Nursing Student Suspicious Death In Bhadradri : భద్రాచలంలో అనుమానాస్పదంగా మృతి చెందిన పారామెడికల్ విద్యార్థిని కారుణ్య కేసులో ఆందోళనలు కొనసాగుతున్నాయి. మారుతి పారామెడికల్ కళాశాల యాజమాన్యం తీరును నిరసిస్తూ కుటుంబ సభ్యులు, బంధువులు, ప్రజాసంఘాలు నిరసనకు దిగాయి. కళాశాల ఛైర్మన్‌పై దాడి యత్నించడం ఉద్రిక్తతలకు దారి తీసింది. పోలీసులు ఆందోళనకారుల్ని అడ్డుకున్నారు. కారుణ్య ఎలా చనిపోయిందో వెంటనే తేల్చాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. కుమార్తె మృతికి న్యాయం చేయాలని కోరుతున్నారు.
విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కళాశాల వద్దకు చేరుకుని యాజమాన్యంతో మాట్లాడారు. ఆయణ్ను చూసిన ఆందోళనకారులు నిందితుల తరఫున వచ్చారా? అని ఎమ్మెల్యేను నిలదీశారు. న కారుణ్య బంధువులు, విద్యార్థి సంఘాలు ఎమ్మెల్యేతో వాగ్వాదానికి దిగారు, ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేయగా, కారుణ్య బంధువులకు సర్దిచెప్పేందుకు ఎమ్మెల్యే యత్నించారు. అయినా వారు వినకపోవడంతో అక్కణ్నుంచి ఆయన వెనుదిరిగారు.
అసలేం జరిగిందంటే?
Students Protest At Bhadrachalam Para Medical College : భద్రాచలంలోని మారుతి పారామెడికల్ కళాశాల విద్యార్థి కారుణ్య అనుమానాస్పద మృతిపై మిస్టరీ వీడలేదు. అల్లారు ముద్దుగా పెంచుకున్న కుమార్తె చనిపోవడం తల్లిదండ్రుల్లో తీవ్ర విషాదం నింపింది. గురువారం తెల్లవారుజామున 3 గంటలకు హాస్టల్ ప్రాంగణంలో రక్తపు మడుగులో పడి ఉన్న కారుణ్యను తోటి విద్యార్థులు భద్రాచలం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కారుణ్య ప్రాణాలు కోల్పోయింది. ఆమె చదువుతున్న కళాశాలలో సుమారు 10 సీసీ కెమెరాలుండగా అందులో కొన్ని పనిచేయడం లేదు. ఆ సమయంలో ఆమె ఎటువైపు వెళ్లింది? ఎలా గాయాలు అయ్యాయి ? అనే విషయాలు రహస్యంగా మారాయి. పోలీసులు కూడా ఈ కోణంలో విచారణ జరుపుతున్నారు.
అసోంలో తెలంగాణ విద్యార్థిని అనుమానాస్పద మృతి
కళాశాల వద్ద బంధువుల ఆందోళన : మారుతి పారామెడికల్ కళాశాల యాజమాన్యం తీరుపై కారుణ్య కుటుంబ సభ్యులు, బంధువులు, విద్యార్థి, ప్రజాసంఘాలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. ఘటనకు సంబంధించి సరైన సమాచారం ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నారు. కారుణ్య మృతికి సమాధానం చెప్పాలని యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తూ నిన్నటి నుంచి ఆమె కుటుంబ సభ్యులు, ప్రజాసంఘాలు ఆందోళన చేస్తున్నాయి. కాలుజారి పటడం వల్లే గాయాలు అయ్యాయని అంటున్నారని అంత పెద్ద గాయాలు ఎలా అవుతాయని ప్రశ్నిస్తున్నారు. బయట నుంచి ఎవరైనా ఆగంతకులు వచ్చి దాడి చేశారా? లేదంటే కళాశాలలోని ఎవరైనా దాడి చేశారా? తేల్చాలని కోరుతున్నారు.
భద్రాచలంలోని మారుతి పారామెడికల్ కళాశాల వద్ద ఇవాళ కూడా కారుణ్య కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వాస్పత్రి నుంచి కళాశాలకు ర్యాలీ నిర్వహించారు. కారుణ్య కుటుంబానికి న్యాయం చేయాలని బంధువుల డిమాండ్ నినాదాలు చేశారు. మారుతి పారామెడికల్ కళాశాల ఛైర్మన్‌పై విద్యార్థులు, బంధువులు దాడికి యత్నించారు. ఈ క్రమంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు. సీసీ కెమెరాల పరిశీలించడం సహా అన్ని కోణాల్లో కారుణ్య మృతిపై వివరాలు సేకరిస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు.
Student Suspicious Death: గిరిజన వసతి గృహంలో దారుణం.. నాలుగో తరగతి విద్యార్థి అనుమానాస్పద మృతి