ETV Bharat / state

'వన్ డిస్ట్రిక్ట్-వన్ ఎగ్జిబిషన్‌'లో అద్భుతమైన ఆవిష్కరణలు - మనిషి లేకుండానే మందుల పిచికారి

author img

By ETV Bharat Telangana Team

Published : Feb 20, 2024, 1:28 PM IST

One District - One Exhibition in Mahbubnagar : వంట చేసే మహిళలకు కష్టాలు తీరే సమయం ఆసన్నమైంది. మందుల పిచికారీలో కూలీల మార్గం సుగమమైంది. రైతులు కరెంటు షాక్​ గురయ్యే ప్రమాదం తగ్గనుంది. వరి పంటలో కలుపు తీయడం తేలికైంది. చేతికొచ్చిన పంట జంతువులు, పక్షుల పాలు కాకుండా ఉండేందుకు పరిష్కారం దొరికింది. వీటన్నింటికీ వన్​ డిస్ట్రిక్​ - వన్​ ఎగ్జిబిషన్​ కార్యక్రమం వేదికైంది. ఇవన్నీ ఎలా సాధ్యమయ్యాయో తెసుకోవాలని ఉందా? అయితే ఈ స్టోరీ చూసేయండి.

One District - One Exhibition Program in Mahbubnagar
One District - One Exhibition Program
'వన్ డిస్ట్రిక్ట్-వన్ ఎగ్జిబిషన్‌'లో అద్భుతమైన ఆవిష్కరణలు - మనిషి లేకుండానే మందుల పిచికారి

One District - One Exhibition in Mahbubnagar : ఆలోచించాలి, ఆవిష్కరించాలి, అద్భుతాలు సృష్టించాలి ఇవే! నేటి యువత మదిలో మెదిలే ఆలోచనలు. అందుకోసం అత్యాధునిక సాంకేతికతను సైతం ఇట్టే అందిపుచ్చుకుంటున్నారు. సమస్య ఏదైనా, పరిష్కారం వైపు వడివడిగా అడుగులేస్తున్నారు. అలాంటి వారి కోసమే టీఎస్​ఐసీ, నాబార్డు సంయుక్తంగా ఒక వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

మహబూబ్​నగర్​ జిల్లా శిల్పారామంలో వన్​ డిస్ట్రిక్ట్​ - వన్​ ఎగ్జిబిషన్​(One District - One Exhibition Programme) కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో 33 జిల్లాల నుంచి ఇంటింటా ఇన్నోవేషన్​గా ఎంపికైన ప్రాజెక్టులను ప్రదర్శించారు. వినూత్నంగా రూపొందించిన ఈ ఆవిష్కరణలు చూపరుల దృష్టిని ఆకట్టుకుంటున్నాయి.

వర్షం పడి నగరాల్లోని రోడ్లన్నీ జలమయమైన సంఘటనలు మనం చూస్తూనే ఉంటాము. ఆ నీటిని మల్లించడం కోసం రోడ్లపై ఉన్న మ్యాన్​హోల్స్​ని తెరుస్తారు. ఆ క్రమంలో డ్రైనేజీలు కనబడక ప్రమాదాలు జరిగిన ఘటనలు చాలనే ఉన్నాయి. ఈ సమస్యకు తాటి భావన అనే విద్యార్థిని పరిష్కారం చూపింది.

"రోడ్డుపై వరదనీరు చేరి మ్యాన్​ హోల్​ వద్ద అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాలను అరికట్టడానికి వాహదారులకు, పాదాచారులకు ఈ ప్రయోగం చక్కగా ఉపయోగపడుతుంది. ఒకవేళ మ్యాన్​హోల్​ మూసి ఉంచితే గ్రీన్​ లైట్​ వెలుగుతుంది. అదే మూసి ఉంటే రెడ్​ లైట్​ వెలుగుతుంది. అదే ఏదైనా ప్రమాదం జరిగితే సౌండ్​ వస్తుంది. మ్యాన్​ హోల్​లో ఇన్ని వైర్లు ఉన్నాయని అవి షాక్​ కొడతాయని అనుకోవద్దు ఎందుకంటే అవి డీసీ కరెంటుతో పని చేస్తాయి. ఈ ప్రాజెక్టు నేషనల్​ లెవెల్​లో ఏడో స్థానం వచ్చింది. స్టేట్​ లెవెల్​లో మొదటిస్థానం. ఈ ప్రాజెక్టుకు ఎంపికై జపాన్​ వెళ్లాను." - తాటి భావన, విద్యార్థిని

