేసుకోండిలా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.