Pawan Kalyan allegations: ఆత్మగౌరవం ఉన్నవారు ఎవరైనా సరే దాస్యం చేయలేక వైసీపీ నుంచి బయటకి వస్తున్నారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. యార్లగడ్డ వెంకట్రావ్, వల్లభనేని బాలశౌరి అందుకే వైసీపీకి దూరమయ్యారని తెలిపారు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం హనుమాన్ జంక్షన్‌లో జరిగిన బహిరంగ సభలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మాట్లాడారు. మచిలీపట్నంలో జనసేన కార్యకర్తపై దాడి జరిగితే బాలశౌరి స్పందించిన తీరు అభినందనీయమన్నారు.
వల్లభనేని వంశీ వివేకం ఉన్న నాయకుడు అనుకున్నానన్న పవన్‌కళ్యాణ్, రాజకీయాల్లో నాయకుల మధ్య విభేదాలు వుంటాయి, విమర్శలు కూడా సహేతుకంగా ఉండాలి కానీ దిగజారి బూతులు తిట్టకూడదని అన్నారు. ఎన్టీఆర్ కుమార్తె గురించి అసెంబ్లీలో వల్లభనేని వంశీ ఆ విధంగా మాట్లాడటం బాధ కలిగించిందన్నారు. భువనేశ్వరిని అంటే తన తోబుట్టువును అనట్లేనని అన్నారు. వంశీకి జనసేన మద్దతుదారులు ఓటు వేస్తే మహిళలను కించపరిచే వారికి మద్దతు ఇచ్చినట్లేనని పవన్‌కళ్యాణ్ అన్నారు. ఓడిపోయిన తరువాత యార్లగడ్డ అమెరికా వెళ్లిపోవచ్చు కానీ ప్రజలకూ అండగా ఉండాలని ఇక్కడే వుంటున్నారని తెలిపారు. విపక్షాల కుటుంబసభ్యులను తిట్టలేకే యార్లగడ్డ వైసీపీ నుంచి బయటకి వచ్చారన్నారు.
స్థానిక ఎమ్మెల్యే బ్రహ్మ లింగ చెరువు మట్టిని తోడేసుకున్నారని ఆరోపించారు. ప్రజాహితం కోసం జనసేన మద్దతుదారులు వంశీ మాయలో పడొద్దు, వంశీ డబ్బుకు లొంగొద్దని కోరారు. పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగిన వ్యక్తిని దుర్గగుడి చైర్మన్ చేశారని విమర్శించారు. వెండి సింహాలు పోతే వాటితో మిద్దెలు మేడలు కట్టుకుంటారా అని వైసీపీ నాయకులు ఎగతాళి చేశారని మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 40 ఏళ్ల పార్టీ అయినా తెదేపా నాయకులను కూడా అధికార పార్టీ నామినేషన్ వేయనివ్వలేదని అన్నారు. ఇప్పుడు అధికారులను బదిలీ చేస్తున్నారని జగన్ అంటున్నారన్నారు. మల్లవల్లి పారిశ్రామిక వాడకు భూములు ఇచ్చినా రైతులకు న్యాయం చేస్తామని తెలిపారు. గన్నవరం విమానాశ్రయం బాధితులకు కూడా నష్టపరిహారం అందించేలా బాధ్యత తీసుకుంటామన్నారు. భయపెట్టే వారు కావాలా, సంస్కారం వున్న యార్లగడ్డ కావాలో ప్రజలు ఆలోచించాలని పవన్‌కళ్యాణ్ అన్నారు.
'క్లాస్ వార్ అంటూ ఊదరగొట్టే సీఎం జగన్, చదువుకున్న యువకులకు మద్యం దుకాణాల్లో ఉద్యోగాలు ఇచ్చారు. ప్రజాహితం కోరుకునే జనసేన మద్దతుదారులు వంశీ మాయలో పడొద్దు. వంశీ ఇచ్చే డబ్బుకు లొంగొద్దు. మల్లవల్లి పారిశ్రామికవాడకు భూములు ఇచ్చిన రైతులకు ప్రజలను భయపెట్టే వారు కావాలో, యార్లగడ్డ లాంటి సంస్కారవంతుడు కావాలో నిర్ణయించుకోవాలి. సంక్షేమంతోపాటు రాష్ట్రం అభివృద్ధి చెందేలా పాలన అందిస్తాం.'- పవన్ కల్యాణ్, జనసేన అధినేత
దేశంలో అమృత ఘడియలు ఉంటే ఏపీలో విషఘడియలు ఉన్నాయి: పవన్ కల్యాణ్ - Alliance Public Meeting