ETV Bharat / state

లోక్​సభ ఎన్నికల్లో సత్తా చాటేందుకు సమాయత్తమవుతున్న ప్రధాన పార్టీలు - లోక్​ సభ ఎన్నికలు 2024

Parties Focus On Lok Sabha Elections : లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటేందుకు పార్టీలు సమాయత్తమవుతున్నాయి. అసెంబ్లీ పోరులో అధిక సీట్లు సాధించి అధికారం చేపట్టిన కాంగ్రెస్‌ పార్లమెంట్‌ సమరంలో విజయఢంకా మోగించాలని కృత నిశ్చయంతో ఉంది. సిట్టింగ్‌ స్థానం కోల్పోకుండా బీఆర్​ఎస్​ ప్రణాళికలు రచిస్తుండగా కేంద్రంలో తిరిగి అధికారంలోకి వస్తామనే ధీమాతో ఉన్న బీజేపీ అధిక సీట్లు సాధించేందుకు కసరత్తులు చేస్తుంది.

Parties Focus On Lok Sabha Elections
Parties Focus On Lok Sabha Elections
author img

By ETV Bharat Telangana Team

Published : Mar 4, 2024, 7:47 PM IST

లోక్​సభ ఎన్నికల్లో సత్తా చాటేందుకు సమాయత్తమవుతున్న ప్రధాన పార్టీలు

Parties Focus On Lok Sabha Elections : ఉమ్మడి మెదక్‌ జిల్లాలో మెదక్‌, జహీరాబాద్‌ రెండు పార్లమెంట్‌ స్థానాలున్నాయి. కంచుకోటగా ఉన్న మెదక్‌ స్థానాన్ని మరోసారి చేజిక్కించుకోవాలని బీఆర్​ఎస్​ ప్రయత్నాలు చేస్తుంది. ఆ నియోజకవర్గాన్ని దక్కించుకొని గులాబీ పార్టీని దెబ్బతీయాలని కాంగ్రెస్‌, బీజేపీ ప్రణాళికలు రచిస్తున్నాయి. ఆ స్థానంలో విజయం సాధిస్తే మిగతా చోట్ల గెలుస్తామన్న సెంటిమెంట్‌తో మెదక్‌ నియోజకవర్గంలో పాగా వేసేందుకు అన్ని పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే తమ అనుచరులతో ప్రచారాన్ని ముమ్మరం చేసిన పార్టీల అభ్యర్థులు తమకే అవకాశం వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ప్రజాదరణ కలిగిన అభ్యర్థులకే ఎంపీ సీటు - ఆశావహుల బలాబలాలపై కాంగ్రెస్​ ప్రత్యేక సర్వే!

Lok Sabha Elections 2024 : ఉమ్మడి మెదక్‌ జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాల్లో గత ఎన్నికల్లో ఏడింటిని బీఆర్​ఎస్ (BRS)​ కైవసం చేసుకుంది. ఈసారి బీఆర్​ఎస్​ అధికారంలో లేకపోవడంతో ప్రధాన పార్టీలు ఆ జిల్లాపై కన్నేశాయి. కాంగ్రెస్‌ నుంచి మెదక్‌ ఎంపీ స్థానాన్ని మైనంపల్లి హనుమంతరావు, నీలం మధు ముదిరాజ్‌ ఆశిస్తున్నారు. ప్రస్తుతం తన కుమారుడు మైనంపల్లి రోహిత్‌రావు మెదక్‌ ఎమ్మెల్యేగా ఉండటంతో ఎంపీ టికెట్‌ ఇవ్వాలని అధిష్ఠానంపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. మెదక్ పార్లమెంట్‌ స్థానంలో దాదాపు 5 లక్షల పైచిలుకు ముదిరాజ్‌ ఓట్లు ఉండటంతో నీలం మధుకు టికెట్‌ ఇస్తే గెలిచి తీరతానని అధిష్టానానికి హమీ ఇచ్చినట్లు ప్రచారం సాగుతోంది. కాగా సామాజిక కార్యక్రమాలు మధుకి కలిసొస్తాయని ఆయన అనుచరులు చెబుతున్నారు.

పార్లమెంట్ ఎన్నికల్లో 12సీట్లకు తగ్గొద్దన్న రేవంత్ రెడ్డి, ఈనెల 26 తర్వాత జిల్లాల పర్యటనలు

లోక్​ సభ ఎన్నికలు : బీజేపీ (BJP) నుంచి దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు, ఆకుల రాజయ్య పేర్లు వినిపించినా ప్రస్తుతం పటాన్‌ చెరులోని పారిశ్రామిక వేత్త అంజిరెడ్డి పేరు ప్రచారంలోకి వచ్చింది. ఆయన సతీమణీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలుగా ఉండటం పార్టీతో సత్సంబంధాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం కొత్తవారికి అవకాశం ఇస్తే పార్టీకి సైతం కొంత బలం చేకూరుతుందని భావిస్తున్నట్లు సమాచారం. వీరిద్దరూ పార్టీలోని పెద్దలను ప్రసన్నం చేసుకునేలా ఇప్పటికే ప్రయత్నాలు మెుదలు పెట్టినట్లు తెలుస్తుంది. బీఆర్​ఎస్​ విషయానికి వస్తే ప్రస్తుతం వంటేరు ప్రతాప్‌రెడ్డి పేరు వినిపిస్తుంది. ఆయనతోపాటు కాంగ్రెస్‌ (Congress) నుంచి పార్టీ మారి బీఆర్​ఎస్​లో చేరిన గాలి అనిల్‌కుమార్‌ పోటీపడుతున్నట్లు సమాచారం. ఎంపీ టికెట్‌ ఆశించే పార్టీలో గాలి అనిల్‌ చేరినట్లు అనుచరులు చెబుతున్నారు. కానీ ప్రతాప్‌రెడ్డికి స్వయంగా మాజీ సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చినట్లు సమాచారం.

ఎన్నికలకు ముందా? ఆ తర్వాతా? - తెలంగాణ పీసీసీ చీఫ్ నియామకంపై జోరుగా చర్చ

'2024లో గెలిచేందుకు విపక్షాలన్నీ ఏకం కావాలి'.. స్టాలిన్​ బర్త్​డే వేడుకల్లో ఖర్గే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.