ETV Bharat / state

వైఎస్సార్సీపీకి షాక్​ - తిరగబడ్డ ఓటర్లు - తోకముడిచిన లీడర్లు - AP ELECTIONS 2024 POLLING - AP ELECTIONS 2024 POLLING

AP Elections 2024 Updates: నాలుగో విడత సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌లో, ఏపీలో వైసీపీ నేతలకు ప్రజల నుంచి వ్యతిరేకత తప్పలేదు. దర్పం ప్రదర్శించాలనుకున్న వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులకు ఓటర్ల నుంచి వ్యతిరేకత ఎదురైంది. పలు చోట్ల ఎమ్మెల్యే అభ్యర్థులను ఓటర్లు ప్రశ్నించడంతో, వైసీపీ నేతలు ఆగ్రహంతో రెచ్చిపోయారు. దాడులు చేయడానికి సైతం వెనకాడని పరిస్థితిలో ఏపీలో ఎన్నికలు ముగిశాయి.

AP election 2024 updates
AP election 2024 updates (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 14, 2024, 6:56 AM IST

తిరగబడ్డ ఓటర్లు - తోకముడిచిన లీడర్లు (ETV Bharat)

AP Elections 2024 Updates: ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేసి, పోలింగ్‌ బూత్‌ల వద్ద అధికార దర్పం ప్రదర్శించాలని, అరాచకాలు సృష్టించాలని చూసిన కొందరు వైసీపీ అభ్యర్థులకు ఓటర్లు చుక్కలు చూపించారు. పోలింగ్‌ కేంద్రంలోనే, ఓటర్‌పై చేయిచేసుకున్న తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌ను ఓటర్‌ తిరిగి చెంపచెల్లుమనిపించడం సంచలనమైంది. ఇక చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి,వంగా గీత కూడా ఓటర్లు ఆగ్రహాన్ని చవిచూశారు.

నాలుగో విడత సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌లో వైసీపీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ దాష్టీకం దేశవ్యాప్తంగా దుమారం రేపింది. గుంటూరు జిల్లా తెనాలి అయితా నగర్ మున్సిపల్ ప్రాథమిక పాఠశాల పోలింగ్ కేంద్రంలో ఉదయాన్నే ఓటర్లు క్యూకట్టారు. ఉదయం 11 గంటల సమయంలో పోలింగ్‌ కేంద్రానికి ఎమ్మెల్యే కుటుంబ సభ్యులతో కలిసి వచ్చారు. క్యూలైన్‌లో రాకుండా నేరుగా పోలింగ్‌ కేంద్రంలోకి వెళ్లి ఓటేశారు. అప్పటికే రెండుగంటలకుపైగా నిలుచుని ఉన్న సుధాకర్‌ అనే ఓటర్‌ ఎవరైనా క్యూలో రావాలని చెప్పారు. అదే తప్పన్నట్లుగా శివకుమార్‌ సుధాకర్‌ చెంపపై కొట్టారు. అసంకల్పిత ప్రతీకార చర్యలా సుధాకర్‌ కూడా ఎమ్మెల్యేను లాగి ఒక లెంపకాయ వేశారు.

ఇక ఎమ్మెల్యే కుటుంబీకులు, అనుచరులు సుధాకర్‌పై పిడిగుద్దులు కురిపించారు. వారి నుంచి కాపాడిన పోలీసులు, సుధాకర్‌ను ఆస్పత్రికి కాకుండా నేరుగా పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఎమ్మెల్యే దాడి దృశ్యాలు వైరల్‌ కావడంతో పోలీసులు కొన్నిగంటల తర్వాత బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. ఎమ్మెల్యే తనను చంపుతానని బెదిరించినట్లు సుధాకర్‌ వాపోయారు.

తిరుపతి జిల్లా చంద్రగిరిలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఇష్టారాజ్యంగా ప్రవర్తించే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ప్రకాశం జిల్లాలోనూ అలాగే చేయాలని చూసి ఓటర్ల ఆగ్రహానికి గురయ్యారు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గం వీరభద్రాపురంలో సోమవారం సాయంత్రం 6 గంటల తర్వాత కూడా ఓటర్లు క్యూలైన్లో ఉన్నారు. అక్కడ తెదేపాకు ఎక్కువ ఓటింగ్‌ నమోదు అవుతుందనే అనుమానంతో స్థానికేతర వైసీపీ నాయకుల్ని వెంటేసుకుని వెళ్లి పోలింగ్‌ను ఆపే ప్రయత్నం చేశారు. ఐతే తెదేపా నేతలు అభ్యంతరం చెప్పడంతో పోలీసులు వైసీపీ నేతల్ని బయటకు పంపారు. అక్కడి చేరుకున్న రిటర్నింగ్‌ అధికారి శ్రీలేఖతో చెవిరెడ్డి వేలు చూపుతూ దురుసుగా ప్రవర్తించారు. ఇదంతా గమనించిన ఓటర్లు చెవిరెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోవాలని పరోక్షంగా చెప్పారు. గతంలో తమ వద్ద ఎన్నికలు ప్రశాంతంగా జరిగేవని, మీరు వెళ్తే ఓటింగ్‌ జరుగుతుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలో పోలీసులు చెవిరెడ్డిని అక్కడి నుంచి తీసుకెళ్లడంతో పరిస్తితి సద్దుమణిగింది.

రాయలసీమలో రణరంగం - దాడులతో ఓటర్లను భయబ్రాంతులకు గురిచేసిన వైఎస్సార్​సీపీ - YSRCP Leaders Terrorized Voters

ఇక కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం కొండవరంలోని, ఓ పోలింగ్ కేంద్రం పరిశీలనకు వెళ్లిన పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకు ఓటర్ల నుంచి చేదు అనుభవం ఎదురైంది. చేసింది చాలు, ఇంక వెళ్లండి అంటూ గీతకు స్పష్టం చేశారు. అందరికీ డబ్బులు ఇచ్చి మాకెందుకు ఇవ్వలేదు, మా డబ్బులు ఎవరు తినేశారంటూ మరికొందరు నిలదీసేసరికి, ఏంచెప్పాలో తెలియక గీత మౌనంగా కారు ఎక్కి వెళ్ళిపోయారు.

కాకినాడలో నగరం అన్నమ్మఘాటీ సమీపంలోని పోలింగ్‌ స్టేషన్‌ వద్ద మహిళా వాలంటీర్లతో ప్రచారాన్ని అడ్డుకున్న విపక్షాలపై ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి రెచ్చిపోయారు. పోలింగ్‌ స్టేషన్‌కు వచ్చే మహిళలకు ఫ్యాన్‌ గుర్తుకు ఓటేయాలని వాలంటీర్లతో చెప్పిస్తున్నారు. దీనిపై అభ్యంతరం తెలిపిన విపక్షాలతో ద్వారంపూడి వాగ్వాదానికి దిగారు. మళ్లీ అధికారంలోకి వస్తా, నీ లాంటోళ్ల సంగతి తేలుస్తానని భాజపా నేత కొక్కిలిగడ్డ గంగరాజును హెచ్చరించారు. ఈ సమయంలో ఉద్రిక్తత తలెత్తింది. కూటమి నాయకులంతా గోబ్యాక్ అని నినాదాలు చేయడంతో ద్వారంపూడి వెనుదిరిగారు.

ఫిర్యాదులను సమీక్షించి రీపోలింగ్​పై నిర్ణయం- పోలింగ్‌ శాతం పెరిగింది: ముఖేష్ కుమార్ మీనా - CEO Mukesh Kumar Meena

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.