ETV Bharat / state

బీఆర్​ఎస్​కు మరో షాక్​ తప్పదా - కాంగ్రెస్​లోకి బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే మహిపాల్​ రెడ్డి? - Mahipal Reddy will join Congress - MAHIPAL REDDY WILL JOIN CONGRESS

Big Shock to BRS MLA Mahipal Reddy will join Congress : బీఆర్​ఎస్​ పటాన్​చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్​ రెడ్డి సీఎం రేవంత్​ రెడ్డి నివాసానికి వెళ్లారు. దీంతో త్వరలో ఎమ్మెల్యే మహిపాల్​ పాల్​ రెడ్డి కూడా కాంగ్రెస్​ చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

BRS MLA Mahipal Reddy will join the Congress
BRS MLA Mahipal Reddy will join the Congress (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jul 13, 2024, 8:48 PM IST

Updated : Jul 13, 2024, 10:07 PM IST

BRS MLA Mahipal Reddy will join the Congress : బీఆర్​ఎస్​ పార్టీకి వరుస షాక్​లు మీద షాక్​లు తగులుతున్నాయి. ఇప్పటికే తొమ్మిది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్​ తీర్థం పుచ్చుకున్నారు. తాజాగా బీఆర్​ఎస్​ పటాన్​చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్​ రెడ్డి సీఎం రేవంత్​ రెడ్డి నివాసానికి వెళ్లారు. దీంతో త్వరలో ఎమ్మెల్యే మహిపాల్​ పాల్​ రెడ్డి కూడా కాంగ్రెస్​ చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

మహిపాల్​ రెడ్డి 2014 నుంచి మూడుసార్లు వరుసగా బీఆర్​ఎస్​ తరఫున గెలిచారు. ఇప్పటికే బీఆర్​ఎస్​ నుంచి దానం నాగేందర్​, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్​ రెడ్డి, సంజయ్​ కుమార్​, కాలె యాదయ్య, కృష్ణమోహన్​ రెడ్డి, ప్రకాశ్​గౌడ్​, అరికెపూడి గాంధీ కాంగ్రెస్​లో చేరారు. మరికొందరు ముఖ్యంగా గ్రేటర్​ హైదరాబాద్​ నుంచి పలువురు త్వరలో కాంగ్రెస్​లో చేరనున్నట్లు విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో మహిపాల్​ రెడ్డి సీఎంను కలవడంతో రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది.

ముందుగా ఖైరతాబాద్​ ఎమ్మెల్యే దానం నాగేందర్​ ఎన్నికల ఫలితాలు వచ్చిన మూడు నెలలు తర్వాత కాంగ్రెస్​ గూటికి చేరారు. అనంతరం ఆయనను సికింద్రాబాద్​ పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ దించారు. అయితే ఆ ఎన్నికల్లో బీఆర్​ఎస్​ అభ్యర్థి కిషన్​రెడ్డి చేతిలో ఓటమి పాలైయ్యారు. గ్రేటర్​ హైదరాబాద్​ పరిధిలో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్​ పార్టీకి ఒక్కసీటు కూడా దక్కలేదు. దీంతో అక్కడ తన బలాన్ని పెంచుకోవడానికి గ్రేటర్​ హైదరాబాద్​ ఎమ్మెల్యేలను కాంగ్రెస్​లోకి ఆహ్వానిస్తోంది.

దానం తరువాత భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఎన్నికల ఫలితాలు తర్వాత బీఆర్​ఎస్​ పార్టీకి దూరమై కాంగ్రెస్​ పార్టీలో చేరారు. పార్లమెంటు ఎన్నికల ముందు స్టేషన్​ ఘన్​పూర్​ ఎమ్మెల్యే కడియం శ్రీహరి హస్తం పార్టీలో చేరి తన కుమార్తె కడియం కావ్యకు వరంగల్​ టికెట్​ను దక్కించుకున్నారు. అనంతరం ఆమె అక్కడ ఎంపీగా పోటీ చేసి భారీ మెజార్టీతో గెలిపించారు. ఆతర్వాత మాజీ స్పీకర్​ పోచారం శ్రీనివాస్​ రెడ్డి కాంగ్రెస్​ తీర్థం పుచ్చుకున్నారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్​కుమార్​ సీఎం రేవంత్​ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్​లో చేరారు.

29కి పడిపోయిన బీఆర్​ఎస్​ బలం : చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య దిల్లీ వెళ్లి సీఎం రేవంత్​ సమక్షంలో కాంగ్రెస్​ పార్టీలో చేరారు. ఆతర్వాత గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్​ రెడ్డి, రాజేంద్రనగర్​ ఎమ్మెల్యే ప్రకాశ్​ గౌడ్​, ఇవాళ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ కాంగ్రెస్​ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పటివరకు తొమ్మిది మంది బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలు కాంగ్రెస్​ గూటికి చేరుకుని బీఆర్​ఎస్​కు గట్టి షాక్​ ఇచ్చారు. వీరందరిని కలుపుకొని కాంగ్రెస్​ బలం 74కి పెరిగింది. సీపీఐతో కలిపి 75కు చేరుకుంది. బీఆర్​ఎస్​ బలం 29కి పడిపోయింది. అసెంబ్లీలో బీజేపీకి 8 మంది, ఎంఐఎం పార్టీకి 7 మంది ఎమ్మెల్యేలు సభ్యులు ఉన్నారు.

కేసీఆర్​కు భారీ షాక్​ - కాంగ్రెస్​ గూటికి ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు - 6 BRS MLCs JOINED CONGRESS

బీఆర్​ఎస్​కు మరో షాక్​ - కాంగ్రెస్​లో చేరిన చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య - BRS MLA Kale Yadaiah join Congress

Last Updated : Jul 13, 2024, 10:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.