Lack of Facilities in Vijayawada RTC Bus Stand : ఆర్టీసీ బస్టాండ్‌లు అంటేనే అమ్మో అనే స్థాయి నుంచి అహా అనే స్థాయికి గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తీసుకొచ్చింది. ముఖ్యంగా విజయవాడ బస్టాండ్ (Pandit Nehru Bus Station) ను సమూలంగా మార్చేసింది. విమానాశ్రయ తరహా సౌకర్యాలను ఏర్పాటు చేసింది. మరుగుదొడ్ల ఆధునీకరణ నుంచి ఆర్వో వాటర్‌తో పాటు ప్రయాణికులు వేచి ఉండే ప్రాంతంలో అత్యాధునికంగా కనిపించేలా బెంచీలు ఏర్పాటు చేసింది.
Passengers Facing Problems in YSRCP Government : ప్రయాణికులకు బోర్ కొట్టకుండా పెద్దపెద్ద స్కీన్‌లతో టీవీలు పెట్టారు. ఫ్యాన్లు ఏర్పాటు చేశారు. ఏ బస్సు ఎక్కడ ఆగుతుందో తెలిపేలా సైన్‌బోర్డులు, ఛార్జీంగ్ పాయింట్లు ఏర్పాటు చేశారు. మిలమిల మెరెసేలా గ్రానైట్ రాళ్లతో ప్లోరింగ్, గోడలకు నగిషీలు అద్దారు. అప్పట్లో ఇది బస్టాండా లేక విమానాశ్రయమా అని పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. అలాగే బస్టాండ్ ఆవరణలోనే ఏకంగా సినిమా ధియేటర్లు సైతం నిర్మించారు.
Rain Water in Gudiwada bus stand: చెరువులా గుడివాడ బస్టాండ్.. ప్రయాణికులకు ఇబ్బందులు
అప్పుడు అలా - ఇప్పుడు ఇలా : గతమెంతో ఘనమన్నట్లు ఇప్పుడు పరిస్థితులన్నీ మారిపోయాయి. వైఎస్సార్సీపీ ఐదేళ్ల పాలనలో బస్టాండ్ నిర్వహణ గాలికొదిలేశారు. దీంతో మళ్లీ పాత పరిస్థితులు కళ్లముందు కనిపిస్తున్నాయి. కొత్త సదుపాయాల మాట దేవుడెరుగు అంతకు ముందు ప్రభుత్వం కల్పించిన సదుపాయాలను సైతం కొనసాగించలేకపోయింది. బస్టాండ్ల అభివృద్ధి, సదుపాయాల కల్పన కోసం ప్రయాణికుల నుంచి టికెట్‌పై రూపాయి చొప్పున డెవలప్ మెంట్ సెస్ వసూలు చేసిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆ నిధులనూ దారి మళ్లించింది.
ఫలితంగా నిర్వహణకు సరిపడా నిధులు లేక బస్టాండ్లు సమస్యల నిలయాలుగా మారాయి. విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్ల తరహాలో బస్సుల రాకపోకలు తెలిపేలా సమాచారం కేంద్రం, రిజర్వేషన్ కౌంటర్ల వద్ద ప్రత్యేక ఎల్ఈడీ డిస్‌ప్లే బోర్డులు గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేశారు. కనీసం వీటికి మరమ్మతులు చేయించలేక పక్కన పెట్టేశారు. బస్సుల రాకపోకల ఖచ్చిత సమాచారం తెలుసుకునేందుకు రైల్వేస్టేషన్ల తరహాలో కియోస్క్ యంత్రాలు ఏర్పాటు చేయగా వాటినీ కనుమరుగు చేశారు. ఐదేళ్లలో ఒక్క డిస్‌ప్లే బోర్డు సైతం తిరిగి ఏర్పాటు చేయలేదు. బస్టాండ్ ఆవరణలో ధియేటర్లు సైతం మూతబడ్డాయి.
శిథిలావస్థకు చేరిన బద్వేల్ బస్టాండ్ - ప్రజల ప్రాణాలతో ఆర్టీసీ చెలగాటం - Dilapidated RTC bus Stand
చీకటి పడితే గంజాయి బ్యాచ్‌లు హల్‌చల్ : ప్రయాణికుల భద్రత కోసం ఏర్పాటు చేసిన ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బందిని సైతం వైఎస్సార్సీపీ ప్రభుత్వం తొలగించింది. దీంతో చీకటి పడితే చాలు గంజాయి బ్యాచ్‌లు హల్‌చల్ చేస్తున్నాయి. తాగునీరు అందించే కుళాయి వద్ద అపరిశుభ్రత నెలకొంది. సెల్‌ఫోన్ ఛార్జింగ్ కేంద్రాలను సైతం తొలగించేశారు. ఆటోమేటిక్ క్లీనింగ్ యంత్రాలు సైతం మూలనపడేయడంతో బస్టాండ్ ఆవరణలో చెత్తా చెదారం పేరుకుపోతోంది. కొత్త ప్రభుత్వమైనా మళ్లీ బస్టాండ్ నిర్వహణ బాధ్యత పట్టించుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.
డొక్కు బస్సులతో ప్రయాణికుల ఇక్కట్లు - శిక్ష డ్రైవర్కా! - RTC Bus Rain Driver