Panjagutta PS Transfers 2024 Hyderabad : హైదరాబాద్ సీపీ శ్రీనివాస్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కొంతకాలంగా చోటుచేసుకుంటున్న పరిణామాల దృష్ట్యా ఆయన మొత్తం ఠాణాలోని సిబ్బందిని బదిలీ చేశారు. మొత్తం 86 మంది సిబ్బందిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఒకే స్టేషన్‌లో ఇంత మంది బదిలీ అవడం సర్వత్రా చర్చనీయాంశమైంది.
బదిలీ అయిన వారిలో ఆరుగురు ఎస్‌ఐలు, 8 మంది ఏఎస్సైలు, 17 మంది హోంగార్డులు, 50 మందికి పైగా కానిస్టేబుళ్లు ఉన్నారు. హైదరాబాద్‌లోని వివిధ పీఎస్‌ల నుంచి కొత్తగా 82 మంది సిబ్బందిని పంజాగుట్ట పీఎస్‌కు తీసుకొచ్చారు. అయితే సీపీ ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణం ఠాణా నుంచి వివరాలు బయటకు పొక్కడమేనని పోలీసు వర్గాల్లో టాక్. అసలేం జరిగిందంటే?
గత నెల 23న తెల్లవారుజాము 3 గంటల సమయంలో హైదరాబాద్ ప్రజాభవన్ వద్ద ఓ కారు బీభత్సం సృష్టించింది. ప్రజాభవన్ దగ్గర ఉన్న బారికేడ్లపైకి దూసుకెళ్లింది. ఈ విషయాన్ని గమనించిన పోలీసులు వెంటనే కారు దగ్గరకి చేరుకుని వాహనంలో ఉన్న సాహిల్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. అనంతరం అతడిని పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌కు (Panjagutta Police Station) తరలించారు. అక్కడి నుంచి నిందితుడు తప్పించుకుని ఇంటికి వెళ్లిపోయాడు. అతని స్థానంలో తన కారు డ్రైవర్‌ను పంపించాడు. దీంతో ఇన్‌స్పెక్టర్ దుర్గారావు సాయంతో షకీల్ అనుచరులు సాహిల్‌ను దుబాయ్ పారిపోయేందుకు సహకరించారు.
మొన్న మరియమ్మ.. నేడు ఖదీర్ ఖాన్.. పోలీసుల థర్డ్ డిగ్రీతో బలవుతున్న అమాయకులు
EX MLA Shakeel Son Case Updates : రోడ్డు ప్రమాదం జరిగిన రోజు బోధన్ ఇన్‌స్పెక్టర్ ప్రేమ్‌కుమార్ పంజాగుట్ట సీఐతో ఫోన్‌లో మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో పాటు సాహిల్ దుబాయ్ పారిపోయేందుకు అబ్దుల్ వాసే సహకరించినట్లు తేల్చారు. అనంతరం సీసీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాల ఆధారంగా ఉన్నతాధికారులు దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా నిందితుడు, సీఐల ఇద్దరి కాల్ రికార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని పోలీసులు దర్యాప్తు చేసి ప్రేమ్‌కుమార్‌ను అరెస్టు చేశారు. ఈ కేసులో పంజాగుట్ట సీఐ దుర్గారావును సస్పెండ్ చేశారు. బోధన్ ఇన్‌స్పెక్టర్ సహా మరొకరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Panjagutta PS Entire staff Transferred : ఈ క్రమంలో పంజాగుట్ట పోలీస్‌స్టేషన్ సిబ్బంది తీరుపై సీపీ శ్రీనివాస్‌రెడ్డి (Hyderabad CP Srinivas Reddy) సంచలన నిర్ణయం తీసుకున్నారు. పీఎస్ నుంచి కీలకమైన విషయాలు బయటకు పొక్కడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 130కి పైగా సిబ్బంది ఉండే ఈ ఠాణాలో 86 మందిని బదిలీ చేశారు. ఇందులో 82 మందికి పోస్టింగ్ ఇవ్వగా, నలుగురికి ఎలాంటి పోస్టింగ్ ఇవ్వలేదు. ఇన్‌స్పెక్టర్ స్థాయి నుంచి హోంగార్డు వరకు అందర్నీ బదిలీ చేశారు. సిటీ ఆర్మ్‌డ్ రిజర్వు ప్రధాన కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు.
Telangana Police: ఖాకీల అత్యుత్సాహం.. వరుస సంఘటనలతో పోలీసుశాఖకు అప్రతిష్ట
Panjagutta Police Station Controversies : ఇవేకాక పంజాగుట్ట పోలీస్‌స్టేషన్ తరచూ వివాదాల్లో నిలుస్తోంది. ఇటీవల అమీర్‌అలీ అనే దొంగ మద్యం మత్తులో కారు నడుపుతూ పంజాగుట్ట వద్ద బీభత్సం సృష్టించాడు. స్థానికులు అతడిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. గాంధీ ఆసుపత్రిలో వైద్యపరీక్షలకు తరలించగా పోలీసుల కళ్లుగప్పి ఉడాయించాడు. గతంలో ఇదే పోలీస్‌స్టేషన్‌లో పనిచేసిన ఇద్దరు కానిస్టేబుల్స్ పెట్రోలింగ్ విధులు నిర్వర్తించే సమయంలో మద్యం తాగుతూ పట్టుబడ్డారు.
Cops Suspended in Hyderabad : ఇక్కడ పనిచేస్తున్న ఒక ఎస్‌ఐ స్టేషన్‌కు వచ్చే మహిళా బాధితుల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నట్టు ఆరోపణలు వచ్చాయి. నాలుగు సంవత్సరాల క్రితం రౌడీషీటర్లతో స్నేహం చేసి పంచాయితీలకు పాల్పడిన ఇదే ఠాణాలో ఓ ఎస్ఐను విధుల నుంచి తప్పించారు. ప్రస్తుతం పోలీస్‌స్టేషన్‌కు ఫిర్యాదు చేసేందుకు ఎవరొచ్చినా కొందరు ఎస్ఐలు బేరసారాలు ఆడుతున్నట్లు ఆరోపణలున్నాయి.
వివాదాల్లో ఎస్పీలు.. ఐపీఎస్‌లను నియమించకపోవడమే కారణమా..?
ఇదేం తీరు పోలీసన్నా - రక్షించాల్సిన మీరే రాంగ్ రూట్లోకి వెళితే ఎలాగన్నా?