Ongole To Kurnool Damaged Roads Passengers Problems : ఒంగోలు-కర్నూలు ప్రధాన రహదారిపై ఓ 10 కిలోమీటర్ల మార్గం ప్రయాణికులకు నరకం చూపిస్తోంది. గుంతల మధ్య మిగిలిన రోడ్డు అవశేషాలపై వాహనదారులు ప్రయాణాలు సాగించాల్సి వస్తోంది. చీమకుర్తి గ్రానైట్ క్వారీలు ఉన్న చోట రహదారి అధ్వానంగా మారి ప్రమాదాలకు నెలవుగా మారింది.
ఒంగోలు నుంచి కర్నూలు, అటు శ్రీశైలం వెళ్లేందుకు ప్రధాన రహదారి, చీమకుర్తి నుంచి పొదిలి వరకూ దాదాపు 10 కిలోమీటర్ల మేర ధ్వంసమైంది. గ్రానైట్ క్వారీలు ఉండటం వల్ల భారీ వాహనాలు నిత్యం ప్రయాణిస్తుంటాయి. ఫలితంగా రహదారి గుంతలమయమైంది. ఎప్పుడు ఏ వాహనం ఏ గుంతలో ఇరుక్కుపోతుందో అనేంత దారణంగా తయారైంది.
People Facing Problems With Damaged Roads At Prakasam : ఈ రోడ్డుపై ప్రయాణించడం వల్ల ఆటోలు, బైక్‌లు, లారీలు పాడైపోతున్నాయి. అత్యవసర సమయాల్లో ఈ మార్గంలో వెళ్లాలంటే పెద్ద గండం పొంచిఉన్నట్లే. దాదాపు 10 కిలోమీటర్ల మేర రహదారికి ఇరువైపులా డ్రైనేజీ కాలువలు లేకపోవడం వల్ల వర్షపు నీరు రహదారిని ముంచేస్తోంది. వానలు కురిస్తే బురదనీటితోను, లేకపోతే దుమ్ముధూళితో రహదారి నిండిపోతోంది. క్వారీల వ్యర్థాలతో చెలరేగి వాహనదారులు, సమీపంలోని ఇళ్లు, దుకాణదారులకు ఇబ్బందిగా మారింది.
ఇటు, అటూ క్వారీలు ఉండటం వల్ల పెద్ద పెద్ద లారీలు, టిప్పర్లు ఈ రోడ్డును దాటుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి కాని రోడ్డు సరిగ్గా లేక లారీ డ్రైవర్లు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణించాల్సి వస్తుంది.
Damage Roads in Nellore: నెల్లూరులో పాడైపోయిన రోడ్లు..నాలుగేళ్లగా ఒక్క రోడ్డునీ బాగుచేయని ప్రభుత్వం
'నిత్యం వేల సంఖ్యలో బస్సలు, లారీలు, ఆటోలు, ద్విచక్రవాహనాలు తిరుగుతూ ఉంటాయి. ఇక్కడకొచ్చే సరికి ఏ వాహనం ఏ గుంతలో ఇరుక్కుపోతుందో, ఏ ప్రమాదం జరుగుతుందోనని భయం మొదలవుతుంది. ఎన్ని ప్రమాదాలు జరిగినా ఈ రహదారికి మరమ్మతులు చెయ్యడానికి ఏ ప్రభుత్వమూ చొరవ చూపడంలేదు. అత్యవసర పని నిమిత్తం ఈ రోడ్డు దాటుకొని వెళ్ళడం పెద్దగండంలా మారింది. రహదారికి ఇరువైపులో కాలువలు లేకపోవడంతో వర్షపు నీరు రోడ్డు మీద చేరి చెరువులా తయారవుతుంది. వర్షాకాలం బురద నీటితోనూ, ఎండలెక్కితే ధూళితో రహదారి నిండిపోతుంది. ధూళి పీల్చి అనారోగ్యం పాలవుతున్నాం.' - స్థానికులు
Roads Damage in Gudivada: నోరు తెరిచి జగన్‌ను నిధులు అడగలేదా..? అడిగినా ఇవ్వలేదా..!