ETV Bharat / state

వృద్ధుడు నుంచి రూ.13.16 కోట్లు కొట్టేసిన సైబర్​ కేటుగాళ్లు - దర్యాప్తులో పాన్​ ఇండియా సంబంధాలు బహిర్గతం - Stock Market Fraud In Hyderabad

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 7, 2024, 8:55 AM IST

Updated : Sep 7, 2024, 9:09 AM IST

Stock Market Fraud In Hyderabad : దేశంలోనే అతిపెద్ద సైబర్ మోసం కేసు దర్యాప్తును రాష్ట్ర సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో వేగవంతం చేసింది. ఈ కేసులో దేశవ్యాప్తంగా ఉన్న సంబంధాలన్ని బహిర్గతమవుతున్నాయి. హైదరాబాద్ మదీనాగూడకు చెందిన విశ్రాంత ఉద్యోగి నుంచి కాజేసిన సొమ్మును ఎక్కడి తరలించారనే విషయమై కూపీ లాగుతున్న క్రమంలో పలు ఆధారాలు లభ్యమయ్యాయి. ఈ సమాచారాన్ని పోలీసులు ఈడీకి ఇవ్వాలని పోలీసులు భావిస్తున్నారు.

Trading Fraud In Hyderabad
Stock Market Fraud In Hyderabad (ETV Bharat)

Share Trading Fraud Case Update : స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడి పెడితే లాభాలు వస్తాయంటూ హైదరాబాద్‌ మదీనగూడకు చెందిన వృద్ధుడిని మోసగించిన సైబర్‌నేరగాళ్లు రూ. 13.16 కోట్లు కాజేశారు. ఆన్‌లైన్‌ స్టాక్‌ బ్రోకింగ్ గ్రూప్‌లో చేరడంటూ రవి పవగి పేరిట వృద్దుడికి వాట్సప్‌ సందేశం రాగా బాధితుడు క్లిక్‌ చేశాడు. అనంతరం ఎఫ్ఎస్ఎల్, అప్‌స్టాక్స్‌, ఇంటర్నేషనల్‌ బ్రోకర్స్‌ ప్రతినిధులంటూ సైబర్‌ నేరగాళ్లు బాధితుడికి అందుబాటులోకి వచ్చారు. వాట్సప్‌ గ్రూప్‌ల్లో యాడ్‌చేసి బ్యాంకు యాప్‌, యూఆర్ఎల్ లింకులు పంపారు. తాము సూచించిన కంపెనీల ద్వారా ట్రేడింగ్‌ చేస్తే అధిక లాభాలు వస్తాయని నమ్మించారు.

కేసులో బహిర్గతమవుతున్న పాన్‌ఇండియా సంబంధాలు : బాధితుడు పెట్టబడి పెట్టగామొదట లాభాలు చూపించారు. నమ్మిన బాధితుడు రూ.13.16 కోట్ల పెట్టుబడి పెట్టగా స్పందించకుండా పోయారు. మోసపోయినట్లు గ్రహించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సైబర్‌ పోలీసులు కేసును దర్యాప్తు చేసి రెండు రోజుల క్రితం ఇద్దరు నిందితులు సయ్యద్‌ఖాజా, అరఫత్‌ఖలీద్‌ సహా బ్యాంకు ఖాతా సమకూర్చిన మహమ్మద్‌ అథీర్‌ పాషాలను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. ఆ కేసు దర్యాప్తులో పోలీసులకు విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.

కాజేసిన సొమ్మును సైబర్‌ నేరస్తులు దేశవ్యాప్తంగా 30 విడతలుగా పలు బ్యాంక్‌ ఖాతాల్లోకి బదిలీ చేసినట్లు గుర్తించారు. ఈక్రమంలో ఆయా బ్యాంకు ఖాతాదారులను విచారించే పనిలో టీజీసీఎస్బీ బృందం నిమగ్నమైంది. ఆ ఖాతాలన్ని కమిషన్‌కు ఆశపడి బ్యాంక్‌ ఖాతాను సమకూర్చే మ్యూల్ ఖాతాలు కావడంతో కేసును చేధించడం పోలీసులకి సవాల్‌గా మారింది. గతంలో షేర్‌ ట్రేడింగ్‌లో అనుభవమున్న విశ్రాంత ఉద్యోగిని ఎంచుకొని నేరస్థులు గాలమేసినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.

