ETV Bharat / state

మూడోరోజూ ఉద్రిక్త పరిస్థితుల మధ్య మూసీ నది ప్రక్షాళన - పలు చోట్ల సర్వేకు అడ్డంకులు - Musi River Re survey Update - MUSI RIVER RE SURVEY UPDATE

Musi River Survey 3rd Day : మూసీ నది ప్రక్షాళన కోసం చేపట్టిన సర్వే మూడోరోజు కూడా ఉద్రిక్త పరిస్థితుల మధ్య సాగింది. నిర్వాసితులు సర్వే అధికారులను అడ్డుకోవడమే కాకుండా ఖాళీ చేయించేందుకు తీసుకొచ్చిన డీసీఎం వ్యాన్లను తిప్పి పంపించారు. అడుగడుగునా అధికారులతో వాగ్వాదానికి దిగుతూ ఇళ్లు ఖాళీ చేసేదే లేదని నినాదాలు చేశారు. లంగర్‌హౌస్‌, బహదూర్‌పురాలో పెద్దసంఖ్యలో బాధితులు రోడ్డెక్కి ఆందోళనకు దిగారు. న్యూ మారుతీనగర్‌లో స్థానికులు సర్వే అధికారులపై తిరగబడ్డారు. స్థానికులకు మద్దతుగా ఎంపీ ఈటల రాజేందర్ రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. మరోవైపు నిర్వాసితులను రెండు పడక గదుల ఇళ్లకు తరలించేందుకు జీహెచ్​ఎంసీ 14 మంది హౌసింగ్ సిబ్బందిని ప్రత్యేకంగా నియమించారు.

Govt Conducting Re Survey On Musi River
Govt Conducting Re Survey On Musi River (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 27, 2024, 9:50 PM IST

Govt Conducting Re Survey On Musi River : హైదరాబాద్ మూసీ నది ప్రక్షాళనలో భాగంగా చేపట్టిన సర్వే స్వల్ప ఉద్రిక్తతలకు దారి తీస్తోంది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలోని మూసీ నది గర్భంలో ఉన్న నిర్మాణాలు, నివాసాలను తొలగించేందుకు మూడోరోజు ఆయా జిల్లాల రెవెన్యూ అధికారులు సర్వే కొనసాగించారు. నది గర్భంలో ఉన్న నిర్వాసితులకు నచ్చజెబుతూ మార్కింగ్ వేసేందుకు యత్నించారు. ఈ క్రమంలో చైతన్యపురి డివిజన్ పరిధిలోని గణేష్‌నగర్, న్యూమారుతీ నగర్​లో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. అధికారులు ఇంటికి మార్క్‌ వేయడానికి రాగా ఓ వ్యక్తి కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించాడు.

సర్వే చేసేందుకు వచ్చిన అధికారులపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్కింగ్ చేయకుండా అడ్డుకున్నారు. నదికి సమీపంలోని నివాసాల వద్ద పెద్ద సంఖ్యలో మహిళలు బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వారికి మద్దతుగా మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ అక్కడికి చేరుకొని రోడ్డుపై బైఠాయించి సీఎంపై మండిపడ్డారు. మూసీ ప్రక్షాళన పేరుతో రేవంత్ రెడ్డి రాజకీయం చేస్తున్నారని విమర్శించారు.

డీసీఎంలను అడ్డుకున్న మహిళలు : సాయిబాబా కాలనీలో రెవెన్యూ అధికారులు నిర్వాసితులను ఖాళీ చేయించేందుకు డీసీఎంలను తీసుకురాగా స్థానిక బీజేపీ నాయకులు, మహిళలు అడ్డుకున్నారు. దీంతో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. స్థానికుల్లో కొంతమంది డీసీఎంలను ధ్వంసం చేసేందుకు యత్నించగా డ్రైవర్లు అక్కడి నుంచి వాహనాలను బయటికి తీసుకెళ్లారు. రెవెన్యూ అధికారులపై కూడా స్థానికులు ఎదురుదాడికి దిగడంతో పోలీసులు జోక్యం చేసుకొని అధికారులను అక్కడి నుంచి పంపించారు.

బహదూర్‌పురా, లంగర్‌హౌస్‌లోనూ పెద్ద సంఖ్యలో మూసీ నది వాసులు ఆందోళనకు దిగారు. లంగర్‌హౌస్‌లో ఫిల్లర్ నెంబర్ 102 వద్ద ఆస్రంనగర్ కాలనీకి చెందిన సుమారు 100 మందికి పైగా రహదారిపై బైఠాయించడంతో రాజేంద్రనగర్ నుంచి మెహదీపట్నం వైపు వెళ్లే వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తమ నివాసాలు అన్యాయంగా కూల్చివేస్తున్నారని, ప్రభుత్వం తమ నిర్ణయం పట్ల పునరాలోచన చేయాలంటూ నినాదాలు చేశారు. పోలీసులు కూడా వారిని అదుపు చేయలేకపోయారు. కాసేపటికి కాలనీవాసులే ఆందోళన విరమించడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.

తహసీల్దార్​ కార్యాలయం వద్ద నిరసన తెలిపిన నిర్వాసితులు :బహదూర్‌పురా నియోజకవర్గం కిషన్ బాగ్, అసద్ బాబా నగర్, నంది ముసలైగూడాలోని స్థానికులు తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు భారీ ర్యాలీగా తరలివచ్చారు. బహదూర్ పురా ఎక్స్ రోడ్ వద్ద ఆందోళనకు దిగి నినాదాలు చేశారు. తమ నివాసాలను కూల్చవద్దని, తమకు రెండు పడకల గదుల ఇళ్లు అవసరం లేదని ఆందోళన ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

మూసీ నది గర్భంలోని నిర్వాసితులను తరలించేందుకు జీహెచ్​ఎంసీ ప్రణాళిక సిద్ధం చేసింది. బాధితులకు 14 చోట్ల రెండు పడకల గదుల ఇళ్లు కేటాయించారు. నిర్వాసితులను అందులోకి సురక్షితంగా తరలించేందుకు 14 మంది హౌసింగ్ సిబ్బందిని నియమిస్తూ జీహెచ్ఎంసీ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. పిల్లి గుడిసెలు, జంగమ్మెట్, ప్రతాపసింగారం, సాయిచరణ్ కాలనీ, కమలానగర్, కొల్లూరు-1, గాంధీనగర్, జై భవానీనగర్, తిమ్మాయిగూడ, నార్సింగి, బండ్లగూడ, డి.పోచంపల్లి-2, బాచుపల్లిలో నిర్వాసితులకు రెండు పడకల గదుల ఇళ్లను కేటాయిస్తున్నట్లు ఆమ్రపాలి వెల్లడించారు.

మూసీ ప్రక్షాళన షురూ - పరీవాహక ప్రాంతాల్లో సర్వే స్టార్ట్​ - ఆ భవనాలకు మార్కింగ్ - Musi River Re Survey

'మా ఇళ్లు కూల్చొద్దు' మూసీ రివర్​ బెడ్​ నిర్వాసితుల డిమాండ్ - Residents Protest At MRO Office

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.