ETV Bharat / state

సోషల్ మీడియాలో ఆ పోస్టులు చూసి నా బిడ్డలు కంటతడి పెట్టారు : పవన్ కల్యాణ్ - AP CABINET MEETING

సామాజిక మాధ్యమాల్లో చెలరేగిపోతున్న వైఎస్సార్సీపీ మద్దతుదారులు - మంత్రివర్గ సమావేశంలో పవన్‌ కల్యాణ్‌ ఆవేదన

AP Cabinet Meeting
AP Cabinet Meeting (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 7, 2024, 7:06 AM IST

AP Cabinet Meeting : ప్రభుత్వంలోని ముఖ్య నేతలను, వారి ఇంట్లో ఆడపిల్లలను, మహిళలను కించపరిచేలా వైఎస్సార్సీపీ నాయకులు, మద్దతుదారులు సోషల్ మీడియాలో అసభ్యంగా పోస్టులు పెడుతున్న తీరుపై కేబినెట్ మండిపడింది. వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ పోస్టులు పెడుతున్న వారిపై చర్యలు తీసుకోకుండా పోలీసు అధికారులు నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నారని ఈ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సహా పలువురు మంత్రులు ఈ అంశంపై గట్టిగా స్పందించారు. కొందరు ఎస్పీలు, డీఎస్పీలు మంత్రుల మాటలనూ బేఖాతరు చేస్తున్నారని కొందరు ఫిర్యాదు చేశారు.

దీనిపై ముఖ్యమంత్రి స్పందిస్తూ ‘మంచితనాన్ని చేతగానితనం అనుకుంటే ఉపేక్షించేది లేదు. కఠినంగా వ్యవహరిద్దాం. నెలలో మొత్తం పోలీసు వ్యవస్థను గాడిలో పెడదాం’ అని తెలిపారు. సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టుల అంశాన్ని మొదట ముఖ్యమంత్రే ప్రస్తావించారు. కేబినెట్ సమావేశానికి పవన్‌ రావడం ఐదారు నిమిషాలు ఆలస్యమవడంతో ఆలోగా మిగతా అంశాలు మాట్లాడదామంటూ సామాజిక మాధ్యమాల్లో వైఎస్సార్సీపీ చెలరేగిపోతున్న తీరును చంద్రబాబు ప్రస్తావించారు. ‘నాతో సహా, క్రియాశీల నేతలు, శ్రేణుల మనోస్థైర్యాన్ని దెబ్బతీసేలా అభ్యంతరకర పోస్టులు పెడుతున్నారు. నీచంగా వ్యవహరిస్తున్నారు. హోంమంత్రి అనిత కూడా బాధితురాలే. ఫేక్‌పోస్టుల వ్యవహారం న్యూసెన్స్‌గా మారింది. గతంలో లేని విషసంస్కృతి వ్యాపించింది. దొంగ ఐపీలతో పోస్టులు పెట్టి తప్పించుకుంటున్నారు’ అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

Pawan Kalyan on Social Media Posts : అంతలో సమావేశ మందిరంలోకి వచ్చిన పవన్‌ కల్యాణ్‌ చర్చను కొనసాగిస్తూ తన కుమార్తెలపై అభ్యంతరకర పోస్టులు పెట్టారని, వారు చూసి కన్నీరు పెట్టడం తనను తీవ్రంగా కలచివేసిందని ఆవేదన చెందారు. ఇంట్లోంచి బయటకు రావడానికి ఇబ్బంది పడుతుంటే తట్టుకోలేకపోయానని ఆయన పేర్కొన్నారు. లోకేశ్‌ కుటుంబ సభ్యులపైనా అసభ్యంగా పోస్టులు పెట్టారని తెలిపారు. ఇటీవల కొన్ని ఘటనల్లో మహిళలు, బాలికలపై అత్యాచారం జరిగిందంటూ సోషల్ మీడియాలో దుష్ప్రచారమైనా పోలీసులు సత్వరం స్పందించి బాధ్యులపై చర్యలు చేపట్టకపోవడంపై మంత్రిమండలి అసంతృప్తి వ్యక్తం చేసింది.

