ETV Bharat / state

అధికారులు అప్రమత్తంగా ఉండాలి - ఆదేశించిన కలెక్టర్​ - Collectors Visit Hospital in ap

Parvathipuram Shyam Pprasad Visit Hospital: రాష్ట్రంలో భారీ వర్షాలతో అధికారులు అప్రమత్తం అయ్యారు. పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ శ్యాం ప్రసాద్ పాలకొండ ఆసుపత్రిని సందర్శించారు. వర్షాలు అధికంగా కురవడంతో ప్రజలు వివిధ రకాల వ్యాధుల బారిన పడే అవకాశాలు ఉండటంతో ఆసుపత్రి పరిసరాలను పరిశీలించారు. జిల్లాలోని గుమ్మలక్ష్మీపురం మండలంలో జ్వరంతో తొమ్మిదేళ్ల బాలుడు మృతి చెందారు.

Parvathipuram Shyam Pprasad Collector Visit Hospital
Parvathipuram Shyam Pprasad Collector Visit Hospital (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 21, 2024, 6:04 PM IST

Parvathipuram Shyam Pprasad Collector Visit Hospital : పార్వతీపురం మన్యం జిల్లాలో వరుసగా కురుస్తున్న వర్షాలతో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, వ్యాధులు ప్రబలకుండా క్షేత్రస్థాయిలో పూర్తి చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ శ్యాం ప్రసాద్ ఆదేశించారు. పాలకొండలో ఆదివారం ప్రత్యేకంగా పర్యటించారు. వాతావరణ శాఖ హెచ్చరికల మేరకు జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడమే కాకుండా అన్ని శాఖలు తమ పరిధిలో అవసరం మేరకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

వర్షాలు అధికంగా కురవడంతో ప్రజలు వివిధ రకాల వ్యాధుల బారిన పడే అవకాశాలు ఉండటంతో ఆసుపత్రులలో సేవల పరిస్థితిని పరిశీలించారు. నాగావళిలో ప్రవాహం సాధారణ స్థాయిలో ఉందని అయితే ఎప్పటికప్పుడు గమనిస్తూ అవసరమైతే ప్రజలను అప్రమత్తం చేయాలని రెవెన్యూ అధికారులను సూచించారు. కాలానుగుణంగా వ్యాధులు ప్రబలే అవకాశాలు ఉన్న దృష్ట్యా వైద్య విభాగం పూర్తి సామర్థ్యంతో పని చేయాలని సూచించారు.

పాలకొండ ఏరియా ఆసుపత్రి, అన్నవరం ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసి వైద్యులు, చికిత్స పొందుతున్న రోగులతో కలెక్టర్ మాట్లాడారు. అందుతున్న వైద్య సేవల పట్ల ఆరా తీశారు. వచ్చే ప్రజలకు మంచి వైద్య సేవలు అందించాలని ఆయన అన్నారు. అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచాలని ఆయన స్పష్టం చేశారు. వర్షాకాలంలో పాము కాటు వంటి అంశాలు పలు చోట్ల సంభవిస్తాయని వాటికి తక్షణమే చికిత్స చేయాలని, ఆసుపత్రికి వచ్చే రోగులకు పడకలు సాధ్యమైనంత మేర ఏర్పాటు చేయాలని, మందులు సిద్ధంగా ఉంచాలని ఆయన ఆదేశించారు.

40.8 అడుగులకు గోదావరి నీటిమట్టం - కాసేపట్లో ఫస్ట్ వార్నింగ్ - ముంపు గ్రామాలకు అలర్ట్ - GODAVARI WATER LEVEL TODAY NEWS

గర్భిణీ స్త్రీలకు ప్రత్యేక శ్రద్ధతో వైద్య సేవలు అందించాలని కలెక్టర్ సూచించారు. హైరిస్క్ కేసులను గుర్తించి తగిన సూచనలు, సలహాలు అందించాలని ఆయన స్పష్టం చేశారు. ఆసుపత్రిలో ప్రసవాలు జరగాలని కలెక్టర్ అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో పరికరాలు అన్ని అందుబాటులో ఉన్నాయని, వైద్య నిపుణులు ఉన్నారని వారి సేవలతో ప్రసవాలు పెంచాలని అన్నారు. ఇతర ఆసుపత్రులకు రిఫరల్ కేసులు తగ్గించాలని సూచించారు. ఏరియా ఆసుపత్రిపై ఎక్కువ భారం పడకుండా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో వైద్య సేవలు బలోపేతం చేయాలని, మంచి సేవలు అందించడం వల్ల ఇది సాధ్యపడుతుందని కలెక్టర్ అన్నారు. ఈ సందర్భంగా ఆహార నాణ్యతను పరిశీలించారు

జ్వరంతో తొమ్మిదేళ్ల బాలుడు మృతి : జిల్లాలోని గుమ్మలక్ష్మీపురం మండలం వంగర గిరిజన గ్రామంలో జ్వరంతో తొమ్మిదేళ్ల బాలుడు మృతి చెందారు. రెండు రోజుల క్రితం జ్వరం రావడంతో తాడికొండ పీహెచ్సీలో జాయిన్ చేశామని, పరీక్షలు నిర్వహించి శనివారం రాత్రి ఇంటికి తీసుకొని రాగా జ్వరం తీవ్రత ఎక్కువ అవడంతో మృతి చెందారని కుటుంబ సభ్యులు తెలిపారు. బాలుడు 4వ తరగతి చదువుతున్నాడని తెలిపారు. ఏజెన్సీలో జ్వరాలు ఎక్కువగా ఉన్నందున ప్రభుత్వం స్పందించి ప్రతి గ్రామంలో మెడికల్ క్యాంపులు నిర్వహించాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.

కురుస్తున్న వర్షాలు - వణికిపోతున్న గోదావరి పరివాహక ప్రాంతాలు - Rains Effect in Joint East Godavari

AP RAINS UPDATES : గోదావరిలో క్రమంగా పెరుగుతున్న వరద ప్రవాహం - Flood Effect in Andhra Pradesh

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.