ETV Bharat / state

'హిడెన్ కెమెరాల ప్రచారం - అదంతా కట్టుకధే'- ఫేక్ న్యూస్ వెనుక హైదరాబాద్ యూట్యూబర్? - Nude calls controversy IN AP - NUDE CALLS CONTROVERSY IN AP

Hidden Cameras Incident in AP : కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజినీరింగ్‌ కళాశాలలో హిడెన్‌ కెమెరాల వ్యవహారంలో విచారణ బృందం వాస్తవాలను వెలికితీసింది. ముగ్గురు ఐజీ, ఒక ఎస్పీ స్థాయి అధికారుల పర్యవేక్షణలో సాగుతున్న దర్యాప్తు బృందం, సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వదంతుల వ్యాప్తిపైనా దృష్టి సారించింది. ‘కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీం (సీఈఆర్‌టీ) డైరెక్టర్‌ నేతృత్వంలో మరో ముగ్గురు నిపుణులు, సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌ కంప్యూటింగ్‌ (సి-డాక్‌)కు చెందిన ఇద్దరు నిపుణులతో కూడిన బృందం కూడా కళాశాలలో అన్ని కోణాల్లో పరిశీలన చేసింది.

Hidden Cameras Incident in AP
Nude calls controversy is the Reason (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 4, 2024, 2:16 PM IST

Nude calls controversy is the Reason: ఐదుగురు ఇంజనీరింగ్‌ విద్యార్థులే కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్‌ కళాశాల రహస్య కెమెరాల వివాదానికి ప్రధాన కారణమని నిపుణులు, పోలీసులు నిర్దారణకు వచ్చారు. కళాశాలకు చెందిన ఒక విద్యార్ధి అమ్మాయిని వలలో వేసుకుని ఆమెతో మాట్లాడిన న్యూడ్‌ కాల్‌ను రికార్డు చేశారు. ఆ రికార్డు చేసిన ఇంజనీరింగ్‌ విద్యార్థి, విద్యార్ధిని, ప్రియుడితో హోటల్‌ గదికి వెళ్లిన మరో విద్యార్ధిని, ఆమెకు వన్‌సైడ్‌ ప్రేమికుడు ఇంకొకరు, చెల్లిని మోసం చేసిన స్నేహితుడి అంతు చూడాలనుకున్న ఇంకో విద్యార్థి.

ఇలా మొత్తం ఐదుగురు విద్యార్ధుల మధ్య సాగిన అంతర్గత వివాదమే కేంద్ర బిందువుగా తేల్చారు. ఫైనల్‌గా ఒక అమ్మాయి హిడెన్‌ కెమెరాలతో వసతి గదులు, స్నానపు గదుల్లో విద్యార్థినుల నగ్న వీడియోలు రికార్డు చేసి అబ్బాయిలకు విక్రయిస్తున్నట్లు పుట్టించిన వార్తల్లో నిజం లేదన్న నిర్ణారణకు అటు పోలీసులు, ఇటు సాంకేతిక విచారణ బృందాలు వచ్చాయి.

ఈ వ్యవహారాన్ని చంద్రబాబు, లోకేశ్‌ సీరియస్‌గా తీసుకుని ముగ్గురు ఐజీలు జీవీజీ అశోక్‌కుమార్‌ , పీహెచ్‌డీ రామకృష్ణ, ఎం. రవిప్రకాశ్‌తో కూడిన బృందాన్ని రంగంలోకి దించారు. వారు కళాశాల నెట్‌వర్క్‌ సిస్టం, కంప్యూటర్‌లలో ఉన్న డేటా మొత్తం సేకరించారు. కళాశాల, వసతి గృహాల్లో ఏవైనా రహస్య కెమెరాలు, ఎలక్ట్రానిక్‌ గాడ్జెట్స్‌ వినియోగించారా లేదా అన్న విషయంపైనా విశ్లేషణ నిర్వహించారు. ఈ విశ్లేషణల్లో ఫైనల్‌గా ఎలాంటి అనుమానాలు, సందేహాలు ఉన్నా వాటిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు.

ఇలా తేల్చారు : మరోవైపు దేశంలోనే ప్రతిష్టాత్మక టెక్నికల్‌ సంస్థ సెర్ట్‌ డైరెక్టర్‌ సంజయ్‌ బాహ్ల్‌ నేరుగా కళశాల వ్యవహారంపై విచారణ చేశారు. పుణె సీ-డాక్‌ నిపుణుల బృందం కాలేజీకి చేరుకుని విద్యార్థి సంఘాల నేతలు, కళాశాల సిబ్బంది సమక్షంలో హాస్టల్‌ స్నానాల గదుల్లోని ఎలక్టికల్‌, ప్లంబింగ్‌ పరికరాలన్నీ ఎలక్ట్రానిక్ డిటెక్టర్లతో పరిశీలించింది.

ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు విద్యార్థుల సెల్‌ఫోన్లు, ల్యాప్‌ టాప్‌లు, మరో ఇద్దరు అబ్బాయిల వద్ద ఉన్న ఎలక్ట్రానిక్ పరికరాలు, హాస్టల్‌లోని వై-ఫై రూటర్లను సెర్ట్‌ విశ్లేషణ చేస్తోంది. ఎక్కడ రహస్య కెమెరా పెట్టినా వై-ఫై ద్వారా నెట్‌ వాడి వాటిని బయటికి ట్రాన్స్‌మిట్‌ చేయాలి. ఒకవేళ మొబైల్‌ ఫోన్ల హాట్‌స్పాట్‌ తీసుకున్నా ఎవరెవరు హాట్‌స్పాట్‌ ఎవరికి ఇచ్చారనేది కూడా తేల్చేపనిలో సెర్ట్‌, సీ-డాక్‌ బృందం నిమగ్నమైంది. కాగా, ఇప్పటి వరకూ జరిగిన ప్రచారంలో నిజాల్లేవని నిపుణులు, పోలీసులు నిర్ధారణకు వచ్చారు.

ప్రేమ పేరుతో అమ్మాయిలను వలలో వేసుకునే విద్యార్థికి అదే కళాశాలలో మరో విద్యార్థినితో ప్రేమ వ్యవహారం ఉంది. ఆ ఇద్దరికీ న్యూడ్‌ వీడియో కాల్స్‌ చేసుకోవడం రోజూ అలవాటే. ప్రియురాలికి తెలియకుండా ప్రేమికుడు వాటిని రికార్డు చేస్తుండేవాడు. ఇలా రికార్డు చేసిన వీడియోను అతని స్నేహితుడు చూశాడు. వెంటనే ఆ విషయాన్ని రికార్డు చేసిన ప్రేమికుడి, ప్రేమికురాలి మరో స్నేహితుడికి ఈ విషయాన్ని అతను చేరవేశాడు. ఆమెను వన్‌సైడ్‌ లవ్‌ చేస్తున్న విద్యార్థి ఇదేమిటని ప్రశ్నించడంతో ఆమె వివాదం ప్రారంభమైంది.

ఇది చినికి చినికి పెద్దదైంది. వీడియో రికార్డు చేసిన ప్రేమికుడు ఓరేయ్‌ నీ ఇంటికి వచ్చినప్పుడు నీ చెల్లిని లైన్లో పెట్టా ఆమె వీడియోలు కూడా నా వద్ద ఉన్నాయి. వాటిని అందరికీ పంపుతా అని బెదిరించాడు. దీంతో వివాదం కళాశాల ప్రిన్సిపాల్‌కు చేరింది. ప్రిన్సిపాల్‌ పిలిచి విచారించగా ఏడెనిమిది ఫొటోలు బయటికి వచ్చాయి. అందరినీ హెచ్చరించి వివాదాన్ని మూసేశారు.

ఫేక్‌ న్యూస్‌ వెనుక యూట్యూబర్‌ : ఇదే కళాశాలలో చదువుకొని మధ్యలో మానేసిన విద్యార్థి ఒకరు హైదరాబాద్‌లో యూట్యూబర్‌గా వ్యవహరిస్తూ కళాశాల విద్యార్థులతో వాట్సాప్ గ్రూపులు నిర్వహిస్తున్నారు. కళాశాల వివాదాన్ని తనకు అనుకూలంగా మార్చుకొని అక్కడి నుంచే నియంత్రిస్తూ ఏమేం చేయాలో సమాచారం ఇస్తున్నట్లు కూడా పోలీసులు గుర్తించారు. కళాశాల వసతిగృహంలో గత గురువారం నుంచి కొనసాగుతున్న ప్రతి ఘటనకు సంబంధించిన సమాచారం, వీడి యోలను విద్యార్థులు అతడికి చేరవేస్తున్నట్లు వాటిని అతడు వాట్సాప్‌ సమూహాల్లో, యూట్యూబ్లో షేర్ చేస్తూ దుష్ప్రచారం చేస్తు న్నట్లు గుర్తించారు.
ఐదుగురు అల్లిన 'ప్రేమ'కథా చిత్రమ్ - ఏపీలో 'హిడెన్ కెమెరాల' వ్యవహారంలో క్రేజీ ట్విస్ట్ - Hidden Cameras Incident in AP

బీటెక్​ కాలేజీలో దారుణం - అమ్మాయిల​​ వాష్​రూమ్​లో హిడెన్​ కెమెరాలు - అబ్బాయిలకు వీడియోలు విక్రయం! - HIDDEN CAMERAS IN GIRLS WASHROOMS

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.