Paddy Crops Drying In Telangana : హన్మకొండ జిల్లా పరకాల రెవెన్యూ డివిజన్ వ్యాప్తంగా వరి, మొక్కజొన్న పంటలు ఎక్కువగా సాగు చేస్తారు. శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్టు (SRSP) కాలువ ద్వారా చెరువులు, కుంటలు నింపుకుని సేద్యం చేసేవారు. కానీ గత సీజన్‌లో భారీ వర్షాల వల్ల కొన్ని చెరువులు, కుంటల కట్టలు తెగిపోయాయి. దీంతో నీరు నిల్వలేక భూగర్భ జలాలు అడుగంటి బోరు బావులు సైతం ఎండి పోయాయి. ఈ పరిస్థితుల్లో ఎస్సారెస్పీ కాలువ నీళ్లు చివరి ఆయకట్టుకు చేరకపోవడంతో పొలాలు బీటలు వారుతున్నాయి. కనీసం పెట్టిన పెట్టుబడి కూడా రావడం కష్టమేనని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
"నీరు లేక వరి పొలాలు ఎండి పోతున్నాయి. ఎస్సారెస్పీ కాలువ ద్వారా 15 రోజులు నీరు విడుదల చేస్తే మేం పంట సాగు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. శ్రీరామ్ సాగర్ నీరు ఇక్కడి నుంచి వెళ్తుండగా ఖమ్మంలో సాగునీరు పుష్కలంగా అందుబాటులో ఉంది. ఇది నాయకుల పొరపాటా లేక నీరు తగినంత లేకనా? తోటలు చివరి దశలో ఉన్నాయి. వరి, మొక్కజొన్న పంటలు ఎండిపోయే దశలో ఉన్నాయి. పెట్టుబడి పెట్టి నష్టపోయే దశలో ఉన్నాం."-రైతులు
SRSP Project 60 Years : ఉత్తర తెలంగాణ వరప్రదాయిని.. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు @ 60 వసంతాలు
Dry Crops in Hanamakonda : వెంటనే అధికారులు చొరవ చూపి ఎస్సారెస్పీ కాలువ (Cannels) ద్వారా నీరు అందిస్తే పంటలు ఎండి పోకుండా కాపాడిన వారవుతారని రైతులు చెబుతున్నారు. గత వర్షాకాలం తీవ్రస్థాయిలో కురిసిన వర్షాల కారణంగా చెరువులు కుంటలు నిండుకుండలా మారి కొన్ని చెరువుల కట్టలు తెగిపోయాయని కనీసం చెరువులకు మరమ్మత్తులు చేస్తే భూగర్భ జలాలు పెరిగి బావుల్లో నీళ్లు ఉండేవని, చెరువులు తెగిపోవడంతో నీరు నిలువలేక బావులు అడుగంటి పోయాయని ఇప్పటికైనా సంబంధిత అధికారులు ప్రజా ప్రతినిధులు పట్టించుకొని చెరువు కట్ట మరమ్మత్తులు చేసినట్లయితే మళ్లీ వర్షాకాలం వరకైనా పంటలు పండే పరిస్థితులు ఉన్నాయని లేనట్లయితే నీళ్లు లేక పంటలు పండక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని రైతులు చెబుతున్నారు.
"గత వర్షాకాలం ఎక్కువ కురిసిన వర్షాల కారణంగా చెరువులు కుంటలు నిండుకుండలా మారి కొన్ని చెరువులు కట్టలు తెగిపోయాయి. కనీస చెరువులకు మరమ్మత్తులు చేస్తే భూగర్భ జలాలు పెరిగి బావుల్లో నీళ్లు ఉండేవి. చెరువులు తెగిపోవడంతో నీరు నిలువలేక బావులు అడుగంటి పోయాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, నాయకులు పట్టించుకొని చెరువు కట్ట మరమ్మత్తులు చేసినట్లయితే మళ్లీ వర్షాకాలం వరకైనా పంటలు పండే పరిస్థితులు వస్తాయి."-రైతులు
Telangana Projects Floods : తెలంగాణ ప్రాజెక్టుల్లో జల సవ్వడులు
SRSP Water Level Update : ఎగువ నుంచి కొనసాగుతున్న వరద.. ఎస్సారెస్పీలో పెరుగుతున్న నీటినిల్వ