మంచి చేయమన్నా పట్టించుకోవడం లేదు : కొందరు పోలీసుల తీరుపై పవన్‌ కల్యాణ్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘పోలీసు వ్యవస్థ అత్యంత నిర్లిప్తంగా వ్యవహరిస్తోంది. గత సర్కార్​లో ఒక దుర్మార్గుడు చెబితే చట్టాన్ని పక్కనబెట్టి మరీ పోలీసులు అరాచకాలన్నీ చేశారు. మనం ప్రజాస్వామ్యయుతంగా, చట్టప్రకారం పనిచేయమన్నా ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసు శాఖలో కొందరు అవినీతి అధికారులున్నారని, వారు అడ్డగోలుగా పనిచేస్తున్నారని ప్రస్తావించారు. కొన్ని కేసులపై ఎస్పీలు సీరియస్‌గా స్పందించడం లేదని, సరైన ఫీడ్‌ బ్యాక్‌ ఇవ్వడం లేదని పవన్ కల్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేశారు.

గత ప్రభుత్వంలో వైఎస్సార్సీపీ పెద్దలకు వత్తాసు పలికిన కొందరు అధికారులు ఇప్పటికీ కీలక పోస్టుల్లో కొనసాగుతున్నారని మంత్రులు తెలిపారు. వైఎస్సార్సీపీ నేతల అరాచకాలపై ఫోన్‌ చేసి చెప్పినా కొందరు ఎస్పీలు స్పందించడం లేదని, కిందిస్థాయి వారిపై నెపాన్ని నెట్టేసి తప్పించుకుంటున్నారని ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. చంద్రబాబును అన్యాయంగా జైల్లో పెట్టినప్పుడు నిరసన వ్యక్తం చేస్తున్న కార్యకర్తలపై దుర్మార్గంగా లాఠీఛార్జి చేసిన పోలీసు అధికారి ఇప్పుడు మంచి పోస్టులో ఉన్నారని మంత్రి నాదెండ్ల మనోహర్‌ వివరించారు. ఒకటి రెండు సంఘటనలు చూశాకైనా వారిపై చర్యలు చేపట్టకపోతే వ్యవస్థ గాడిన పడదని వెల్లడించారు.

ఇంఛార్జ్​ మంత్రులూ స్పందించాలి :

వైఎస్సార్సీపీ సర్కార్ నిర్వాకం వల్లే కొందరు పోలీసులు గాడితప్పారని, ఆ ధోరణి నుంచి వారింకా బయటపడటం లేదని చంద్రబాబు తెలిపారు. పోలీసుల నిర్లిప్తతపై ఇంఛార్జ్​ మంత్రుల దృష్టికి వచ్చినప్పుడు వారూ వెంటనే స్పందించాలని ఆదేశాలిచ్చారు.

  • విశాఖలోని రుషికొండలో రూ. 450 కోట్ల ప్రజాధనాన్ని వెచ్చించి గత సర్కార్ నిర్మించిన విలాసవంతమైన ప్యాలెస్‌లను ఏం చేయాలన్న అంశంపై కేబినెట్​లో చర్చించారు.
  • 2014-19 మధ్య టీడీపీ హయాంలో జరిగిన ఉపాధి హామీ, నీరు-చెట్టు పనుల పెండింగ్‌ బిల్లుల్ని 12 శాతం వడ్డీతో సత్వరం చెల్లించాలని ముఖ్యమంత్రి ఆదేశాలిచ్చారు.

పిఠాపురం ఏరియా డెవలప్‌మెంట్‌ అథారిటీ పేరుపై చర్చ : పిఠాపురం ఏరియా డెవలప్‌మెంట్‌ అథారిటీ ఏర్పాటు ప్రతిపాదనపై కేబినెట్​లో ఆసక్తికర చర్చ జరిగింది. దాని సంక్షిప్తనామం పులివెందుల ఏరియా డెవలప్‌మెంట్‌ అథారిటీ సంక్షిప్త నామం ‘పాడా’ అనే వస్తుందని, అది గందరగోళానికి దారితీస్తుందన్న అభిప్రాయం వ్యక్తమైంది. అప్పుడు పిఠాపురం స్పెల్లింగ్‌ ప్రకారం ‘పీడా’ అని పేరు పెడదామా? అన్న ప్రతిపాదన వచ్చినప్పుడు ఆ పేరు బాలేదని పవన్‌ అభ్యంతరం తెలిపారు. అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఆఫ్‌ పిఠాపురం అని పేరు పెడదామని అధికారులు సూచనలు చేశారు.

డ్రోన్ పాలసీకి కేబినెట్ ఆమోదం - 1000 కోట్ల పెట్టుబడుల సాధనే లక్ష్యం

ఉచిత ఇసుక విధానంపై ఫిర్యాదులు - చంద్రబాబు ఆగ్రహం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.