Pawan Kalyan Varahi Bus Yatra: అనకాపల్లి జిల్లా ఎలమంచిలిలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి బస్సు యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పవన్ మాట్లాడారు. జగన్‌కు ఇచ్చిన ఒక్క ఛాన్స్ ఇక చాలు, ఒక్క ఛాన్స్ ఇస్తే రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో మీకు మీరు ఛాన్స్ ఇచ్చుకోండని కోరారు.
వైసీపీ ప్రభుత్వంలో హక్కుల కోసం పోరాడితే ప్రజలపై కేసులు పెడతారని మండిపడ్డారు. ఫీజు రీఎంబర్స్‌మెంట్ రాలేదని అడిగితే కొట్టారని గుర్తుచేశారు. కన్నబాబును కన్నాల బాబుగా అభివర్ణించిన పవన్ కల్యాణ్, కన్నబాబు లేఅవుట్‌లు వేసి భూములు కబ్జా చేస్తున్నారని మండిపడ్డారు. గొప్ప రాజ్యాంగం ఉన్నా పాలించే వ్యక్తి సరిగా లేకపోతే న్యాయం జరగదని పేర్కొన్నారు. సగటు మనిషిలా ఉండేదుకు జనసేన పార్టీ పెట్టలేదని, సగటు మనిషి కోసం ప్రాణాలు తెగించడానికి సిద్ధంగా ఉన్నాని పవన్ వెల్లడించారు.
నయవంచకుడిపై పోటీ చేసేందుకు ప్రజల గళమై వచ్చినట్లు పవన్ తెలిపారు. తాను సీఎం అవుతానో లేదో కాలం నిర్ణయించాలన్న పవన్, ప్రజల కోసం ముఠా కూలీలా పనిచేస్తానని పేర్కొన్నారు. మానవహక్కుల ఉల్లంఘన జరిగితే పోరాడుతానని వెల్లడించారు. యువతకు నైపుణ్య శిక్షణ అందించి ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలో తొలిసారి నైపుణ్య గణాంకాలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. తద్వారా యువతలో ఉన్న నైపుణ్యాల మేరకు శిక్షణ అందిస్తామని పేర్కొన్నారు.
ల్యాండ్ టైటిల్ యాక్ట్‌తో జగన్ ప్రజల ఆస్తుల్ని కాజేస్తారు: పవన్ కల్యాణ్ - Pawan Kalyan fired on CM Jagan
అంతకు ముందు మండపేట వారాహి సభలో పాల్గొన్న పవన్, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే వ్యవసాయానికి 9 గంటల ఉచిత్ విద్యుత్ ఇస్తామన్నారు. వ్యవసాయ పరికరాలు సబ్సిడీపై అందిస్తామని పేర్కొన్నారు. ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని తెలిపారు. కౌలు రైతులకు గుర్తింపుకార్డులు అందజేస్తాం, సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తామని పవన్ హామీ ఇచ్చారు. దళారుల దోపిడీ అరికట్టేందుకు అన్నిరకాల చర్యలను తీసుకుంటామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు కల్పిస్తామని వెల్లడించారు. ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలను అరికడతామన్నారు. ఇప్పుడు అన్నం పెట్టే రైతు లాభాల్లో లేరన్న పవన్, గంజాయి పండించే వైసీపీ నాయకులు లాభాల్లో ఉన్నారని మండిపడ్డారు. రైతు కష్టాలు తీర్చడానికి ఏ వ్యవస్థ ముందుకు రావట్లేదు, రైతులకు మేలు చేయాలనేదే కూటమి పార్టీల లక్ష్యమన్నారు.
తాను మాట ఇచ్చానంటే దానికి కట్టుబడి ఉంటానన్న పవన్, దశాబ్దం నుంచి తనను చాలారకాలుగా ఇబ్బందిపెట్టారని తెలిపారు. ప్రజా సంక్షేమం కోసం ఎన్ని ఇబ్బందులైనా ఎదుర్కొంటానని తెలిపారు. జగన్ పాలన నుంచి ఏపీకి విముక్తి కల్పించాలన్నదే బలమైన లక్ష్యమని పవన్ వెల్లడించారు.
తెలుగోడి గుండె రగిలేలా - చిన్నమ్మ మీద అదిరిపోయే సాంగ్ - Song Release for Purandeswari