కాజేసిన సొమ్ము మ్యూల్‌ ఖాతాల్లోకి బదిలీ : బాధితుల నుంచి కాజేసిన సొమ్ము తొలుత మ్యూల్‌ ఖాతాల్లోకి బదిలీ చేయించుకొని అనంతరం ఆన్​లైన్​ లావాదేవీల ద్వారానే పలు విడతలుగా ఇతర ఖాతాల్లోకి తరలించినట్లు తేలింది. ఆ తర్వాత ఆ సొమ్ము క్రిప్రో కరెన్సీలోకి మార్చి విదేశాలకు తరలిస్తున్నట్లు వెల్లడైంది. దర్యాప్తులో భాగంగా మ్యూల్‌ అతీర్‌ పాషాతో పాటు, సయ్యద్‌ ఖాజా హసీముద్దీన్‌, అరాఫత్‌ ఖాలేద్‌ మొహియుద్దీన్‌ను అరెస్ట్‌ చేసి విచారించడంతో క్రిప్టో దందా బహిర్గతమైంది.

అంతకు ముందే క్రిప్టోకరెన్సీ లావాదేవీలు చేసే అలవాటున్న హసీముద్దీన్‌, మొహియుద్దీన్‌లకు ఆన్‌లైన్‌లోనే ప్రధాన నిందితుడు పరిచయమైనట్లు విచారణలో తేలింది. క్రిప్టోకరెన్సీని బైనాన్స్‌ ప్లాట్‌ఫామ్‌ ద్వారా కొని ఏంజెల్‌ ఎక్స్‌యాప్‌ ద్వారా అధిక లాభాలను విక్రయించే వీరిద్దరిని ప్రధాన నిందితుడు తన దందాకు వినియోగించకున్నట్లు గుర్తించారు. బాధితుడి నుంచి కొట్టేసిన సొమ్ములో కొంత భాగాన్ని అతీర్‌ పాషా ఖాతాకి ప్రధాన నిందితుడు బదిలీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం మిగతా సొమ్మును క్రిప్టో కరెన్సీలోకి మార్చి విదేశీ ఖాతాలకు బదిలీ చేసే బాధ్యతను హసీముద్దీన్, మొహియుద్దీన్ అప్పగించినట్లు తేలింది.

10నుంచి 20శాతం కమీషన్‌ : ఈ పనికిగాను వారికి 10నుంచి 20శాతం కమీషన్‌ను ప్రధాన నిందితుడు ఆశ చూపినట్లు వెల్లడైంది. ఆన్​లైన్​లోనే పరిచయం కావడంతో ప్రధాన నిందితుడెవరనేది వారికి తెలియకపోవడంతో ఇతర బ్యాంకు ఖాతాల లావాదేవీలపై పోలీసులు దృష్టి సారించారు. గల్ఫ్ దేశాల్లో స్థిరపడిన ప్రధాన నిందితుడు చైనా ముఠాలతో చేతులు కలిపి ఈ తరహా దందా చేస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దేశంలోనే అతి పెద్ద సైబర్ నేరం కావడం, నిధుల మళ్లింపు విదేశాలతో ముడిపడి ఉండటంతో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌కి సమాచారం ఇవ్వాలని పోలీసులు నిర్ణయించారు.

'వాట్సాప్'​కు వచ్చిన లింక్ క్లిక్ చేశాడు - అంతే ఖాతాలో నుంచి రూ.13.26 కోట్లు మాయం - WHATSAPP LINK CYBER FRAUD

పేట్రేగిపోతున్న సైబర్​ నేరాలు - మాయలోకి దించి - నిండా ముంచేసి - Debate On Cyber Crimes

Last Updated : Sep 7, 2024, 9:09 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.