Post Offices Rush At Andhra pradesh: కర్నూలు, రాజమహేంద్రవరం బ్యాంకుల్లో ఇప్పటివరకూ పొదుపు ఖాతాలు లేని వారు, ఆధార్ అనుసంధానం చేయక ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందుకోలేకపోతున్న వారి సమీప తపాలా కార్యాలయాల్లో ఖాతాలు తెరవాలన్న అధికారుల మౌఖిక ఆదేశాలతో మహిళలు పెద్ద సంఖ్యలో పోస్టాఫీసులకు వెళ్తున్నారు. ఇది వరకే తపాలా కార్యాలయాల్లో అకౌెెంటు ఉండి ఉంటే జాతీయ చెల్లింపుల సంస్థ (ఎన్‌పీసీఐ)తో సైతం అనుసంధానం చేసుకోవాలనే సూచనతోనూ కార్యాలయాలకు పోటెత్తుతున్నారు. ఈ విషయంలో కొందరు చేస్తున్న దుష్ప్రచారం కారణంగా ఇప్పటికే బ్యాంకుల్లో ఖాతాలున్న వారూ పోస్టాఫీసుల్లో ఖాతాలు తెరిచేందుకు పోటీ పడుతున్నారు.
కర్నూలు, రాజమహేంద్రవరం పోస్టాఫీసుల్లో కిక్కిరిసిన జనం: గురువారం రాజమహేంద్రవరంలోని ప్రధాన తపాలా కార్యాలయం ఎదుట మహిళలు పెద్దసంఖ్యలో బారులు తీరారు. కర్నూలులోనూ ఇదే పరిస్థితి. ఇప్పటికే బ్యాంకుల్లో ఖాతాలు ఉండీ సంక్షేమ పథకాల కింద సాయం అందుకుంటున్న వారు సైతం మళ్లీ కొత్తగా రావడం గమనార్హం. పోస్టాఫీసుల్లో ఖాతాలు తెరవాల్సిన అవసరం లేదని వారికి అధికారులు నచ్చజెప్పి చెప్పి పంపించే ప్రయత్నం చేస్తున్నారు.
ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలా? అయితే ఈ 4 రిస్క్‌లు గురించి తెలుసుకోండి! - Risks In Fixed Deposits