OK Chalo App in Hyderabad : సొంత వాహనం లేదా ఆర్టీసీ బస్సు రెండు అందుబాటులో లేకపోతే ఆటో లేదా క్యాబ్‌ను ఆశ్రయించాల్సి ఉంటుంది. ప్రయాణం సులభంగా సాగడానికి, గమ్యస్థానానికి తొందరగా చేరుకోవడానికి ప్రజలు ఆటో, క్యాబ్‌లను ఆశ్రయించడం మాములైపోయింది. హైదరాబాద్ మహా నగరంలో జనాభా రోజురోజుకూ పెరుగుతుండటంతో ప్రయాణికుల అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని పలు మొబిలిటీ అప్లికేషన్లు అందుబాటులోకి వస్తున్నాయి.
OK Chalo Mobility Service in Hyderabad : కొన్నేళ్ల క్రితం ఉబర్, ఓలా అప్లికేషన్లు రాగా, ఆ తర్వాత ర్యాపిడో వచ్చింది. ప్రస్తుతం మార్కెట్‌లో ఈ అప్లికేషన్లకే అధిక ఆదరణ ఉండడంతో అవకాశాలను అందిపుచ్చుకోడానికి అంకుర సంస్థలు ఈ రంగంలోకి ప్రవేశిస్తున్నాయి. అలాంటిదే పోస్టిలియన్ మొబిలిటీ టెక్నాలజీస్ (Mobility Service) నుంచి వచ్చిన ఓకే చలో అప్లికేషన్. ఇప్పటికే పాతుకుపోయిన అప్లికేషన్లను కాదని, కొత్త అప్లికేషన్‌ల వైపు ప్రయాణికులు చూసేలా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకున్నారు.
నేటి అవసరాలకు తగిన యాప్ రూపకల్పన - లక్షల్లో లాభాలు ఆర్జిస్తున్న యువకుడు
OK Chalo Ride Booking App in Hyderabad : ఓకే చలోలో అత్యవసర బటన్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఒకవేళ ప్రయాణికులు ఏదైనా ప్రమాదంలో ఉన్నారని భావిస్తే, వెంటనే ఈ బటన్‌ను నొక్కితే అందుబాటులోకి వస్తుందని సంస్థ వ్యవస్థాపకుడు తెలిపారు. ఇప్పటికే 4,000 మందికి పైగా డ్రైవర్లు ఓకే చలో అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారని అండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లు అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని వారు వెల్లడించారు.
"ఇతర మొబిలిటీ యాప్స్‌కు మాకు తేడా ఏంటంటే మేము కమీషన్ తీసుకోం. మేము కేవలం 5 రూపాయలు తీసుకుంటాం. మా యాప్ ద్వారా పేమెంట్స్ ఉండవు. కేవలం డ్రైవర్‌కి మాత్రమే ప్రయాణికుడు తన గమ్యస్థానాన్ని చేరుకోగానే ఎంతైతే నగదు చూపిస్తే వాటిని క్యాష్ లేదా యూపీఐ ద్వారా చెల్లిస్తారు. అంతే తప్ప మాకు ఎటువంటి చెల్లింపులు ఉండవు". - ఉదయభాస్కర్, ఓకే చలో వ్యవస్థాపకుడు
ప్రముఖ మొబిలిటీ కంపెనీలలో ప్రయాణికులతో పాటు డ్రైవర్లు కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎక్కడికైనా అత్యవసరంగా వెళ్లాల్సి వస్తే క్యాబ్ బుక్ చేసుకున్న సమయంలో సాంకేతిక సమస్యల వల్ల వెంటనే బుక్ కావట్లేదని, మరికొన్నిసార్లు డ్రైవర్లు క్యాన్సిల్ చేస్తుంటారని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రయాణికులపరంగా సమస్యలను గుర్తించిన పోస్టిలియన్ మొబిలిటీ టెక్నాలజీస్ యాజమాన్యం, డ్రైవర్లు ఎదుర్కొనే సమస్యలపైనా దృష్టి సారించారు.
How to Use Umang App and its Features : ఒక్క ఉమాంగ్ యాప్‌తో ఎన్నో ప్రభుత్వ సేవలు.. ఇలా వాడేయండి!
ఇరువైపుల నుంచి వచ్చిన సమస్యలను పరిగణలోకి తీసుకొని అలాంటివి ఉత్పన్నం కావొద్దనే ఉద్దేశంతో అప్లికేషన్‌ను రూపొందించామని యాజమాన్యం పేర్కొంది. డ్రైవర్లకు, ప్రయాణికులకు అనుకూలంగా ఉండేలా దాదాపు రెండేళ్ల పాటు కష్టపడి అప్లికేషన్‌ను రూపొందించినట్లు నిర్వాహకులు చెబుతున్నారు. ఇలా పోటీతత్వం పెరిగితే డ్రైవర్లకు, ప్రయాణికులకు లాభం చేకూరుతుందని డ్రైవర్ అసోసియేషన్ల నేతలు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ మహానగరంలో ఈ అప్లికేషన్ అందుబాటులోకి వచ్చింది. రాబోయే రోజుల్లో ఇతర మెట్రో సిటీలతో పాటు మిగతా నగరాల్లోనూ అందుబాటులోకి తీసుకురానున్నట్లు సంస్థ సభ్యులు తెలిపారు.
"కొత్త యాప్‌లు రావడం క్యాబ్, ఆటో డ్రైవర్లకు మంచిది. ఇప్పటి వరకు కేవలం రెండు యాప్స్ మాత్రమే మార్కెట్‌ను శాసిస్తున్నాయి. ఇలాంటివి రావడం వల్ల మాకు ఎంతో బాగుంటుంది. ఇటు డ్రైవర్లకు, అటు ప్రయాణికులకు కూడా లాభదాయకంగా ఉంటుంది. హైదరాబాద్‌లో వీటికి మార్కెట్ చాలా బాగుంటుంది." -షేక్ సలావుద్దీన్, గిగ్ వర్కర్స్ యూనియన్
గూగుల్ ప్లేస్టోర్‌కు పోటీగా ఫోన్‌పే 'ఇండస్ యాప్‌స్టోర్'- లాంఛింగ్ డేట్ ఎప్పుడంటే?