New Innovations Programme Conducted by TSIC : చేతికొచ్చిన పంటలకు పక్షులు, జంతువుల బెడద ఎక్కువ. వాటిని నివారించడానికి రైతులు నానా అవస్థలు పడతారు. కానీ అత్యాధునిక పరిజ్ఞానంతో ఈ సమస్యకు చెక్​ పెట్టొచ్చని మరోక విద్యార్థి తాను తయారు చేసిన పరికరాన్ని వివరించారు. అలాగే మరో యువకుడు సైన్యంలో పని చేసి వ్యవసాయం అంటే మక్కువతో రైతులకు ఉపయోగపడే ప్యాడీ స్ప్రింగ్​ వీడర్​ను తయారు చేశారు. సహజమైన పద్ధతిలో కలుపు నివారణ సహా పిలక శాతాన్ని పెంచేందుకు ఈ పరికరాన్ని తయారు చేశానని ఆ వ్యక్తి తెలుపుతున్నారు.

Masti Goli Soda in Karimnagar : సాఫ్ట్‌వేర్​ జాబ్​ విడిచి.. గోలీ సోడాతో హిట్​ కొట్టాడు

మనిషి లేకుండానే మందుల పిచికారీ : పొలాల్లో మనుషుల అవసరం లేకుండా మందుల పిచికారీ చేసే మ్యాజిక్​ స్ప్రియర్(Magic Sprayer) అనే యంత్రాన్ని ప్రవీణ్​ అనే యువకుడు తయారు చేశారు. ఈ యంత్రాన్ని రిమోట్​తో కంట్రోల్​ చేయవచ్చని ఆయన చెబుతున్నారు. దొంగలను పట్టించే సామర్థ్యం కూడా తన ప్రాజెక్టుకు ఉందని పేర్కొన్నారు. మరోవైపు ఇంకో విద్యార్థి తన తల్లి పడే అవస్థను చూసి చలించిపోయి ఫర్టిలైజర్​ ఇంజెక్టర్​ అనే యంత్రాన్ని తయారు చేశారు. దీని వల్ల సులభంగా మొక్కలకు రసాయనాలను ఇవ్వవచ్చని చెబుతున్నారు.

ఇవే కాకుండా రైతులకు ఉపయోగపడే మెకానికల్ కంట్రోల్ టర్న్ ఆన్, ఆఫ్‌ వాల్వ్ సిస్టమ్, వరిలో కలుపునివారణ, పిలకశాతాన్నిపెంచేందుకు ప్యాడీ స్ర్పింగ్‌ వీడర్‌, మల్టీ పర్పస్ స్ప్రే పంపులు, కిసాన్ రిమోట్, ఫర్టిలైజన్ లేయింగ్ మిషన్, ఎలక్ట్రిక్ స్ప్రేయర్, రూం టెంపరేచర్ కంట్రోల్డ్ ఆటోమేటెడ్ ఫ్యాన్ వంటివి ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. యువతలో నైపుణ్యాలకు కొదవలేదు. ఇలాంటి కార్యక్రమాలు వారికి ఎంతో ఊతమిస్తాయి. ఈ ఔత్సాహికులకు సహకారం అందిస్తే మరిన్ని ఆవిష్కరణలకు ప్రాణం పోస్తారు.

'ఇంజినీర్లు, డాక్టర్లు చాలా ఉన్నారులే నాన్న - నేను కళారంగం వైపు అడుగేస్తా'

డిగ్రీలు పూర్తి చేసి - సహజ సిద్దమైన వంట నూనె తయారీ వ్యాపారంలో రాణిస్తున్న ముగ్గురు మిత్రులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.